ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఉచ్చు బిగుస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ఈడీ జగన్ ను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఈ భారీ కుంభకోణానికి సంబంధించి జగన్ మోహన్ రెడ్డికి ఈడీ త్వరలోనే నోటీసులు జారీ చేసి, విచారణకు పిలిచే అవకాశం ఉందంటూ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. గతంలో అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొన్న జగన్.. దాదాపు దశాబ్దం తరువాత మద్యం కేసులో మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్నారు.
దేశంలోనే రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో జరిగిన అత్యంత పెద్ద ఆర్థిక మోసాలలో ఒకటిగా, ఏపీ మద్యం కుంభకోణాన్ని చెబుతారు. ఈ కేసులో భారీ మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ సీఎంగా ఉన్న కాలంలోనే ఈ మొత్తం వ్యవహారం నడిచినట్లు ఆరోపణలున్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ లిక్కర్ స్కామ్ విలువ 3,200 కోట్లుగా దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఇంతటి భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టడం, ప్రభుత్వ ఖజానాకు గండి పడటాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ తీవ్రంగా పరిగణిస్తోంది. నాణ్యత లేని మద్యం సరఫరా చేయడంతో పాటు, కేవలం నగదు రూపంలోనే (క్యాష్ ఓన్లీ) లావాదేవీలు సాగించడం ఈ కుంభకోణంలో ప్రధానమైన అంశం. డిజిటల్ పేమెంట్లను అనుమతించకపోవడం వెనుక వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి.
ఏపీ మద్యం కుంభకోణం విచారణలో భాగంగా ఈడీ ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన కీలక నేతలను విచారించింది. వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి వంటి ప్రముఖులు కూడా ఈడీ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. ఈ విచారణల ద్వారా జగన్ హయాంలో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించి కీలకమైన, తిరుగులేని ఆధారాలను ఈడీ సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో లభించిన డాక్యుమెంట్లు, డిజిటల్ సాక్ష్యాల ఆధారంగానే ఈడీ జగన్ ను విచారించాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.
రాజకీయ, అధికార వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏపీ మద్యం కుంభకోణం అవినీతి సొమ్ములో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలను అక్రమమార్గాల ద్వారా దుబాయ్‌కు తరలించారు. అందుకు సంబంధించిన ఆధారాలతోనే ఈడీ జగన్ ను విచారణకు పిలవనుందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sensation-in-ap-liquor-scam-36-221968.html
తమిళనాడుకు చెందిన నవనీతమ్మ తిరుపతిలోనే నివసిస్తున్నారు. శనివారం జులై 4)ఆమె కాలినడకన తిరుమల శ్రీవారి కొండను అధిరోహిస్తున్న సమయంలో తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. ఆమె అచంచల భక్తి విశ్వాసాలకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు ఫిదా అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు.
రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు ప్రారంభోత్సవం చేశారు. 16 వేల350 కోట్లరూపాయల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ ఉక్కు కర్మాగారంతో పాటు దానికి అనుబంధంగా రాబోయే గ్రీన్ ఎనర్జీ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులను కూడా ఆయన ప్రారంభించారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ నాట్ బ్రంట్ అసాధారణ పోరాట పటిమను కనబరిచి.. కేవలం 53 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. ఫ్రేయా కెంప్ కూడా 28 బంతుల్లోనే 44 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది.
బైక్ నడుపుతున్న వ్యక్తి ఆ మహిళను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్దం చేసుకున్న తారిఖ్.. దుండగుడిని గట్టిగా ప్రతిఘటించాడు. దీంతో ఆ దుండగుడు తుపాకీతో తాఱీఖ్ పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తారిఖ్ అక్కడికక్కడే మరణించాడు.
ఆందోళనకారులపై పోలీసులు, రేంజర్లు.. టియర్ గ్యాస్ షెల్లింగ్, కాల్పులకు తెగబడ్డారు. అన్బ్ ప్రాంతంలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మహ్మద్ యాకూబ్ అనే సామాన్య పౌరుడు మరణించాడు. మరో నలుగురు యువకులు తీవ్రంగా గాయపడి.. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.
క్షణ విషయంలో నాటో సభ్య దేశాలు అమెరికాపై అతిగా ఆధారపడే విధానానికి స్వస్తి పలకడం కోసమే ట్రంప్ ఈమాండ్ తెరపైకి తీసుకువచ్చారని శ్వేత సౌధ సీనియర్ అధికారులు చెబుతున్నారు. ==
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఒక మండుతున్న అగ్నిపర్వతంగా మారింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 28 అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబానికి చెందిన మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యుద్ధనౌకకు సంబంధించిన ప్రధాన నావికాదళ ఫిరంగులు, ఆటోమేటిక్ గన్నులు, రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్‌ల పనితీరును కూడా కిమ్ స్వయంగా పరిశీలించి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.