తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందుకు బుధవారం (సెప్టెంబర్ 2) రోజంతా ఢిల్లీ వేదికగా జరిగిన హై డ్రామాయే కారణం. కొండా సురేఖ వ్యవహారంపై హస్తినలో బుధవారం (సెప్టెంబర్ 2) కీలక పరిణామాలు జరిగాయి. ఒక వైపు ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. మరో వైపు కొండా సురేఖ కోరినప్పటికీ వారి అప్పాయింట్ మెంట్ ఆమెకు దొరక లేదు. దీనిని బట్టే కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ కాకుండా పరిశీలకుల్లో సైతం వ్యక్తమైంది.
అయితే ఈ విషయంలో కొండా సురేఖ.. హైకమాండ్ నిర్ణయంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విష్లేసిస్తున్నారు. ఇందుకు ఆమె మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా చూపుతున్నారు. హస్తిన వేదికగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణిలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరునూ నిలదీశారు. హైకమాండ్ బీసీలపై ఆరోపణలు వస్తే ఒకలాగా, ఇతరులపై ఆరోపణలు వస్తే మరొకలాగా స్పందిస్తారా అని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పేరెత్తకుండానే నిలదీశారు.
ఇక తన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ.. పార్టీ తీసుకునే నిర్ణయంపైనే తన కార్యాచరణ అధారపడి ఉంటుందని అన్యాపదేశంగా ఒక వేళ తనను కేబినెట్ నుంచి తొలగిస్తే.. పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని చెప్పారు. ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ఈ పరిణామం నిస్పందేహంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని అంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఏం నిర్ణయిస్తుందో.. కొండా సురేఖ ఏ నిర్ణయం తీసుకుంటారో?
[Konda Surekha Goodbye to Congress, Resign, MLA, Warangal East, By Election, Telangana Politics, Telugu One]
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/konda-surekha-goodbye-to-congress-25-230587.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.
Publish Date:Aug 31, 2026
రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న రాజకీయ సమీకరణాలపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.