సీనియర్ జర్నలిస్టు కంచర్ల రామయ్య కన్నుమూత
Publish Date:Jun 19, 2025

Advertisement
ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తండ్రి కంచర్ల రామయ్య కన్నుమూశారు. సీనియర్ జర్నలిస్టు, ఎపియుడబ్యుజె రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కంచర్ల రామయ్య గురువారం (జూన్ 19) మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో తీసుకుంటున్న ఆయన హైదరాబాద్ లో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం (జూన్ 20) ఉధయానికి ఆయన భౌతిక కాయాన్ని కందుకూరుకు తీసుకువెడతారు. కందుకూరులో శనివారం (జూన్ 21) ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
ఎందరినో జర్నలిస్టులు గా తీర్చిదిద్ది, జర్నలిస్టు యూనియన్ లో కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన రామయ్య మృతి తీరని లోటు అంటూ పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కంచర్ల రామయ్యకు ప్రజాసమస్యల పరిష్కారంకోసం కృషి చేయడంలో ఆయన ఎన్నడూ వెనుకడుగు వేసేవారు కాదు. జర్నలిస్టుగా ఆ పని చేసిన కంచర్ల రామయ్య మరింతగా ప్రజలతో మమేకం కావడానికి, వారి సమస్యల పరిష్కారంలో మరింత చొరవచూపడానికి చట్టసభలో అడుగుపెట్టాలని భావించే వారు. ఆయన కోరుకున్నట్లు ఆయనకు కందుకూరు తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని అప్పట్లో ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే కొన్ని పరిస్థితుల కారణంగా ఆయన నాడు పోటీ చేయలేదు. అయితే ఆయన కోరికను కుమారుడు కంచర్ల శ్రీకాంత్ తీర్చారు. 2023లో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
చంద్రబాబు సంతాపం
జర్నలిస్టుగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడమే కాకుండా, ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజీని స్థాపించి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేసిన కంచర్ల రామయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
http://www.teluguone.com/news/content/senior-journalist-kancharla-ramayya-no-more-39-200315.html












