కాంగ్రెస్ ప్రభుత్వ మొద్దు నిద్ర వల్లే రైతులు కన్నీరు : ఎంపీ ఈటల

Publish Date:May 27, 2026

Advertisement

 

బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి  నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన బీజేపీ బృందం చేపట్టిన ‘రైతు గోస - బీజేపీ భరోసా’ యాత్ర మూడవ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా మంథని రూరల్ పరిధిలోని గుంజపడుగు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అనంతరం మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్  మీడియాతో మాట్లాడారు. 

గత మూడు రోజులుగా తాము వికారాబాద్ జిల్లా కులకచర్ల నుండి ప్రారంభించి వందల కిలోమీటర్ల మేర క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్ల పక్కన వరి, మక్కజొన్న, సన్‌ఫ్లవర్ కుప్పలే దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ మొదటి వారం నుంచే పంట చేతికి వచ్చినా, గత 30 రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టకపోవడం వల్లే ఐకేపీ, పీఏసీఎస్ సెంటర్లలో ధాన్యం కొండల్లా పేరుకుపోయిందని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో గోనె సంచులు, అమాలీలు, తూకం కాంటాలు, క్లీనింగ్ మిషన్లు లేక రైతులు అల్లాడుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఈటల  తీవ్రంగా మండిపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ సభల కోసం హైదరాబాద్ డిపోల నుండి వందలాది బస్సులను పంపించగలరు కానీ, అన్నదాతల ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి లారీలను సమకూర్చలేకపోతున్నారని ఈటల విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఇసుక రవాణా చేసే వేలాది లారీలను కనీసం మూడు నాలుగు రోజుల పాటు నిలిపివేసి, ధాన్యం తరలింపునకు ఉపయోగిస్తే పంట కళ్ల ముందే నానిపోకుండా, మొలకలు రాకుండా కాపాడుకునే వాళ్ళమని రైతులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. 

ఈ ఎండ దెబ్బకు, కొనుగోళ్లు జరగని ఆవేదనతో కొందరు రైతులు గుండె పగిలి చనిపోతుంటే, మరికొందరు ఆత్మహత్యాయత్నాలు చేస్తున్నారని, మహిళా రైతులు చిన్న పిల్లలను వేసుకొని వరికుప్పల మీదనే రాత్రింబవళ్లు పడుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన చెందారు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం మద్దతు ధర అడిగిన రైతులపై సంకెళ్లు వేస్తే, ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కాటారంలో ధర్నా చేసిన రైతులపై అక్రమ కేసులు బనాయించిందని మండిపడ్డారు. ఆనాటి బీఆర్ఎస్ అయినా, ఈనాటి కాంగ్రెస్ అయినా రైతుల బతుకుల్లో మట్టి కొడుతున్నాయే తప్ప ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు.

రైతులకు అండగా నిలబడటానికి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించడానికే బీజేపీ నాయకుల బృందం క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాల సందర్శనకు వచ్చి రైతుల పక్షాన నిలిచేందుకు వచ్చామని ఈటల స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణమే స్పందించి, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీస్తూ రైస్ మిల్లర్లు చేస్తున్న దోపిడీని అరికట్టాలని, రైతులను బానిసల్లాగా చూసే పిచ్చి వేషాలు మానుకొని మిల్లులకు సరుకు రాగానే గౌరవప్రదంగా దించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

By
en-us Political News

  
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రభావంతో ఉద్యోగాల కోతలు పెరుగుతున్న వేళ
ఐపీఎల్ టోర్నమెంట్‌లో భాగంగా జరుగుతున్న అత్యంత ఉత్కంఠభరితమైన ఎలిమినేటర్ పోరులో రాజస్థాన్ రాయల్స్ (RR) బ్యాటర్లు చెలరేగిపోయారు.
చెన్నై సూపర్ కింగ్స్‌ను ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వచ్చే సీజన్ నాటికి సీఎస్కే‌ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా మారనున్నాడా
తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ మైనింగ్‌ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దూకుడు పెంచింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర లిఖించబడింది.
పశ్చిమాసియాలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు తెరపడనుంది.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడులో సరికొత్త ఉత్సాహం, జోష్ కనిపిస్తోంది.
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ముగింపు దశకు చేరుకుంది.
రంగారెడ్డి జిల్లా ఎల్‌బీనగర్ పరిధిలోని పి.ఆర్.ఎల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో నమోదైన భారీ రియల్ ఎస్టేట్ మోసం కేసు సంచలనంగా మారింది
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం విజయ్ కీలక భేటీ
ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టానికి చేరుకుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం నాడు అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.