మరో రాజ ప్రాసాదం కొత్త పార్లమెంటు భవనం 

Publish Date:May 19, 2023

Advertisement

రాజులు పోయారు. రాచరికాలు పోయాయి. రాజప్రసాదాలు మాత్రం వారి చిహ్నాలుగా నిలిచిపోతున్నాయి. వేల సంవత్సరాల నుంచి పాలకులు తమ మార్కును ప్రదర్శించాలనుకుంటున్నారు. ప్రస్తుతమున్న రాజప్రసాదాలు అలనాడు కట్టిన అపురూప సౌందర్య సౌధలు. ప్రస్తుతమున్న పార్లమెంటు భవనం కూడా ఆ కోవలోకే వస్తుంది. ప్రధాని మోడీ ఈ నెల 28న వీరసావర్కర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించనున్నారు. 
తెలంగాణ రాష్ట్రంలో నిజాం నాటి కట్టడాన్నికూల్చేసి కొత్తగా సచివాలయం కట్టడానికి పెద్ద లాజిక్ లేదు. తమ పాలనలో నిర్మితమైన తీపి గుర్తులు ప్రజల మదిలో తర తరాలుగా నిలిచిపోవడానికి  ఇలా కట్టడాలు నిర్మిస్తారని చెప్పడానికి ఇతరత్రా కారణం లేదు. పాలకులు తమకు గుర్తింపు చిహ్నాలు నిర్మించాలన్న ఆకాంక్షతో యాదగిరి గుట్ట దేవాలయం, తెలంగాణ సచివాలయ పునర్ నిర్మాణం అని  వేరే చెప్పనవసరం లేదు. నిజాం కాలం నాటి కట్టడాన్ని స్వాతంత్ర్యం అనంతరం  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సచివాలయం పాత సెక్రెటేరియట్ భవనం. ఇతరత్రా అవసరాలకోసం ఆ భవనాన్ని వినియోగించుకోవచ్చు. కానీ ఆఘమేఘాల మీద ఆ భవనాన్ని కూల్చేసి కొత్త సచివాలయాన్ని పెర్సియన్ శైలిలో కట్టారు. 
ప్రస్తుతం కట్టిన పార్లమెంటు భవనం గూర్చి పరిశీలిస్తే ఆసక్తికర కథనాలు అనేకం ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. 
న్యూఢిల్లీలోని సంసద్ మార్గ్ లో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనానికి అక్షరాల రూ 862 కోట్ల రూపాయలు ఖర్చయ్యింది. 
సెంట్రల్ విస్తా రీ డెవలప్ మెంట్ ప్రాజెక్టు చేపట్టి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టను మరింత ఇనుమడింప జేసే విధంగా దీన్ని నిర్మించారు. ఇండియా గేట్ రాష్ట్రపతి భవన్ మధ్య ఈ కట్టడాన్ని నిర్మించారు. ఈ కట్టడాన్ని నిర్మించే బాధ్యత టాటాప్రాజెక్ట్స్ లిమిటెడ్(టిపిఎల్) కు దక్కింది. 2020 అక్టోబర్ 20వ తేదీన ఈ కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 
ఈ కొత్త పార్లమెంట్ భవనం ఈ సవత్సరం ఆగస్టులో ప్రారంభం కావాల్సి ఉంది. షెడ్యూల్ కంటే నెల రోజుల ముందే ఈ భవనాన్ని వీరసావర్కర్ జన్మ దినోత్సవాన్నిపురస్కరించుకుని ప్రారంభించనున్నారు. 1927సంవత్సరంలో బ్రిటీషు ప్రభుత్వం నిర్మించిన కట్టడంలోనే ఇప్పటి వరకు పార్లమెంటు భవనం కొనసాగింది. ఆ భవనం స్థానే దీన్ని నిర్మించారు. 
65 వేల చదరపు  మీటర్ల విస్తీర్ణం నాలుగు అంత స్థుల్లో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు. ఈ నూతన భవనానికి 6.5 మీటర్ల ఎత్తులో ఉన్న  జాతీయ పతాక చిహ్నం, ఆసియాటిక్  నాలుగు సింహాలు హైలైట్ అని చెప్పొచ్చు. 

By
en-us Political News

  
భారతీయ రైల్వేలో ప్రయాణం చేయడానికి ప్రయాణికులు చాలా కాలం ముందే టికెట్లను రిజర్వ్ చేసుకుంటూ ఉంటారు.
తండ్రి అంటే పిల్లలకు ఉండే ప్రాణం, ఆప్యాయత ఎంతో గొప్పవి. కానీ ఆ ప్రేమ కొన్నిసార్లు ఊహకందని వింత నిర్ణయాలకు దారితీస్తుంది.
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో తీవ్ర కలకలం రేపిన ఉదంతంలో ఒకరు దారుణ హత్యకు గురయ్యారు.
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
జమ్మూకశ్మీర్‌‌లోని కతువా జిల్లాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్‌ నగరంలోని నిమ్స్‌ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నోరి లక్ష్మీ భాస్కర్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దర్యాప్తును ముమ్మరం చేసింది.
హైదరాబాద్‌లోని టెక్ హబ్ మాదాపూర్‌లో జరిగిన ఒక సంచలన ఘటన కలకలం రేపింది.
దేశవ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది
డేటింగ్ యాప్ ద్వారా పరిచయం.. పబ్‌కు తీసుకెళ్లి రూ.29 వేల బిల్లు.!
హైదరాబాద్ నగరంలోని ఎస్‌ఆర్‌ నగర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపిన ఒక విషాదకర ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది.
అరుణాచల్ ప్రదేశ్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.