Publish Date:Apr 25, 2022
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం సలహాదారుగానే కాకుండా పార్టీలో, ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ పాత్ర పోషిస్తున్నారు. అయితే ఈ పాత్ర ద్వారా పార్టీ, ప్రభుత్వంలో సమస్యలు పరష్కారమౌతున్నాయా? లేదా కొత్త సమస్యలు పుట్టుకు వస్తున్నాయా అంటే సమాధానం చెప్పడం అంత సులువు కాదని పార్టీ వర్గాలు అంతర్గత సంభాషణల్లో సెటైర్లు వేసుకుంటున్నాయి.
వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి అనధికార నంబర్ 2గా కొనసాగుతున్నారు. మంత్రులకు బదులుగా ఆయన విలేకరుల సమావేశాలలో మాట్లాడుతారు. ప్రజా సమస్యలపై అడ్రస్ చేస్తారు. విపక్షపార్టీపై విమర్శలూ చేస్తారు. అంతే ప్రభుత్వ సలహాదారుగానే కాకుండా పార్టీలో కీలకంగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలోనే పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఏ సమస్య వచ్చినా ట్రబుల్ షూటర్ అవతారం ఎత్తుతున్నారు.
మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా పార్టీలో ఒక్క సారగా అసమ్మతి జ్వాలలు ఎగసిపడనప్పుడు వాటిని చల్లార్చే బాధ్యతను కూడా సజ్జల తన భుజస్కంధాలపై వేసుకున్నారు. సరే ఎలాగోలా ఆ అసమ్మతి భుగభగలు సద్దుమణిగాయి. అయితే సజ్జల ట్రబుల్ షూట్ వల్లే అవి సద్దుమణిగాయని చెప్పజాలం. సజ్జల తరువాత జగన్ కూడా రంగంలోకి దిగి నడుంబిగిస్తే కానీ అలజడి ఆగలేదు. ఇప్పటకీ నవురు గప్పిన నిప్పులా అసమ్మతి ఉండనే ఉంది. కానీ ఈ మొత్తం ఎపిసోడ్ లో అటు నుంచీ ఇటు నుంచి విమర్శల పాలైనది మాత్రం సజ్జలే. బుజ్జగింపుల పేరుతో మంత్రి పదవులు కోల్పోయిన వారికి కేబినెట్ హోదాతో కూడిన పదవులు ఇవ్వాల్సి రావడం ఆయన ట్రబుల్ షూటింగ్ కు ఏమంత వన్నె తేవదు. అదీ కాక జగన్ స్వయంగా రంగంలోనికి దిగి బుజ్జగించాల్సిన అవసరం రావడం కూడా ట్రబుల్ షూటర్ గా సజ్జల వైఫల్యమే కాకుండా అధినేతను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ట్రబుల్ మేకర్ గా మారారని విమర్శలు ఎదుర్కొన్నారు.
అలాగే ఇంతటి ప్రాముఖ్యమున్న మరో ఘటనలోనూ ట్రబుల్ షూటర్ గా ఎంటరైన సజ్జల ట్రబుల్ మేకర్ గా నిందలను ఎదుర్కొన్నారు. ఉద్యోగుల ఆందోళన సందర్భంగా వరుసగా జరిగిన చర్యలలో ముఖ్య సూత్రధారిగా వ్యవహరించిన సజ్జల ఆ తరువాత మంత్రి బొత్ససత్యనారాయణ సహాయాన్ని కోరాల్సి వచ్చింది. ఆ సందర్భంలోనూ సజ్జల ట్రబుల్ మేకర్ గానే వ్యవహరించారన్న విమర్శలు వినవచ్చాయి. ఎక్కడైనా ట్రబుల్ షూటర్ సమస్య పరిష్కారం చేసి ఇరు వర్గాల మెప్పూపొందుతారు. అందరికీ ఆమోదయోగ్యమైన ఫలితం రాబడతారు. కానీ సజ్జల విషయంలో పరిస్థితి పూర్తి రివర్స్ గా కనిపిస్తున్నది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అసమ్మతీయులు తమకు అన్యాయం జరగడానికి కారణం సజ్జలే అని నిందించారు. అదే విధంగా ఉపాధ్యాయ సంఘాలూ పీఆర్సీ విషయంలో సజ్జల వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీపీఎస్ విషయంలో కూడా సీఎం విపక్ష నేతగా ఉండగా వివరం తెలియక హామీ ఇచ్చారంటూ ప్రకటించి సజ్జల జగన్ ను అజ్ణానిగా ఉద్యోగుల ముందు నిలబెట్టారు. దీంతో పార్టీ వర్గాలలోనే సజ్జల ట్రబుల్ షూటర్ కాదు.. ట్రబుల్ మేకర్ అంటూ జోకులు పెలుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-trouble--shooter-or-trouble-maker-39-134914.html
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.