Publish Date:May 27, 2023
అంతా నా యిష్టం.. అంతా ఎడాపెడా ఏం చేసినా ఏం చేసినా అడిగేదెవడ్రా నాయిష్టం.. అంటూ తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. అచ్చం అలాగే గత నాలుగేళ్లుగా ఏపీలో జగన్ సర్కార్ తీరు కొనసాగుతోంది. ఆ పార్టీ శ్రేణులూ, నాయకులు అలాగే వ్యవహరిస్తూ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ సైతం అందుకు వత్తాసు పలుకుతున్నట్లుగానే వ్యవహరించారు. విపక్ష నేతలను కేసుల పేరుతో అర్ధరాత్రులు అరెస్టు చేసినా ఎవరూ మాట్లాడడానికి వీల్లేదన్నట్లుగా సాగిన అధికార పార్టీ నేతల తీరు తీరా తమదాకా వచ్చేసరికి రివర్స్ అయిపోయింది.
తమపై ఉన్న కేసులు కోర్టుల్లో విచారణకు వచ్చినా సహించమన్నట్లుగా ఆ పార్టీ నాయకుల తీరు మారింది. తమ పార్టీకి చెందిన వారికి వ్యతిరేకంగా ఏం జరిగినా కుట్ర అనడం ఆనవాయితీ అయిపోయింది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఈ విషయంలో అందరి కంటే ముందున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ హత్య కేసులో నాలుగేళ్ల తరువాత ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయంపై సీబీఐ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో ముఖ్యమంత్రి జగన్ పేరు ఉండటం వెనుక భారీ కుట్ర ఉందని సజ్జల ఆరోపిస్తున్నారు.
ఎవరో రాసిన స్క్రిప్టునే సీబీఐ కౌంటర్ అఫిడవిట్ లో మెన్షన్ చేసిందని భాష్యం చెబుతున్నారు. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను తప్పించుకోవడానికి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిని షెల్టర్ గా చేసుకుని నాలుగు రోజులకు పైగా తలదాచుకోవడంలో తప్పు లేదు కానీ, ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు నివేదించడం మాత్రం కుట్ర అంటున్నారు. వివేకా హత్య కేసులో ఇప్పటికే జగన్ ఓఎస్ డీని సీబీఐ విచారించింది. తెలంగాణ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ లో ఆ విషయాన్ని ప్రస్తావించి అవినాష్ ద్వారా జగన్ కు తెలిసిందన్న అనుమానం ఉందని కూడా సీబీఐ ఆ అఫిడవిట్ లో విస్పష్టంగా చెప్పింది.
అయినా కూడా సజ్జల సీబీఐ అలా ఎలా అంటుంది.. మేం ఏం అంటే అదే చెప్పాలిగా అన్నట్లుగ మాట్లాడుతున్నారు. సీబీఐ దర్యాప్తు వైసీపీ నేతలేం చెబితే అలా జరగాలన్నట్లుగా సజ్జల తీరు ఉంది. ఇంత కాలం సీబీఐ తీరు అలాగే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ అవినాష్ దగ్గరకు వస్తోందంటే జగన్ రెక్కలు కట్టుకుని హస్తినలో వాలిపోయేవారు.
వెంటనే సీబీఐ అవినాష్ కు దూరం జరిగేది. ఇలా సాగుతూ వచ్చిన దర్యాప్తు ఇప్పుడు అవినాష్ ను అరెస్టు చేసే వరకూ రావడం చూస్తుంటే.. ఇప్పటి వరకూ జగన్ మాట విని కాపాడిన శక్తులు కూడా అశక్తులయ్యేంతగా అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసులో ఇరుక్కు పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sajjala-blame-cbi-39-155952.html
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.