డామిట్ ..భారాస ముహూర్తం అడ్డం తిరిగిందా ?

Publish Date:Oct 18, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దేవుడంటే భయం, భక్తి  కొంచెం ఎక్కువే. నిజానికి ఆయనే చెప్పుకున్నట్లుగా ఆయన చేసినన్ని యజ్ఞాలు, యాగాలు మరో రాజకీయ నాయకుడు ఎవరూ చేసి ఉండరు. అలాగే, ముహూర్తాలు, శకునాల విషయంలోనూ ఆయనకు గట్టి  విశ్వాసం ఉందని అంటారు. అందుకే మంచి చెడులు చూసుకోకుండా ఆయన ఏ నిర్ణయం తీసుకోరు. ఒక్క చిన్న అడుగు కూడా ముందుకు వేయరు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి (భారాస)గా మార్చేందుకు  కూడా  ఆయన సుముహుర్తం చూసుకున్నారు. దసరా పండగ రోజు మధ్యాహ్నం ఒంటిగంట 19 నిమిషాలకు పేరు మార్పు పత్రాలపై సంతకం చేశారు. 

అయితే, అంతగా ముహూర్తం చూసుకుని మరీ  పేరు మార్చినా అనుకున్నదేదీ జరగడం లేదు. ఫలితం కనిపించడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు  మరో అడుగు ముందుకు పడలేదు. కేసేఆర్ సంతకం చేసిన పత్రాలను పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆగమేఘాల మీద అందచేశారు. కానీ, పత్రాలు అందుకుని పది రోజులు పైనే అవుతున్నా  అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మునుగోడు నుంచే భారాస,జాతీయ‘జైత్ర’యాత్రకు శ్రీకారం చుట్టాలనే కేసీఆర్ సంకల్పం నెరవేరలేదు .తొలి అడుగులోనే అపశకునం ఎదురైందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బారాసాకు ఆదిలోనే హంసపాదు పడిందా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలలో గులాబీ పార్టీ అభ్యర్ధి కూసుకుట్ల ప్రభాకర రెడ్డి  తెరాస బీ ఫారం మీదనే నామినేషన్ వేయక తప్పలేదు. ఎంత త్వరగా వీలైతే అంట త్వరగా  తెలంగాణ పేరును వదిలించుకోవాలని కేసీఆర్ తొందరపడుతున్నా  తెలంగాణ మాత్రం ఆయన్ని వదలడం లేదు. 

అదలా ఉంటే  కొందరు జ్యోతిష శాస్త్ర పండితులు  భారాస ముహూర్త ఫలంతో పాటుగా  కేసేఆర్ జాతక ఫలం జాతీయ రాజకీయాలకు ఏమాత్రం అనుకూలంగా లేదని అంటున్నారు. నిజానికి, జూన్ 29 నుచి, నవంబర్ చివరకు ఉన్న శుక్ర మౌఢ్యం (మూఢమి) కాలం  నూతన కార్యం తలపెట్టేందుకు ఎవరికీ, ఏ మాత్రం మంచి కాదని  కేసేఆర్ జాతక చక్రం ప్రకారం చూస్తే అసలే పనికి రాదని  దత్త పీఠం జ్యోతిష పండితులు దామోదర శర్మ వంటి కొందరు పండితులు, ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా  కాదు కూడదని, కేసేఆర్ అదే ముహూర్తానికి తెరాస పేరును బీఆర్ఎస్ గా మారిస్తే ఫలితాలు ప్రతికూలం కావడమే కాకుండా, కేసేఆర్ కుటుంబం మొత్తం కూడా సమస్యలు ఎదుర్కొనక తప్పదని ముందుగానే  చెప్పారు.

ఇప్పుడిక జరుగతున్న పరిణామాలను గమనిస్తే, పండితుల జ్యోస్యం నిజమవుతున్నట్లే ఉందని పార్టీలో ఫామిలీలో చర్చ మొదలైందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక విషయం ఎలా ఉన్నా  ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేసీఆర్ ను సైతం కలవరపాటుకు గురి చేస్తున్నాయని అంటున్నారు. ఓ వంక తెరాస పేరును భారాసగా మార్చడం ఇప్పట్లో అయ్యే పనికాదని అర్థమైపోయింది. మునుగోడు సహా మరి కొన్ని రాష్ట్రాలలో ఉప ఎన్నికలు ఆ వెంటనే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఒక దాని వెంట ఒకటి లైన్లో ఉన్న నేపథ్యంలో  మరో మూడు నెలల వరకు కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పు వ్యవహారాన్ని పట్టించుకునే పరిస్థతి లేదని అంటున్నారు. అదీ గాక, పేరు మార్పు పై నిర్ణయం తీసుకోవాలంటే ముగ్గురు కమిషనర్ల ఫుల్ బెంచ్ సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది.

కేంద్ర ప్రభుత్వం ఆ పోస్టును ఎప్పుడు భర్తీ చేస్తుందో ఎవరికీ తెలియదు. సో తెరాస పేరు భారాసగా ఎప్పుడు మారుతుందో  చెప్పలేమని కమిషన్ వర్గాలు చెపుతున్నాయి. పేరు మార్పు  ప్రక్రియ మొదలైన తర్వాత, ఇతరులు ఎవరైనా అదే పేరు కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నా  ఇతరత్రా అభ్యంతరాలు వచ్చిన మళ్ళీ కథ మొదటికి వస్తున్నదని అంటున్నారు. చివరకు కమిషన్ తెరాస అభ్యర్ధనను తిరస్కరించినా తిరస్కరించవచ్చని అంటున్నారు. 

ఇవన్నీ ఒకెత్తు అయితే ఢిల్లీ  లిక్కర్ కుంభ కోణం విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరిగుతుందో అనే భయం ఒకటి కేసీఆర్ ను వెంటాడు తోందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఒకప్పుడు కవిత వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినట్లు చెపుతున్న బోయినపల్లి అభిషేక్ ను సిబిఐ అరెస్ట్ చేయడంతో సిబిఐ నెక్స్ట్ టార్గెట్ కవిత కావచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజులకు పైగా ఢిల్లీలో మకాం వేసి కుమార్తె కవితను, సేఫ్ గా బయట పడేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. మరో వంక, జ్యోతిష పండితులు చెప్పినట్లుగా ఇటు పార్టీలో, అటు ఫ్యామిలీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.

దీంతో  తెరాసలో గుబులు మొదలైందని అంటున్నారు. అలాగే ముందు ముందు తెరాసలో పెను మార్పులు తప్పవనీ అంటున్నారు. అది భారాస నామకరణ ముహూర్త బలమో మరొకటో కానీ  కేసీఆర్ జాతీయ రాజకీయాలు, అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయని అయితే పార్టీ సీనియర్ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇటు పార్టీలో, అటు ఫ్యామిలీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కేసీఆర్ చేయి దాటి పోయాయని, ఒక విధంగా  కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడి పడింది అన్నట్లుగా, పరిస్థితులు విషమిస్తున్నాయని పార్టీ నాయకులే అంటున్నారు. అయితే కేసీఆర్ ఏదో చేసి పార్టీని రక్షిస్తారనే విశ్వాసం అయితే ఇంకా మిగిలే ఉందని అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు.
ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఇరాన్ తో ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు.
రాబోయే రోజుల్లో స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.
తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితుల
ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్ సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి తెలుగువన్ ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.
ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి మార్చారు.
వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు.
ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
2023 మేలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కుదిరిన అంతర్గత ఒప్పందం ప్రకారం ఆయన తన పదవి వదులుకున్నారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కావేరి లో గురువారం (మే 27) ఏర్పాటు అల్పాహార విందు సమావేశంలో ఇదే విషయాన్ని తన క్యాబినెట్ సహచరులకు వెల్లడించారు.
ఈ మహానాడులో తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా ప్రసంగించిన లోకేష్ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.