ఆర్ఎస్ఎస్, ఎంఐఎంకు అనుమతి... కాంగ్రెస్ కు మాత్రం నిరాకరణ...

Publish Date:Dec 28, 2019

Advertisement

 

పౌర బిల్లుకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్‌ తలపెట్టిన ర్యాలీపై రగడ జరుగుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఏఏకి వ్యతిరేకంగా టీకాంగ్రెస్ తలపెట్టిన తిరంగా ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతుకు, ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన ప్రభుత్వం.... తమ శాంతియుత ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వరంటూ కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. అనుమతి ఇచ్చినా... ఇవ్వకపోయినా... ర్యాలీ నిర్వహించి తీరుతామని తెగేసి చెబుతున్నారు. అయితే, పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ ర్యాలీపై ఉత్కంఠ కొనసాగుతోంది.

సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్... ఇలా ఇటీవల మోడీ సర్కారు తెరపైకి తెచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఢిల్లీలో అయితే పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. అలాగే భారీ బహిరంగ సభను సైతం ఆర్గనైజ్ చేసి సక్సెస్ అయ్యింది. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్ ఆందోళనలతో కాంగ్రెస్ కు కొంత మైలేజ్ కూడా వచ్చింది. దాంతో, ప్రతి రాష్ట్రంలోనూ ఇలాంటి ఆందోళనలకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. అయితే, తెలంగాణలో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్ వరకు టీకాంగ్రెస్ తలపెట్టిన ర్యాలీకి మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించారు. సేవ్ డెమోక్రసీ-సేవ్ కానిస్టిట్యూషన్ పేరిట శాంతియుత ర్యాలీకి అనుమతి కోరినా డీజీపీ అండ్ హైదరాబాద్ సీపీ పర్మిషన్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కవాతుకు, ఎంఐఎం సభలకు అనుమతిచ్చిన పోలీసులు.... తమ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వకపోవడం వెనుక ప్రభుత్వ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించారని ఫైరవుతున్నారు.

ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై టీకాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఇండియన్ పోలీస్ సర్వీసును ... కల్వకుంట్ల పోలీస్ సర్వీస్ గా మార్చేశారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆర్ఎస్ఎస్ కవాతుకు అనుమతిచ్చిన పోలీసులు... శాంతియుతంగా ర్యాలీ చేస్తామంటే తమకెందుకు పర్మిషన్ ఇవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఎవరికీ ఇబ్బంది లేని చోట సభ నిర్వహించుకుంటామన్నా వినిపించుకోవడం లేదని మండిపడుతున్నారు. అయితే, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ర్యాలీ నిర్వహించి తీరుతామంటోన్న కాంగ్రెస్ నేతలు.... పెద్దఎత్తున హైదరాబాద్ తరలిరావాలంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మరి, కాంగ్రెస్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీస్తుందో... లేక ప్రశాంతంగా సాగుతుందో చూడాలి.
 

By
en-us Political News

  
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు.
గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి.. ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.