ప‌ది నెల్ల త‌ర్వాత న‌దిలో దొరికిన ఐఫోన్‌!

Publish Date:Jun 28, 2022

Advertisement


తిర‌నాళ్ల‌లో త‌ప్పిపోయిన బిడ్డ  ప‌దేళ్ల  త‌ర్వాత అనూహ్యంగా క‌ల‌వ‌డం సినిమాల్లో,  నిజ జీవితంలోనూ జ‌ర‌గవ‌చ్చు. అలా జ‌రుగుతుందా అన్న‌ది కొంద‌రి అనుమానం. జ‌రిగిన‌వి చూసిన‌వారికి  పెద్ద  వింతేమీ కాదు. కానీ  ఎవైన్ డేవిస్ కి మాత్రం జీవితాంతం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే! ఎందుకంటే ఎప్పుడో ప‌ది నెల‌ల క్రితం పారేసుకున్న ఐఫోన్ హ‌ఠాత్తుగా మొన్నీ మ‌ధ్య  దొరికింది.  అదీ ఏ మాత్రం పాడ‌వకుండా!  
దాన్ని మిగ్యూల్ అనే వ్య‌క్తి  న‌దిలో ప‌డ‌వ‌లో ప్ర‌యాణిస్తుంటే తెడ్డుకి ఐ ఫోన్ త‌గిలింది. దాన్ని బ‌య‌ట‌కు తీసి  అస‌లు య‌జ‌మానికి  చేర్చాడు. 

దీనికంటే మ‌రీ వింతే మిటంటే,  అస‌లా ఫోన్ య‌జ‌మాని డేవిస్  ఇన్నాళ్లు ఎలా ప్ర‌శాంతంగా  వున్నాడా? అని. ఈ సంగ‌తి  విన్న నెటిజ‌న్లు వీడెవ‌డ్రా బాబూ! అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ  రోజుల్లో ఐఫోన్ అనేది మూడో చేయిగా మారిపోయింది మ‌రి! ఎందుకంటే, మిగ్యూల్ మొన్న న‌దిలో ప‌డ‌వ‌లో తిరుగు తూంటే తెడ్డుకి ఈ ఫోన్ త‌గిలిందిట‌. దాన్ని జాగ్ర‌త్త‌గా పైకి తీసేడు. అది బాగానే వుంద‌ని అనిపించింది. అందు లోకి నీళ్లు ఇంక‌లేద‌ని గ్ర‌హించాడు. ఇంటికి వెళ్ల‌గానే దానికి ఛార్జి పెట్టి చూశాడు.  అందులో చివ ర‌గా ఉప‌యోగించినది ఆగ‌స్టు 13 అని తేదీ క‌న‌ప‌డింది. అత‌ని ఆశ్చ‌ర్యానికి అంతేలేదు. కానీ  అత‌ను దాన్ని త‌ను దాచుకోవాల‌నుకోలేదు. దాని అస‌లు య‌జ‌మాని ఎవ‌రా అని ఆరా తీసి మ‌రీ అత‌నికి తీసికెళ్లి ఇచ్చాడు. ఇది  మ‌రీ  హ‌ర్ష‌ణీయం!

తెల్లారుతూనే ఐఫోన్‌లో మెసేజ్‌లు, ఫోటోలు చూసుకుంటేనే గాని రోజు ఆరంభం కాని రోజులివి. ఐ ఫోన్ వుంటే లోక‌మంతా అర‌చేతిలో వున్న‌ట్టే. స్నేహితులు, బంధువులు, సినిమాలు, స‌ర‌దాలు, ఆట‌పాట‌లు ఒక‌టేమిటి యావ‌త్ లోక‌మంతా ఒక్క క్లిక్ దూరంలో సంద‌డి చేస్తాయి. ఫోన్ల కంపెనీవారికి ఎంత లాభార్జ‌న జ‌రుగుతోందో ఏమో గాని జ‌నాల‌కు ముఖ్యంగా యువ‌త‌కు మాత్రం ఐఫోన్‌తో బోల్డు కాల‌క్షేపం. చ‌దువు, వుద్యోగాల మాట ఎలా వున్నా ఇపుడంతా ఆన్‌లైన్ వ్య‌వ‌హారాలే గ‌నుక ఐ ఫోన్ అనేది జీవిత భాగ‌స్వామితో స‌మానంగా మారింది. ఇది భ‌విష్య‌త్తులో మ‌రింత పిచ్చెక్కించే ఆనందం.
 
ప‌ది నెల‌ల క్రితం పొర‌పాటున న‌దిలో ప‌డిపోయింద‌ని, అది దొర‌క‌ద‌ని ఆశ‌లు వ‌దులుకున్నాన‌ని డేవిస్ అన్నాడు. త‌ర్వాత ఆ ఫోన్‌లోనే మిగ్యూల్‌తో సెల్ఫీ తీసుకుని డేవిస్ నెటిజ‌న్ల‌కు అస‌లు స‌మాచారం అం దించాడు. ఇలాంటివి జ‌ర‌గ‌డం ఎక్క‌డా వినం. కానీ జ‌రిగింది. అలాగ‌ని ఖ‌రీద‌యిన ఫోన్‌లతో తిరిగేవారు జాగ్ర‌త్త‌గానే వుండాలి. ఎందుకంటే పారేసుకున్న‌పుడ‌ల్లా అంద‌రికీ మిగ్యూల్ లాంటివారు తెచ్చివ్వ‌రు!
 

By
en-us Political News

  
అర్నబ్ తుపాను నష్టాల నుంచి రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడంతో
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన వ్యక్తిగత జీవితంలో ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన భారీ నిరసన ర్యాలీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాప్తాడు పాఠశాలలో రక్తచరిత్ర.!
పేదరికం.. కష్టాలు.. రోజువారీ కూలీ పని! ఒకప్పుడు కనీస అవసరాల కోసం పోరాడిన మహిళ.. నేడు ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు కీలక భాగస్వామిగా ఎదిగారు.
విజయసాయి ఈ వీడియో చేయడం వెనుక పొలిటకల్ స్ట్రాటజీ ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తారకరత్న కుమార్తెతో వీడియో చేయడం ద్వారా తెలుగుదేశం శ్రేణుల మద్దతు పొంది తన పొలిటికల్ రూట్ లో ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.