అమరావతి శంకుస్థాపనకు ఏడేళ్లు.. నిలిచేది.. గెలిచేదీ అమరావతే!

Publish Date:Oct 22, 2022

Advertisement

నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి సరిగ్గా ఏడేళ్లు. ఏడేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున అంటే 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోడీ   ఉద్దండరాయునిపాలెంలో రాజధాని నగర నిర్మాణానికి  శంకుస్థాపన  చేశారు. సరిగ్గా వారం తరువాత అంటే  2016 అక్టోబరు 28న  పరిపాలనా భవన సముదాయానికి   అప్పటి కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి  ఎం. వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేసారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగి సరిగ్గా ఏడేళ్లయిన సందర్భంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా  ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధానికి శంకుస్థాపన జరిగిందన్నారు. ఆనాడు తామంతా కనీసం వెయ్యేళ్ల పాటు తెలుగుజాతి గుండె చప్పుడుగా అమరావతి నిలుస్తుందని, నిలవాలనీ ఆకాంక్షించామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ తుగ్లక్ విధానాల కారణంగా ఆ ఆకాంక్ష నెరవేరలేదనీ, చేసిన అభివృద్ధి అంతా నాశనమైందని ఆవేదన వ్యక్తం చేశారు.  అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగం, కోట్లాది మంది ఆంధ్రుల సంకల్పంగా అభివర్ణించిన చంద్రబాబు.. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అందరూ అమరావతిని తమకు గర్వకారణంగా భావించారన్నారు. 2019 ఎన్నికలకు ముందు అమరావతిని స్వాగతించిన జగన్... అధికారంలోకి రాగానే మాట మార్చి, మడమ తిప్పి ఆంధ్రులను మోసం చేశారని  విమర్శించారు. అమరావతి రైతుల మహా పాదయాత్రపై వైసీపీ కుతంత్రాలు సాగవని అన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతే అని... అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుందని చెప్పారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరి తీరుతుందన్నారు.అమరావతే నిలుస్తుందని, అమరావతే గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ అప్పట్లో పార్లమెంటు ప్రాంగణం నుంచి మట్టి, యమునా నది నుంచి నీరు తీసుకుని వచ్చారు.   దేశంలోని పట్టణాలు, నగరాల అభివృద్ధికి అమరావతి దిక్సూచి కావాలని ఆయన ఆకాంక్షించారు.  తాను నీరు, మట్టి తీసుకురావడాన్ని ఆషామాషీగా తీసుకోవద్దనీ, ఏకంగా దేశ రాజధానే ఏపీ రాజధాని అమరావతిలో కలవడానికి వచ్చిందనడానికి ఇది సంకేతమనీ  ఏపీ చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం   భుజం కలిపి నడుస్తుందనడానికి ఇది సూచన అనీ మోడీ అప్పట్లో చెప్పారు. కానీ వాస్తవంలో అందుకు భిన్నంగా జరిగింది. అమరావతి నిర్మాణానికి అరకొర నిధులు కేటాయిస్తూ వచ్చిన మోడీ సర్కార్.. ఏపీ అభివృద్ధి పట్ల చిన్న చూపు చూసింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తరువాత ఏపీ అభివృద్ధిని జగన్ గాలికొదిలేశారు. అంతే కాదు.. స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిని కాదని మూడు రాజధానులంటూ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి రైతులు మహోద్యమం చేపడితే ఆ ఉద్యమాన్ని అణచివేయడానికి నానా విధాలుగా ప్రయత్నించారు. అన్నిటినీ ఎదుర్కొని రైతులు మొక్కవోని ధైర్యంతో, సడలని పట్టుదలతో అమరావతే ఏపీ ఏకైక రాజధాని అని నినదిస్తూ ముందుకు సాగుతున్నారు. ఆ విషయాలన్నీ ప్రస్తావించిన చంద్రబాబు.. చివరకు అమరావతే నిలుస్తుంది... అమరావతే గెలుస్తుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. 

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.