Publish Date:May 24, 2023
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద వైసీపీ మూకలు, అవినాష్ అనుచరుల అరాచకత్వాన్ని ఘనత వహించిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమర్ధించారు. మీడియా రాతల వల్లే వారు రెచ్చిపోయారంటూ భాష్యం చెప్పారు.
అంతే కాదు మీడియా వార్తలు ఎలా రాయాలో జ్ణాన బోధ సైతం చేశారు. రెసిడెంట్ ఎడిటర్ గా, ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఆయనకు ఉన్న అనుభవంతో ఆయన మొత్తం ఏపీలో మీడియా వార్తలు ఏవి రాయాలి, ఎలా రాయాలి అన్న ఆదేశాలు జారీ చేశారా అని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఇంతకీ మీడియాలో సీబీఐ రంగంలోకి దిగింది. ఇక అవినాష్ రెడ్డిని అరెస్టు చేసి తీసుకుపోవడమే తరువాయి అంటూ రాయకపోతే.. అసలిదంతా జరిగేది కాదు కదా? అని సజ్జల వారు సెలవిచ్చారు.
సీఎం క్యాంపు కార్యాలయంవద్ద మంగళవారం ( మే 22) మీడియాతో మాట్లాడిన ఆయన వైకాపా అంటే కార్యకర్తలు, అభిమానులు లేని పార్టీ అనుకుంటున్నారా? మీరు రాసే వార్తల్లో కుటుంబాన్ని పలుచన చేస్తున్నారు. తల్లి ఆరోగ్యం బాగోలేదంటే డ్రామా, నాట కాలంటారు.. వీటిని చూస్తే కడుపు మండకుండా ఉంటుందా? మీ మీదా ఇలాగే రాస్తే ఊరుకుంటారా? ఇలా అభిమానులకు ఆవేశం వచ్చేలా మీడియా వ్యవహరించింది కనుకే దాడి జరిగింది. లేకపోతే జరిగి ఉండేది కాదు అంటూ మాట్లాడారు. తల్లి ఆరోగ్యం బాగోలేదని డ్రామాలాడుతూ అవి నాష్ తప్పించుకోవాలని చూస్తున్నారని రాస్తే ఎవరో ఒకరిద్దరు ఆవేశంతో ప్రతిస్పందించి దాడికి పాల్పడి ఉంటారు. వైసీపీ శ్రేణులన్నీ రియాక్ట్ అయితే పరిస్థితి ఇలా ఉండేది కాదు అంటూ హెచ్చరికలు సైతం జారీ చేశారు. అయినా నిజంగా మీడియాలో పని చేసే వారిపై దాడి దాడి జరగలేదు అంటూ కొత్త భాష్యం చెప్పారు.
మీడియా స్వచ్ఛను.. పరిధిని ప్రశ్నిస్తూ సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దాడిని సమర్థిస్తూ సజ్జల మాట్లాడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాజీ సీఎం చంద్రబాబు పై రాళ్ల దాడి చేసిన వారిని సమర్థిస్తూ..అప్పటి ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.. దాడి ..వైకాపా అభిమసులు, కార్యకర్తల భావప్రకటన అని సమర్థించారు.
డీజీపీ వ్యాఖ్యలు..తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లోనే జరిగిందని అప్పుడు ప్రతిపక్షాలు విమర్శించాయి. రాళ్ల దాడులను అప్పటి డీజీపీ గౌతమ్ సావంగ్ భావప్రకటనాస్వేచ్ఛగా సమర్థిస్తే.. వ్యతిరేక వార్తులు చేస్తే దాడులు చేయరా అన్నట్లుగా ఇప్పుడు సజ్జల మాట్లాడుతున్నారు. తాము చెప్పినట్లుగా, తమకు అనుకూలంగా మాత్రమే మీడియా వార్తలు ఉండాలని, లేకపోతే దాడులు కొనసాగుతాయనీ సజ్జల అన్యాపదేశంగా మీడియాను హెచ్చరించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-support-karnool-anarchy-25-155820.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.