Publish Date:Jul 26, 2025
వైసీపీలో పెద్ద సంక్షోభంలో కూరుకుపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో పై నుంచి కింది దాకా సజ్జలపై తీవ్ర అసంతృప్తి పేరుకుపోతున్నది.తాడేపల్లి ప్యాలెస్ గుడ్ లుక్స్ లో ఉండటం వల్ల అది బహిర్గతం కావడం లేదని వైసీపీ నేతలే గుసగులాడుతున్నారు. అయితే మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత ఆ పరిస్థితి చాలా వరకూ మారిపోయిందంటున్నారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు కూడా సజ్జలపై పార్టీ నేతలలో వ్యతిరేకతను చల్లార్చగలిగే పరిస్థితి లుదంటున్నారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టు తరువాత పార్టీ క్యాడర్ కు భరోసా కల్పించడంలో.. అరెస్టు కారణంగా పార్టీకి జరిగిన నష్టాన్ని నివారించడంలో సజ్జల వైఫల్యమే ఇందుకు కారణమంటున్నారు. అన్నిటికీ మించి సజ్జలపై జగన్ రెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో, ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు.
మద్యం కుంభకోణం విషయంలో అరెస్టులు అన్ని రాజకీయ కక్ష సాధింపులో భాగమేనన్న విషయాన్ని బలంగా చెప్పడంలో సజ్జల వైఫల్యమే ఇందుకు కారణమని జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒక వైపు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మద్యం కుంభకోణం విషయంలో... దర్యాప్తు సాగుతున్న తీరును.. బయటపడుతున్న వైసీపీ నేతల ప్రమేయాన్ని క్షుణ్ణంగా, పూసగుచ్చినట్లు ప్రజలకు వివరిస్తుంటే.. అందుకు దీటుగా దర్యాప్తు నుంచి అరెస్టుల వరకూ అంతా తెలుగుదేశం కూటమి సర్కార్ కక్షసాధింపే నంటూ వైసీపీ వాదాన్ని బలంగా ప్రజలకు వివరించే విషయంలో సజ్జల ఘోరాతిఘోరంగా విఫలమయ్యారని పార్టీ నేతలే అంటున్నాయి.
ఈ వైఫల్యానికి తోడు సజ్జల ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో జగన్ అరెస్టుకు సంబంధించిన సంకేతాలు ఇవ్వడం పార్టీ క్యాడర్ ను అయోమయంలో పడేయడమే కాకుండా వారి మనో ధైర్యాన్ని కూడా దెబ్బతీసిందంటున్నారు. సజ్జల చెప్పిన ప్రతిమాటా, ప్రతి కౌంటర్.. గతంలో అంటే జగన్ హయాంలో జరిగిన అడ్డగోలు అరెస్టులపై చర్చకు తెరలేపేవిగా ఉండటంతో సజ్జల తీరుపై జగన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా జగన్ హయాంలోలా అర్ధరాత్రి గోడలు దూకి, తలుపులు బద్దలు కొట్టి ఇప్పుడు అరెస్టులు జరగడం లేదు. అరెస్టుకు ముందు నిందితులకు ఉన్న అన్ని న్యాయపరమైన అవకాశాలూ వినియోగించుకునే అవకాశం దొరుకుతోంది. చివరకు సుప్రీం కోర్టు వరకూ వెళ్లి అరెస్టు నుంచి రక్షణ పొందడానికి చేసిన ప్రయత్నాలు కూడా విఫలమైన తరువాతనే అరెస్టులు జరుగుతున్నాయి. దీంతో వీటిని కక్ష సాధింపు అరెస్టులుగా సజ్జల ఎంత నెత్తీ నోరూ బాదుకుంటూ చెబుతున్నా జనం నమ్మడం లేదు. సో సజ్జల వైఫల్యాల జాబితా ముందు ముందు మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు. అంటే సజ్జలపై పార్టీలో మరింత వ్యతిరేకత ప్రోది అవుతుందనడంలో సందేహమే లేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-loosing-pride-in-ycp-39-202787.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.