నగరిలో రోజా సీన్ సితారేనా?.. మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటేనా?

Publish Date:Oct 18, 2022

Advertisement

ఇంట్లో ఈగల మోత... బయట పల్లకీల మోత అన్న సామెత కొంచం అటూ ఇటూగా మంత్రి రోజాకు అతికినట్లు సరిపోతుంది. నటిగా, రాజకీయ నాయకురాలిగా ఫైర్ బ్రాండ్ ముద్ర వేయించుకున్న రోజాకు మంత్రి పదవి చేపట్టిన తరువాత మాత్రం ఇబ్బందులు, ఇక్కట్ల, అవమానాలు, పరాభవాలే ఎదురౌతున్నాయి. నియోజకవర్గం బయట మంత్రి హోదాలో గాంభీర్యం పదర్శిస్తూ ఎలాగోలా నెట్టుకొచ్చేస్తున్నా సొంత నియోజకవర్గం నగరిలో మాత్రం ఆమెకు ఈగల మోతే.. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆమెను పట్టించుకోవడం లేదు.

కనీసం ప్రొటో కాల్ ప్రకారమైనా ప్రభుత్వ పరంగా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు ఆమెకు ఆహ్వానం సంగతి అటుంచి కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఈ విషయాలను పార్టీ అధిష్ఠానం దృష్టికి రోజా తీసుకువెళ్లినా వారు లైట్ తీసుకుంటున్నారు. రోజాను కూడా లైట్ తీసుకోమనే చెబుతున్నారు. జిల్లాకే చెందిన మరో మంత్రి పెద్ది రామచంద్రారెడ్డికి జిల్లా అంతటా రాజమర్యాదలు జరుగుతుంటే.. రోజాకు మాత్రం పలకరించే దిక్కు లేని పరిస్థితి ఎదురౌతోంది. అధిష్ఠానం కూడా నగరి సహా జిల్లా అంతటా పెద్ది రెడ్డి మాటే చెల్లుబాటు అవుతుందనీ, ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించి ఆయన చెప్పిన విధంగా పని చేసుకుపోవడం ఉభయ తారకంగా  ఉంటుందని రోజాకు చెప్పకనే చెబుతోందని నియోజకవర్గంలో ఓ టాక్.

ఇక తాజాగా రోజాకు తన సొంత నియోజవకర్గంలో రైతు భరోసా కేంద్రం భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానం, సమాచారం లేకుండానే కానిచ్చేయడాన్ని రోజా జీర్ణించుకోలేకపోయారు. పైగా ఆ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించిన వారంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులే కావడంతో ఆమె తన ఆవేదనను పార్టీకి చెందిన మరో నాయకుడికి ఫోన్ ద్వారా తెలియజేశారు. ఆ ఫోన్ లో రోజా మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమంలో తెగవైరల్ అయిపోయాయి. రాజకీయాలు చేయడం కష్టం అంటే ఆమె ఆవేదన వ్యక్తం చేయడం, ప్రాణం పెట్టి పార్టీకి పని చేసినా... తన వ్యతిరేకులకే నియోజకవర్గంలో పెద్ద పీట వేసి ప్రోత్సహించడం బాధగా ఉందంటూ చెప్పడం ఇవన్నీ ఆమె గొంతుకతో సహా ఆడియో రిలీజ్ కావడం రోజాకే ఎదురు తిరిగింది.

ఆ ఆడియోను రోజానే రిలీజ్ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నగరిలో రోజాకు మద్దతుగా కనీసం క్యాడర్ కూడా లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.  ఇప్పటికే గడపగడపకూ కార్యక్రమంలో ఆశించిన స్థాయిలో పాల్గొనడం లేదని పార్టీ అధినేత, సీఎం జగన్ రోజాకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబర్ లో మరో సారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనీ, ఆ పునర్వ్యవస్థీకరణలో రోజాకు ఉద్వాసన ఖాయమనీ వైసీపీ శ్రేణుల్లోనే ఓ టాక్ జోరుగా సాగుతోంది. పైగా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు విషయంలో విమర్శలను తిప్పి కొట్టే విషయంలో కూడా రోజా వెంటనే స్పందించకపోవడం పట్ల కూడా సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారంటున్నారు. ‘మీకు మంత్రి పదవులు ఇచ్చింది

బుగ్గ కార్లలో తిరిగి సొంత పనులు చేసుకోవడానికి కాదంటూ జగన్ తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు నేరుగా కాకున్నా పరోక్షంగా రోజాను ఉద్దేశించి చేసినవేనని కూడా పార్టీ శ్రేణులు అంటున్నాయి. మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ రోజా పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. పదవీ ప్రమాణం చేసిన తరువాత హైదరాబాద్ వెళ్లి జగన్మాత విజయమ్మ ఆశీస్సులు తీసుకోవడం దగ్గర నుంచి.. ఇటీవల ఆమె జబర్దస్త్ షోకు వెళ్లడం వరకూ దాదాపు అన్ని విషయాలలోనూ రోజాపై పార్టీలోనే కాదు సామాజిక మాధ్యమంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ రోజాకు క్లాస్ పీకారని అంటున్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా బలమైన గ్రూపు తయారవ్వడం, మరో వైపు గడపగడపకూ కార్యక్రమంలో ఆమె చురుకుగా పాల్గొనడం లేదని పార్టీ అదిష్ఠానం భావిస్తుండటంతో వచ్చే ఎన్నికలలో రోజాకు పార్టీ టికెట్ అనుమానమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

By
en-us Political News

  
ఢిల్లీ వీధుల్లో రగిలిన ఆగ్రహ జ్వాలలు, పోలీసుల లాఠీఛార్జీలు, కన్నీటి ధారలు, నిర్బంధాలను సైతం లెక్కచేయక హక్కుల కోసం వీధిపోరాటానికి దిగిన యువత ఆక్రందనలు
రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ అమూల్యమైన భూములను ఇవ్వద్దు, భోగాపురం విమానాశ్రయాన్ని అందరం కలిసి అడ్డుకుందాం" అంటూ జగన్ ఇచ్చిన పిలుపుల ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ భోగాపురం విషయంలో జగన్ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాయి.
తెలుగుదేశం కూమిటికి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. చంద్రబాబు నాయకత్వంలో కూటమి సర్కార్ సంక్షేమ, అభివృద్ధిని సమాంతరంగా పరుగులు పెట్టిస్తున్నప్పటికీ ఆ స్థాయిలో ప్రజాదరణ పెరగడం అటుంచి.. క్షేత్రస్థాయిలో కూటమి పాలన పట్ల ఒకింత అసంతృప్తి పె రిగిందని సర్వే స్పష్టం చేయడమే.
మొత్తంగా విద్యార్థులు, యువతఉద్యమం.. ఒక స్పష్టమైన సందేశాన్ని అయితేనిస్సందేహంగా ఇచ్చింది. అన్యాయాన్ని ప్రశ్నించడంలో, హక్కుల కోసం పోరాడటంలో , న్యాయం కోసం నినదించడంలో వెనకడుగు వేసే ప్రశ్నేలేదని చాటింది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణ, మండల టీడీపీ నేతలు పని చేయాలని
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో దిల్లీ వీధులను ఊపేసిన బొద్దింకలు ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద రైతు నాయకుడు రాకేష్ తికాయత్‌ను కలిసి సంఘీభావం ప్రకటించాయి.
మాజీ మంత్రి జోగి రమేష్ తనపై చేస్తున్న ఆరోపణలనుఖండించిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. జోగి రమేష్ కు ఎటువంటి క్రెడిబులిటీ లేదనీ, అతను ఏదోదో మాట్లాడతారనీ, అవన్నీ పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిపాలన వ్యవహారాల్లో తీరిక లేకుండా ఉండటంతో, ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పం సమగ్ర అభివృద్ధి బాధ్యతలను భువనేశ్వరి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గత రెండేళ్లుగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నప్పటికీ, ఇప్పటి వరకూ భువనేశ్వరి రాజకీయాలు మాట్లాడిన సందర్భం లేదు.
ఉమా తీరు ప్రభుత్వాన్నీ, తెలుగుదేశం పార్టీనీ గతంలో కూడా ఒకటి రెండు సార్లు ఇబ్బందుల్లోకి నెట్టిందని వక్రమ్ పోలా అన్నారు. పార్టీ వేదికలలో మాట్లాడాల్సిన విషయాలను బాహాటంగా మాట్లాడటం బోండా ఉమాకు రివాజుగా మారినట్లు కనిపిస్తోందన్నారు. మంత్రి పదవి ఆశించి భంగపడటం వల్లే ఉమా ఇలా వ్యవహరిస్తున్నారనుకున్నా.. ఆయన తన అసంతృప్తిని పార్టీ వేదికపై లేవనెత్తాలి కానీ.. బహిరంగ వేదికలపై కాదని విక్రమ్ పోలా అన్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్ సువర్ణ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని   యశ్‌పాల్ సువర్ణ చేసిన వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి.
బిజీ విద్యార్థులు మరియు ఉద్యోగినుల కోసం ఫ్రెష్ లుక్ బ్యూటీ క్లాసెస్ అందిస్తున్న వీకెండ్ బ్యూటీ కోర్సుల వివరాలు. శని, ఆదివారాల్లో మేకప్, స్కిన్‌కేర్ మరియు హెయిర్‌స్టైలింగ్ నేర్చుకుని ప్రొఫెషనల్ బ్యూటీషియన్‌గా మారే సువర్ణ అవకాశం!
టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇటీవల తనపై సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం, పార్టీలో నెలకొన్న చర్చల నేపథ్యంలో స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పార్టీ శ్రేణులు కూడా ఆయన తీరును తప్పుపట్టారు. అయితే   బోండా ఉమా కూడా  తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు.  గతంలో వంగవీటి రాధా, జ్యోతుల నెహ్రూ వంటి నాయకులు కూడా ఇతర పార్టీల నేతలతో కలిసినప్పుడు లేని అభ్యంతరం, కేవలం తన విషయంలోనే ఎందుకు వస్తోందని నిలదీస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.