లోకేష్ పాదయాత్ర.. సజ్జల కుమారుడి ఓవరేక్షన్..

Publish Date:Feb 11, 2023

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతంగా సాగుతోంది. రోజు రోజుకూ పెరుగుతున్న ప్రజాదరణతో జన ప్రభంజనంలా సాగుతున్న పాదయాత్రను డీఫేమ్ చేయడమే లక్ష్యంగా అధికార వైసీపీ సోషల్ మీడియా టీమ్ ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో వైసీపీ తనకు మాత్రమే తెలిసిన రివర్స్ ప్రతిభకు పదును పెట్టింది.

దీంతో గ్రామంలోకి లోకేష్ పాదయాత్ర ప్రవేశించడానికి ముందే ఖాళీ రహదారులను డ్రోన్ ల ద్వారా చిత్రించి లోకేష్ పాదయాత్రకు జనం కరవయ్యారని బిల్డప్ ఇచ్చుకోవడానికి నానా తంటాలూ పడుతోంది. జనం లేని ఖాళీ ప్రాంతాలను ఫొటోలు తీసి పంపించాలంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తోంది. అలా చేయకపోతే సస్పెన్షన్ తప్పదంటూ హెచ్చరికలూ చేస్తోంది. దీంతో అనివార్య పరిస్థితుల్లో ఏ రోజు కారోజు లోకేష్ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం ఆయన పర్యటించబోయే గ్రామాలలో ఆయన కంటే ముందే పోలీసులు ద్విచక్రవాహనాలలో చుట్టేసి ఖాళీ రోడ్లను, మైదానాలను ఫొటోలు తీస్తున్నారు. అక్కడితో ఆగకుండా డ్రోన్ ల ద్వారా ఖాళీ ప్రదేశాలను చిత్రీకరిస్తున్నారు. వాటన్నిటినీ ఎప్పటికప్పుడు వైసీసీ సోషల్ మీడియా కార్యాలయానికి పంపిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రభుత్వ సలహాదారు సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం లోకేష్ పాదయాత్రకు జనం కరవయ్యారు అని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పని చేస్తోంది. ఈ బృందమే తమకు అందిన ఫొటోల ఆధారంగా లోకేష్ పాదయాత్ర విఫలం అంటూ సామాజిక మాధ్యమంలో ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇందు కోసం లోకేష్ పాదయాత్రలో జనం లేరు అని కనిపించేలా తమకు అందిన ఫొటోలను ఉపయోగిస్తున్నారు. ఇందు కోసం తమకు ఫొటోలు, డ్రోన్ చిత్రీకరణలను పంపించాలంటూ పోలీసులపై తీవ్ర మైన ఒత్తడి తీసుకు వస్తున్నారు. అసలు ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు పోలీసులు ‘పై’ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడ ఆయన ప్రసంగించబోయినా అడ్డుకుంటూ, ఆఖరికి ఆయన మైక్ ను లాగేసుకోవడమే కాకుండా, నిలబడిన స్టూల్ ను కూడా గుంజుకున్న పరిస్థితి.

ఇది చాలదన్నట్లు లోకేష్ పాదయాత్రకు జనాదరణ లేదని చిత్రీకరించేందుకు పోలీసులు పై వారి ఒత్తిడి మేరకు చేస్తున్న ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తున్నాయి. పోలీసుల ప్రయత్నాలపై సామాజిక మాధ్యమంలో సెటైర్లు పేలుతున్నాయి. అలాగే లోకేష్ పాదయాత్ర సాగే గ్రామాలలో పోలీసులు ముందుగానే ద్విచక్రవాహనాల్లో పర్యటించి పాదయాత్రలో పాల్గొంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి వస్తుందంటూ హెచ్చరికలు కూడా జారి చేస్తున్నారని పలు గ్రామాల ప్రజలు మీడియా ముఖంగా ఆరోపణలు గుప్పించారు. సజ్జల కుమారుడి అత్యుత్సాహంతో లోకేష్ పాదయాత్రకు మరింత క్రేజ్ పెరుగుతోందన్న అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎంతగా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అంతకు రెండింతలుగా జనం లోకేష్ కు మద్దతుగా పాదయాత్రలో భాగం పంచుకునేందుకు వస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు చెబుతున్నాయి. లోకేష్ పాదయాత్రకు జనం లేరంటూ వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఎంతగా ప్రచారం చేస్తుంటే అంతకు రెండింతలుగా నెటిజన్లు లోకేష్ పాదయాత్రకు జనం ప్రభంజనంలా కదిలి వస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని చెబుతున్నారు. 

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
దేశ రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
7.75 లక్షల విలువైన 1,035 కిలోల ఆహార పదార్థాలు సీజ్.!
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అమెరికా గడ్డపై మరో తెలుగు కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ప్రకృతి మారుతున్న తీరు ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం సామాన్యుడి బతుకును మరింత ఛిన్నాభిన్నం చేస్తోంది.
దేవీ నవరాత్రుల సందర్భంగా గ్రామంలో నిర్వహించిన దుర్గామాత నిమజ్జన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన భారీ డీజే సౌండ్ హోరుకు ఓ పాత ఇందిరమ్మ బిల్డింగ్ స్లాబ్ పెచ్చులు కూలిపడ్డాయి.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
ఉత్తరాఖండ్‌లో నెలకొన్న దుర్భర రవాణా పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఓ నవవధువు ఎంచుకున్న మార్గం అందరినీ విస్మయానికి గురిచేసింది.
కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన పసిపాప.. క్షణాల వ్యవధిలోనే కన్నుమూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.