జడ్ ప్లస్ భద్రత కోసం హైకోర్టుకు జగన్.. పిటిషన్ విచారణ వాయిదా

Publish Date:May 10, 2025

Advertisement

కిందపడ్డా నాదే పై చేయి అంటూ బుకాయించడంలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ప్రస్తుత ఎమ్మెల్యే జగన్ దిట్ట.  సానుభూతి కోసం తనపై తానే దాడులు చేయించుకున్న చరిత్ర ఆయనది. గులకరాయి దాడి ఆ కోవలోకే వస్తుంది. ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు సైతం అప్పట్లో అంతర్గత సంభాషణల్లో అంగీకరించారు. అన్నిటికీ మించి అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నట్లుగా జగన్ వ్యవహార శైలి ఉంటుందన్నది ఇప్పటికే పలుమార్లు రుజువైంది.  

ఇక 2019 ఎణ్నికలలో విజయం కోసం బాబాయ్ హత్య, కోడికత్తి వంటి జగన్ డ్రామాల గురించి ఎంత చెప్పినా తక్కువే.  ఇలా రకరకాల విన్యాసాలతో పాటు ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టిన జగన్ ఐదేళ్లు ఏపీ ప్ర‌జ‌ల‌కు న‌ర‌కం చూపించారు. జగన్ హ‌యాంలో పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌లు ప‌నుల‌కోసం ఇత‌ర రాష్ట్రాల‌కు వ‌ల‌స వెళ్లిన ప‌రిస్థితి ఏర్పడింది.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటూ వేధింపులు, ప్రతీకారమే పాలన అన్నట్లుగా జగన్ ఐదేళ్ల పాటు రాష్ట్ర ప్రజలను వేధించారు. ఆయన పాలనలో ఏ వర్గమూ కూడా హ్యాపీగా లేదు. జగన్ అరాచక పాలనకు విసిగిపోయిన ఏపీ జనం,   2024 ఎన్నిక‌ల్లో ఏ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, వైసీపీ నేత‌ల‌కు గ‌ట్టి గుణ‌పాఠం చెప్పారు.  కేవ‌లం 11 సీట్ల‌లో మాత్ర‌మే వైసీపీ అభ్య‌ర్థులు విజ‌యం సాధించారు. అంటే.. వైసీపీకి ప్ర‌తిప‌క్ష హోదాకూడా ఏపీ ప్ర‌జ‌లు ఇవ్వ‌లేదు.

అయినా జగన్ ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు.   ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ వ‌స్తాన‌ని భీష్మించుకు కూర్చున్నారు. తీరా అసెంబ్లీ సభ్యత్వం పోతుందన్న భయంతో మొక్కుబడిగా ఒక సారి అసెంబ్లీకి హాజరై మమ అనిపించారు. ఇప్పుడు తాను సీఎంగా ఉండగా ఏ విధంగా అయితే జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేదో.. ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా కూడా తనకు అటువంటి భద్రతే కావాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. తనకు జడ్ ప్లస్ భద్రత పునరుద్ధరించాలంటూ ఆయన గురువారం (మే 8)న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, అందుకే సీఎంగా గతంలో తనకు ఏ విధంగా జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉండేదో.. అలాగే ఇప్పుడు కూడా దానిని కల్పించాలనీ, అలా జడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ జగన్ ఆ పిటిషన్ లో కోరారు. జగన్ పిటిషన్ శుక్రవారం ( మే 9) విచారణకు వచ్చింది.  కోర్టు ఆ పిటిషన్ పై తక్షణ నిర్ణయం వెలువరిస్తుందని జగన్ ఆశించారు. అయితే కోర్టు మాత్రం పిటిషన్ విచారణను వేసవి సెలవుల తరువాతకు వాయిదా వేసింది.  దీంతో జగన్ కు హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలినట్లైంది. 

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.