Publish Date:Jul 26, 2025
2024 ఎన్నికల ముందు మంగళవారం, అమావాస్య నాడు రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు కూటమి పై కీలక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్. అప్పట్లో అమావాస్య నాడు పవన్ చేసిన ఈ కూటమి ప్రకటనపై పులువురి నుంచి అభ్యంతరాలొచ్చాయి. కానీ ఫలితాల తర్వాత తేలింది ఏంటంటే పవన్ అమావాస్య సెంటిమెంట్ సూపర్ డూపర్ బంపర్ హిట్ అని. పవన్ ఏమీ సెంటిమెంట్లు తెలీని వాడేమీ కాడని.. ఆయనకు కూడా జ్యోతిష సలహా సూచనలు ఇచ్చేవారు ఉన్నారని అంటారు. ఎవరో ఒక మహిళా జ్యోతిష్కురాలి సూచనల మేరకే పవన్.. వారాహీ అమ్మవారి కొలుపులు మొదలు పెట్టారనీ చెప్పుకొస్తారు. అంతే కాదు ఆయన తన వాహనానికి వారాహీ అని పేరు పెట్టడం ఆపై ఎన్నో యజ్ఞ యాగాలు చేయడం.. ఆ తర్వాత వారాహీ దీక్ష, సనాతన ధర్మ పరిరక్షణ.. అందులో భాగంగా భారీ ఎత్తున తీర్ధయాత్రలు, ఆపై తమిళనాడు మురుగన్ మానాడు వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకుని చూస్తే పవన్ కి అమావాస్య పౌర్ణమి సెంటి మెంట్ల గురించి బాగా తెలుసనే చెప్పాల్సి ఉంటుంది.
ఇక్కడ మేటరేంటంటే జూలై 24న ఆషాడ అమావాస్య నాడు తన హరి హర వీరమల్లు రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేశారు పవన్. తాను గతంలో అమలు చేసిన అమావాస్య సెంటిమెంటు వర్కవుట్ అవుద్దని ఈ సారి కూడా ఫీలైనట్టు కనిపించింది. కానీ అదెందుకో ఎదురుకొట్టినట్టు కనిపిస్తోంది. రిలీజ్ వరకూ హైప్, పబ్లిసిటీ అంతా బాగానే ఉంది. ఎక్కడ తేడా కొట్టిందో అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారు కొందరు జన సైనికులు.
బేసిగ్గా అమావాస్య తెలుగు వారికి కలసి రాక పోయినా.. తమిళ సంప్రదాయంలో అవి అతి పెద్ద శుభకరమైన రోజు. వీరి లెక్కల ప్రకారం పౌర్ణమి చంద్రుడు నానాటికీ కరిగిపోతూ వస్తాడు. అదే అమావాస్య చంద్రుడు అంతకంతకూ ఎదుగుతాడు కాబట్టి.. ఎదుగుదల ఆశించేవారు అమావాస్య నియమాన్ని ఆచరించడం వల్ల ఎక్కువ మేలు జరుగుతుందని విశ్వసిస్తారు. తమిళనాట కూడా అనుబంధం ఉన్న పవన్ ఈ దిశగా తన సెంటి మెంటు తొలి సారి విజయవంతం కావడంతో రెండో సారి కూడా ప్రయత్నించి చూశారు. అయితే ఇదేమంత పని చేసినట్టు లేదు. దానికి తోడు పవన్ ఎంతో భక్తిగా కొలిచే వారాహీ అమ్మవారికి మరెంతో ఇష్టమైన నెల కూడా ఆషాడమే. అలాంటి ఆషాడ మాసంలోని పౌర్ణమిని వదిలి అమావాస్య వెంట పడ్డారు పవన్. అందులో భాగంగా తన సినిమా హరిహరవీరమల్లు రిలీజ్ డేట్ ని ఆషాడ అమావాస్య రోజును మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయ్యారాయన. కట్ చేస్తే.. అది కూడా దారుణంగా దెబ్బ తీసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం హరి హర వీరమల్లు పరిస్థితేంటంటే.. ఆ సినిమా చూసేందుకు థియేటర్లకు వెళ్లే వారే కరవయ్యారు. ఇక సినిమీలో ఆయన గుర్రం సీన్లు దారుణంగా ట్రోలవుతున్నాయి. ఇక హాళ్లలో జనం లేని క్లిప్పింగులెన్నో వైరలవుతున్నాయి. ఈ మొత్తం ఘోర పరాజయంతో ఒక ఫ్యామిలీ ప్యాక్ ఫ్లాప్ షో కంప్లీట్ అయినట్టు కొందరు దారుణమైన కామెంట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ఆచార్య- భోళా శంకర్- మట్కా- గేమ్ ఛేంజర్- హరిహర వీరమల్లు.. ఇలా మెగా ఫ్యామిలీ మొత్తం వరుస డిజాస్టర్లు నమోదు చేయడంతో.. మెగా ఫ్యాన్స్ ఫుల్ డిజప్పాయింట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అత్తారింటికి దారేది తర్వాత సరైన హిట్టే లేని పవన్ కి.. తర్వాత వచ్చే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి చిత్రాలే ఊపిరి పోయాలన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pawankalyan-amavasys-sentimeny-boomarang-39-202791.html
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.