ఎప్పుడు కుదిరితే అప్పుడొస్తారు.. ఎందుకింత రాద్ధాంతం.. సజ్జల

Publish Date:May 19, 2023

Advertisement

ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి  సజ్జల మరో సారి బోధివృక్షం కింద కూర్చున్నారు.  అవినాష్ విషయంలో సీబీఐ, మీడియా, విపక్షాలు అనవసర  రాద్ధాంతం చేస్తున్నాయంటూ జనానికి జ్ణానబోధ చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జలకు అవినాష్ వ్యవహారంలో మాట్లాడాల్సిన అవసరం ఏమిటన్నది పక్కన పెడితే ఆయనేం మాట్లాడుతున్నారంటే.. అవినాష్ ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే మరో రోజు విచారణకు హాజరౌతారు? ఇప్పటికిప్పుడే విచారించాలన్న తొందర సీబీఐకి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు.

మరి ఇదే జగన్ సర్కార్ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టారంటూ సీనియర్ మోస్ట్ జర్నలిస్టు అంకబాబును రాత్రికి రాత్రి ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో  సజ్జల చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క అంక బాబు అనే కాదు తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనను అరెస్టు చేసి వందల కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకు వచ్చిన సంఘటనపైనా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినా వివేకా హత్య కేసు దర్యాప్తు విషయంలో  ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన మాట్లాడటమేమిటి? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ తమ చెప్పుచేతలలో ఉండాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల వారు భావిస్తున్నారా అని సెటైర్లు వేస్తున్నారు.

అవినాష్ తల్లి అనారోగ్యం కారణంగా విచారణ వాయిదా వేయాలని కోరాలంటే ముందు ఆయన సీబీఐ కార్యాలయానికి వెళ్లి తన తల్లి అనారోగ్యానికి సంబంధించి ఆధారాలు చూపి కోరితే వేరేలా ఉండేది. అందుకు భిన్నంగా ఆయన వ్యవహరించడంతో సీన్ సితారైందని అంటున్నారు. అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలని సీబీఐ హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ దర్యాప్తు సంస్థ హైదరాబాద్ కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా అవినాష్ ను అరెస్టు చేయాలన్న పట్టుదలతో సీబీఐ ఉందని అంటున్నారు. అందుకే ఆయనను నీడలా వెంటాడుతోందని అంటున్నారు. అవినాష్ కాన్వాయ్ ను అనుసరిస్తున్న సీబీఐ వాహనాలను అడ్డుకునేందుకు అవినాష్ అనుచరులు ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో హింస రేగుతుందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు వచ్చి అవినాష్ కు ఎప్పుడు కుదిరితే అప్పుడు విచారణకు వస్తారు, దీనిపై ఎందుకు రాద్ధాంతం అంటూ మాట్లడడం చూస్తుంటే ఆయన ప్రభుత్వం తరఫున ఏం సందేశమిస్తున్నట్లు అని పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక క్రిమినల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వత్తాసుగా ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థను నిలువరిస్తోందా అనిపించేలా సజ్జల వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు.  సజ్జల మాటలు సీబీఐని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.   

By
en-us Political News

  
రా బిడ్డా.. అసెంబ్లీకి’.. KTRకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్.!
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.