Publish Date:Jun 14, 2022
రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ ముందు వరకూ ఉత్కంఠ రేపినా చివరకు వచ్చేసరికి ఏకపక్షంగా మారిపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. విపక్షాల అనైక్యత కారణంగా బీజేపీ అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అనే పరిస్థితి ఏర్పడింది. సరిగ్గాఈ కారణంగానే విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా అందరికీ ఆమోదయోగ్యమైన శరద్ పవార్ పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్నారన్నది విశ్లేషకుల మాట. దేశంలోనే అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో తొలి నుంచీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా శరద్ పవార్ అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదన్న అభిప్రాయమే వ్యక్తం అవుతూ వచ్చింది. అయితే విపక్షాల ఐక్యతకు చొరవ చూపే విషయంలో వివిధ పార్టీల నాయకల మధ్య సయోధ్య లేకపోవడంతో.. అది సాకారం కాలేదు.
ఇప్పుడు తీరా రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి చొరవ తీసుకుని బీజేపీ యేతర పక్షాల నేతల సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. మమతా బెనర్జీ కూడా బీజేపీయేతర పక్షాల నేతలకు ఆహ్వానం పంపే విషయంలో తనదైన శైలిని అనుసరించారు. సోనియాకు ఆహ్వానం పంపిన ఆమె కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించలేదు. మరో వైపు కాంగ్రెస్ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎంపిక విషయమై పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు సోనియా ప్రతినిథిగా మల్లిఖార్జున ఖర్గేకు బాధ్యతలు అప్పగించింది. అందరి కంటే ముందు ఈ పని కోసం కాలికి బలపం కట్టుకు తిరిగిన కేసీఆర్.. తన ప్రయత్నాలకు బీజేపీ యేతర పార్టీల నుంచి సానుకూలత రాకపోవడంతో కినుక వహించి మౌనం వహించారు.
ఇలా విపక్షాల అనైక్యత కారణంగా అభ్యర్థి ఎంపిక ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి రేసులో తాను లేనంటూ శరద్ పవార్ మంగళవారం విస్పష్ట ప్రకటన చేశారు. దీంతో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎవరన్న విషయంలో మళ్లీ సస్పెన్స్ నెలకొంది. తొలుత శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ తెరమీదకు తీసుకువచ్చింది. రాజకీయాలలో సీనియర్ అయిన శరద్ యాదవ్ అభ్యర్థిత్వం పట్ల ఏ బీజేపీయేతర పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు.
అయితే పార్టీలుఈ విషయాన్నిప్రకటించే విషయంలో జరిగిన జాప్యం, అలాగే వైసీపీ, బీజేడీ వంటి పార్టీలు బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తాయన్న స్పష్టత రావడంతో శరద్ పవార్ తాను రేసులో లేననీ, పోటీకి సుముఖంగా లేననీ ప్రకటించేశారు. ప్రస్తుత సినేరియాలో విపక్షాలకు ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవడానికి అవసరమైనన్ని ఓట్లు ఎలక్టోరల్ కాలేజీలో లేవు. దీంతో గెలిచే అవకాశంలేని పోటీలో దిగడమెందుకన్నభావనతోనే శరద్ పవార్ రేసు నుంచి తప్పుకున్నారని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sarad-pawar-not-in-president-election-race-25-137673.html
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.