విలీనం కాదు.. లీజే.. ఆర్టీసీ విషయంలో జగన్ సర్కార్ మడత పేచీ!

Publish Date:Jun 28, 2022

Advertisement

జగన్ వాగ్దానాలన్నీ అమలు చేస్తున్నానని చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా ఆయన చేసేది అంతా జగన్మాయ మాత్రమే. అమ్మ ఒడి అన్నారు. తీరా లబ్ధిదారుల సంఖ్యను సగానికి సగం తగ్గించేశారు. ఒంటరి మహిళలకు పింఛన్ అన్నారు. అమలులోకి వచ్చే సరికి వయస్సు నిబంధనతో లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా కుదించారు. ఇలా ఏ పథకం తీసుకున్నా.. ఏ సంక్షేమం తీసుకున్నా అదే తీరు, అదే రీతి. దుల్హన్ పథకం దగ్గరకు వచ్చే సరికి గత ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహానికి రూ. 50 వేలు ఇచ్చింది...తాను అధికారంలోకి వస్తే లక్ష ఇస్తానని గత ఎన్నికలకు ముందు జగన్ వాగ్దానం చేశారు. అయితే తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పడు నిధుల కొరత సాకు చూపుతూ ఆ పథకానికే మంగళం పాడేశారు.

తాజాగా ఆర్టీసీ విలీనం విషయంలోనే జగన్ మాట తప్పారు. మడమ కూడా తిప్పేశారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని వైసీపీ ప్రకటించింది. జగన్ సీఎం అయిన తర్వాత సాంకేతిక సమస్యలు ఉన్నాయని కేవలం ఉద్యోగుల్ని మాత్రమే ప్రజా రవాణా శాఖ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి విలీనం చేసింది. ఆర్టీసీ మాత్రం అలాగే కొనసాగుతోంది. తాజాగా ఆర్టీసీ మొత్తాన్ని   లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది.  

మళ్లీ లీజు ఏమిటి? ప్రభుత్వంలో విలీనం చేయొచ్చు కదా అంటే మాత్రం సాంకేతిక సమస్యలంటూ నీళ్లు నములుతోంది జగన్ ప్రభుత్వం. అంతే కానీ ఆ సాంకేతిక సమస్యలేమిటన్నది మాత్రం చెపపడం లేదు. అయితే ఇప్పుడు హఠాత్తుగా లీజు వ్యవహారాన్ని తెరైకి తీసుకు వచ్చి  పూర్తి చేయడానికి తొందరపడుతోంది. అయితే అదేమీ ఆర్టీసీ మీద ప్రేమతో కాదు..   కేంద్రానికి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేకుండా తప్పించుకోవడానికేనని అంటున్నారు

ఆర్థిక రంగ నిపుణులు. వారికి ప్రభుత్వం జీతాలు చెల్లిస్తోంది. కానీ వారు పని చేస్తోంది మాత్రం వేరే సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీలోనే. అంటే ఆర్టీసీ ప్రభుత్వోద్యోగులుగా మారిన తమ పాత ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటోందన్నమాట. అందుకు గానూ జీఎస్టీ చెల్లించాలి. ఈ జీఎస్టీని చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ  లీజు అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చింది.  అయితే ఇక్కడో రహస్యం ఉంది.

ఆర్టీసీని విలీనం చేసుకుంటే ఈ లీజు గొడవ ఉండదుకదా అంటే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటే.. ఆర్టీసీ అప్పుల భారం కూడా ప్రభుత్వానికి  విలీనం అయిపోతుంది. అదంతా ప్రభుత్వం కట్టాల్సి ఉంటుంది. అలాగే  ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంది. అంటే విలీనానికి కేంద్రం అంగీకరించాలి. అలా కేంద్రం అంగీకారం తెలిపితే మొదట కేంద్రం చేసే పని తన వాటాను ఉపసంహరించుకోవడం. అదీ ప్రభుత్వానికి ఆర్థిక భారమే అవుతుంది. అందుకే ఈ బేడదలు.. కాదు కాదు బాధ్యతలేమీ తీసుకోకుండా లీజుతో సరిపెట్టేయాలని జగన్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది.  

By
en-us Political News

  
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
విపత్కర సమయంలో తెలుగు రాష్ట్రాల ఐక్యత.. ఏపీకి సాయం.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.