లోకసభ ఎన్నికలలో 15  కాంగ్రెస్ ఒకటి సిపిఐ... రేవంత్ వ్యూహం ఇదేనా ?

Publish Date:Jan 4, 2024

Advertisement

తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్ తో పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ స్థానాలలో గెలుపొందే దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో ఎన్డిఏ కూటమిని దించడానికి ఏర్పాటైన ఇండియా కూటమి దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి కేంద్రీకరించింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ హస్తగతం కావడంతో మరింత ఉత్సాహంతో అడుగులు వేస్తోంది.
తెలంగాణలో మొత్తం 17 లోక సభ నియోజకవర్గాలలో 15 స్థానాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటు ఎన్నికలలో సిపిఐతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా మిత్ర ధర్మం పాటించాలని కాంగ్రెస్, సిపిఐలు భావిస్తున్నాయి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ కమ్యూనిస్ట్ లకు కంచుకోట అయిన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేయవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. గతంలో తాను పోటీ చేసిన ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని సిపిఐ అధిష్టానం ఇప్పటికే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇటీవలి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కొత్తగూడెం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావ్ తరపున నారాయణ విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద్యమాలే ఊపిరిగా ప్రజా క్షేతంలో ఉన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలను తెలంగాణలో కనిపించకుండా బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ వేసిన స్కెచ్ లో సిపిఐ,సిపిఎం పార్టీలు బలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్ ) అభ్యర్థి గెలుపుకు కృషి చేశాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలలో కూడా మిత్రధర్మాన్ని పాటించాలని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు అనుకున్నప్పటికీ కెసీఆర్ పొమ్మనక పొగ బెట్టాడు.  కమ్యూనిస్ట్ లను దగ్గరకు రానీయకపోవడానికి మరో కారణం ఉంది.  దేశ రాజకీయాల్లో బిజెపి కూటమి  ఎన్ డి ఏ వర్సెస్ కాంగ్రెస్  కూటమి ఇండియా ఉంది. ఇండియా కూటమిలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి.  ఈ కారణంగానే బిఆర్ఎస్ కమ్యూనిస్ట్ పార్టీలతో ఎటువంటి చర్చలు జరపకుండా మొత్తం 119 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది.  దీంతో ఇండియా కూటమికి నేతృతం వహిస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలకు ఆపన్న హస్తం అందించింది. సీట్ల సర్దుబాటులో కొత్తగూడెం సిపిఐ కి కేటాయించింది. 1999 అసెంబ్లీ ఎన్నికలలో సిపిఐ అభ్యర్థిగా గెలిచిన కూనంనేని సాంబశివరావు కే ఈ సారి టికెట్ ఇచ్చి గెలిపించుకుంది. ఈ ఎన్నికలలో  బిజెపి బి టీం బిఆర్ఎస్ అని తెలంగాణ  ప్రజలకు అర్థం అయ్యింది. రాజకీయాలలో టక్కుటమారా గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన కెసీఆర్ ఈ ఎన్నికలలో హ్యట్రిక్  కొట్టాలని ఆశించి భంగపడ్డారు. గత ఎన్నికల ఫలితాల తర్వాత  ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీ కనబడకుండా కెసీఆర్ వేసిన ఎత్తుగడ. మెజార్టీ స్థానాలు టిఆర్ఎస్ గెలిచినప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బిఆర్ఎస్ లో చేర్చుకుంది. ఈ ఎన్నికలలో  కాంగ్రెస్ వేవ్ తీవ్రంగా ఉండటంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. కమ్యూనిస్ట్ లు కాంగ్రెస్ ను గెలిపించారు. సీట్ల సర్దుబాట్లలో సిపిఎం కు మిర్యాలగూడ ఇస్తామని కాంగ్రెస్ హామి ఇచ్చినప్పటికీ సిపిఎం కినుక వహించి వైదొలగింది. సిపిఎం ఒంటరిగా 19 స్థానాల్లో పోటీచేసి అన్ని స్థానాల్లో ఓడిపోయింది. లోకసభ ఎన్నికలలో తిరిగి కాంగ్రెస్ పార్టీతో మైత్రి కొనసాగించాలని సిపిఎం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

By
en-us Political News

  
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.