Publish Date:May 27, 2023
నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఏపీ సర్కార్ తీరు ఉంది. సలహాదారుల నియామకంపై కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, ఆ నియామకాల చట్టబద్ధతను తేలుస్తామని చెబుతున్నా ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. బేఖాతరు చేస్తోంది. ఖజానాపై భారం పడుతోందని తెలిసా.. ఇష్టారీతిన సలహాదారుల నియామకం చేపడుతోంది. జగన్ సర్కార్ తాజాగా మరో సలహాదారుడ్ని నియమించింది. మైనార్టీశాఖ సలహాదారుగా బాగ్దాదిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండేళ్ల పాటూ ఆ పదవిలో కొనసాగగుతారు. గత వారం కూడా మైనారిటీ సంక్షేమశాఖలో క్రైస్తవ వ్యవహారాలకు సలహాదారుడ్ని సర్కార్ నియమించింది. వారం వ్యవధిలో ఒకే శాఖకు ఇద్దరు సలహాదారుల్ని నియమించడం గమనార్హం. గతంలో హైకోర్టు సలహాదారుల నియమాంకపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్తవారి నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
మైనార్టీ సంక్షేమ శాఖకు కొ ముఫ్తీ సయ్యద్ మొహమ్మద్ అలీ బాగ్దాదిని సలహాదారుగా నియమించింది ప్రభుత్వం.. ఈయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ శాఖలో రెగ్యులర్ అధికారులను నియమించని ప్రభుత్వం.. నలుగురు సలహాదారులను నియమించిందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు ఈ నెల 18న కూడా మైనారిటీ సంక్షేమశాఖ పరిధిలోని క్రైస్తవ వ్యవహారాలకు సంబంధించి మద్దు బాలస్వామిని సలహాదారుగా నియమించింది ప్రభుత్వం. వారం కూడా కాకుండనే మరో సలహాదారుడ్ని ప్రభుత్వం నియమించింది. వీరిద్దరే కాకుండా ఇంతకు ముందు నుంచే జియావుద్దీన్, హబీవుల్లాలు సలహాదారులుగా కొనసాగుతున్నారు. ఈ నియామకంతో మైనార్టీ వ్యవహారాలకు సలహాదారుల సంఖ్య నాలుగుకు చేరింది.
మైనారిటీ సంక్షేమశాఖకు సలహాదారులుగా కొనసాగుతున్నవారికి మంచి జీతభత్యాలు ఉన్నాయి. జియావుద్దీన్, హబీవుల్లాలకు కేబినెట్ హోదాతో పాటుగా నెలకు రూ.3.50 లక్షలు.. ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. క్రైస్తవ వ్యవహారాల సలహాదారుగా నియమించిన బాలస్వామి.. ఇప్పుడు నియమించిన మహమ్మద్ అలీ బాగ్దాదీలకు జీతభత్యాలకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా రాలేదు. సలహాదారుల నియామకానికి సంబంధించి గతంలో హైకోర్టు ప్రభుత్వం తీరును తప్పుబట్టింది.. కొన్ని సీరియస్ కామెంట్స్ చేసింది. అయినా కూడా మరో ఇద్దరిని సలహాదారులుగా నియమించడం ఏమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొండవీటి చాంతాడులా ఉన్న ఏపీ సర్కార్ సలహాదారుల జాబితా కొండవీటి జాంతాడంత ఉంటుంది. నియమితులైన సలహాదారులకు.. కేబినెట్ హోదా ఇవ్వడం.. భారీగా జీతభత్యాలు.. సకల సౌకర్యాలు అందించడం.. అసలే అప్పుల ఆంధ్రగా మారిపోయిన రాష్ట్రానికి తలకు మించి భారం అవుతోందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/another-advisor-appointed-in-minority-dept-39-155948.html
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.