జగన్ ఏలుబడిలో సజ్జల రాజ్యం?

Publish Date:May 3, 2022

Advertisement

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తాడేపల్లి ఫ్యాలెస్‌లో బాగా వినపడే పేరు.. సజ్జల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సలహదారుడిగా పేరుకే ఉన్నా.. సజ్జల మాత్రం అన్ని తానే అయి.. జగన్ ప్రభుత్వాన్ని నడిపించేస్తారనే టాక్ అయితే సదరు ప్యాలెస్‌లోనే కాదు.. ప్రతిపక్ష టీడీపీలో సైతం ఉంది. అందుకే ఆయన్ని సకల శాఖల మంత్రి అంటూ ఓ టాగ్ లైన్ కూడా తగిలించేశారీ పసుపు పార్టీ నేతలు. 

జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన వెనుక విజయసాయిరెడ్డి ఉండి నడిపిస్తే.. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వెనుక సజ్జల ఉండి నడిపిస్తున్నారని... అందుకే నడిచేవాడు వైయస్ జగనే అయిన ఆయన్ని నడిపించేవాడు మాత్రం సజ్జల అనే టాక్ అయితే ఫ్యాన్ పార్టీలో ఫ్యాన్ తిరిగినట్లు తెగ తిరుగుతోంది.

ఇటీవల వైయస్ జగన్ కొత్త కేబినెట్‌ కొలువు తీరింది. అందులో 11 మంది పాత వారినే ఉంచి.. మరో 14 మందిని కొత్తవారికి మంత్రి పదవులు కట్టబెట్టడంలో ఈ సజ్జల వారు తన అగ్‌మార్కు రాజకీయాన్ని చూపించారని మంత్రి పదవులు ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు తెగ  చెవులు కొరుక్కుంటున్నారని సమాచారం. 

అదీకాక.. ఎన్నికల్లో గట్టి పోటి ఇచ్చి.. గెలిచిన ఎమ్మెల్యేలు.. అంటే పవన్ కల్యాణ్‌పై భీమవరం, గాజువాకలో గెలుపొందిన ఎమ్మెల్యేలు గ్రంధి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, మంగళగిరిలో నారా లోకేశ్‌పై గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిలాంటి వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టకుండా.. ఇలా పార్టీలోకి వచ్చి.. అలా అసెంబ్లీ టికెట్ తీసుకుని అలా అలా గెలిచి... అసెంబ్లీలోకి అడుగు పెట్టిన వారికి.. అదీ కూడా కీలక మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సబబు అని ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం ఆగ్రహంతో లొలోపల కుతకులాడిపోతుందట. ఇదంతా.. సజ్జల వారి యవ్వారమంటూ ఈ సకల శాఖల మంత్రిపై సదరు వర్గం వ్యంగ్య బాణాలు సంధిస్తోందట. వచ్చేది ఎన్నికల సీజన్.. మళ్లీ కేబినెట్ కూర్పు ఉండదు.... ఉండబోదు. అలాంటి వేళ... కేబినెట్ కూర్పు అంటే ఆచి తూచి అడుగులు వేయాలి. ఆ క్రమంలో ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నేతలపై గెలుపొందిన వారిని ఎంపిక చేసి.. వారికి కీలక మంత్రి పదవులు కట్టబెట్టి.. వారి వారి నియోజకవర్గాల్లో అభివృద్ధిని పరుగులు తీయించాలి. కానీ అలాంటివి ఏమీ లేకుండా.. ఎవరెవరినో మంత్రి పదవులు కట్టబెట్టడం ఏమిటని వారంతా సందేహం వ్యక్తం చేస్తున్నారట.  

మరోవైపు తాజాగా మాజీ మంత్రులు అయిన వారిలో చాలా మంది అంతా సజ్జల వారే చేశారంటూ ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. అందుకు మేకతోటి సుచరిత ఎపిసోడే ఓ ఉదాహరణ. కొత్త మంత్రులు పేర్లు ప్రకటించగానే.. ఆమె నివాసం వద్ద సుచరిత అభిమానులు అయితే సజ్జలపై ఓ రేంజ్‌లో దుమ్మెత్తి పోయడమే కాదు.. రచ్చ రచ్చ చేసి పెట్టారు. ఇక సీఎం జగన్ సమీప బంధువు బాలినేని అలకపాన్పు ఎక్కితే.. ఆయన ఇంటికి సజ్జల కాలిగాలిన పిల్లిలా  ముచ్చటగా మూడు సార్లు వెళ్లి వచ్చారు. 

అలాగే పాత కేబినెట్‌లో 11 మందిని మళ్లీ కొత్త కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగించడంపై.. నాటి వారి సహచరులు అయితే .. వాళ్లు చేసిన పుణ్యమేమిటి? మనం చేసిన పాపమేమిటని వారు.. తాజాగా మాజీలు అయిన తమ తమ సహచరుల వద్ద ప్రశ్నించుకొంటున్నట్లు ఓ టాక్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అందుకే అప్పుడెప్పుడో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఆకలి రాజ్యం సినిమా అర్థమైందీ. నిన్న కాక మొన్న బాపు దర్శకత్వంలో వచ్చిన రామరాజ్యం సినిమా కూడా అర్థమైందీ. కానీ జగన్ డైరక్షన్‌లో వస్తుందో లేక సజ్జల సొంత డైరెక్షన్‌లో వస్తున్న ఈ సజ్జల రాజ్యం మాత్రం అర్థం కావడం లేదని మంత్రి పదవులు పోయి తాజా తాజాగా మాజీలు అయిన వారు... మంత్రి పదవులు వస్తాయని తెగ ఆశ పడి తీవ్రంగా భంగ పడ్డవారంతా ఓ చర్చకు తెర తీసినట్లు ఫ్యాన్ పార్టీలో గుసగుసలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది.

By
en-us Political News

  
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో అన్నారు. ఇందులో త‌న ప‌రువు తీసే కుట్ర దాగి ఉంద‌న్న బీఆర్ నాయుడు.. త‌న‌తో పాటు టీటీడీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిపే య‌త్నం ఉంద‌ని ఆరోపించారు. అందుకే తాను సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించానన్నారు.
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.
2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
లిక్కర్ పాలసీపై తప్పుడు కేసు పెట్టి ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో తనతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు.
వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.