ఆర్ఎస్ఎస్ చీఫ్‌కి... అంత భారీ భద్రతా?

Publish Date:Apr 22, 2026

Advertisement

 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్‌కు కల్పించిన జడ్‌ ప్లస్ కేటగిరీ భద్రతను సవాలు చేస్తూ బాంబే హైకోర్టులో నాగపూర్‌కి  చెందిన సామాజిక కార్యకర్త లాలన్ కిషోర్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన వాదనల ప్రకారం.. ఆర్‌ఎస్‌ఎస్ అనేది ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా  రిజిస్టర్డ్ సంస్థ కాదని, అటువంటప్పుడు చట్టబద్ధత లేని ఒక సంస్థ ప్రతినిధి కోసం పన్ను చెల్లింపుదారుల సొమ్మును ధారపోయడం పూర్తిగా చట్టవిరుద్ధమన్నది పిటిషనర్ వాదన. 

జడ్‌ ప్లస్  భద్రత కోసం రోజుకు సగటున రూ.1.5 లక్షల వరకు, అంటే నెలకు సుమారు రూ.45 లక్షల ప్రజా ధనం ఖర్చవుతుండటంతో, ఈ వృథా ఖర్చును ఆయన నుంచే వసూలు చేయాలని డిమాండ్ చేశారు పిటిషనర్. 2015 కంటే ముందు కేవలం ఇద్దరు లేదా ముగ్గురు  ఉండే వైఫ్లస్ భద్రతలో ఉన్న భాగవత్‌కు, ఒక్కసారిగా ఈ స్థాయి బందోబస్తు పెంచడం వెనుక అసలు ముప్పు కంటే కూడా రాజకీయ పలుకుబడిని, సామాజిక హోదాను చాటుకునే ప్రయత్నమే కనిపిస్తోందని అంటారు పిటిషనర్. దేశంలో భద్రతా వ్యవస్థ అనేది ప్రాణహాని కంటే కూడా ఒక స్టేటస్ సింబల్ గా మారిందని, ఒక ప్రైవేట్ వ్యక్తి కోసం కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తన వాదనలో పేర్కొన్నారు. అయితే, ఈ లోతైన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే కనీసం విచారణకు అనుమతి ఇవ్వకుండా హైకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ భద్రతా విషయంలో అసలు వాస్తవాలేంటో చూస్తే.. 

సాధారణంగా ఒక వ్యక్తికి భద్రత కల్పించేటప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రామాణికాలను అనుసరిస్తుంది. నిఘా వర్గాల  నివేదికల ఆధారంగా ఒక వ్యక్తికి ప్రాణహాని ఎంత ఉందనేది కేంద్ర హోం శాఖ నిర్ణయిస్తుంది. వ్యక్తి హోదా కంటే అతనికి ఉన్న ముప్పు తీవ్రతనే ఇక్కడ ప్రామాణికంగా తీసుకుంటారు.  గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే ఉన్నాయి. ముప్పు ఉన్నప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఉదాహరణకు పారిశ్రామికవేత్తలు లేదా ఆధ్యాత్మిక గురువులు వంటి వారికి భద్రత కల్పించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే, కొన్నిసార్లు ఆ ఖర్చును సదరు వ్యక్తులే భరించాలని కోర్టులు ఆదేశించిన దాఖలాలు కూడా ఉన్నాయి.

బాంబే హైకోర్టు ఈ పిటిషన్‌ను తిరస్కరించడానికి ప్రధాన కారణం—భద్రత అనేది కార్యనిర్వాహక వ్యవస్థ తీసుకునే నిర్ణయం అని భావించడం కావచ్చు. నిఘా నివేదికలు గోప్యంగా ఉంటాయి కాబట్టి, వాటిని బహిరంగ పరచడం సాధ్యం కాదు.  పిటిషనర్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, అత్యున్నత న్యాయస్థానం ఈ క్రింది అంశాలను పరిశీలించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఒక రిజిస్టర్ కాని సంస్థ ప్రతినిధికి ప్రభుత్వ ఖర్చుతో భద్రత కల్పించడం చట్టబద్ధమేనా? భద్రతా కేటాయింపుల్లో పారదర్శకత ఎంతవరకు ఉండాలి? ప్రాణహాని వర్సెస్ ప్రజా ధనం మధ్య సమతుల్యతను ఎలా పాటించాలి? అన్న చర్చ చేసేలా తెలుస్తోంది. చట్టపరంగా చూస్తే, ప్రభుత్వం ఒక వ్యక్తి ప్రాణ రక్షణ తన బాధ్యత అని భావిస్తే అది ఆ వ్యక్తి సామాజిక హోదాతో సంబంధం లేకుండా భద్రత కల్పించవచ్చు. అయితే, ఆ నిర్ణయం రాజకీయ ప్రేరేపితమా లేక వాస్తవ ముప్పు ఆధారితమా? అనేది కోర్టు విచారణలో తేలాల్సి ఉంది.


 

By
en-us Political News

  
ఐపీఎస్ అధికారిణి సంజుక్తా పరాశర్ సీఆర్‌పీఎఫ్ ప్రత్యేక కమాండో విభాగం కోబ్రా (CoBRA)కు తొలి మహిళా ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు.
పెళ్లయిన కేవలం రెండు వారాల్లోనే అమెరికాలోని మాసాచుసెట్స్‌లో హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఇంజనీర్ జాబీర్ హుస్సేన్ నిద్రలోనే కన్నుమూశారు. ఉదయం తల్లితో మాట్లాడిన కొద్ది గంటలకే చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన వివరాలు, కుటుంబ సభ్యుల ఆవేదన మరియు పార్థివదేహం రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలపై పూర్తి కథనం.
నల్లమలలో సోదాలు.. కౌకూర్‌, యాప్రాల్‌, అచ్చంపేటలో ఆయుధాల కోసం గాలింపు..!
హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్‌లోని హరిహర మెన్ హాస్టల్‌లో దారుణ హత్య చోటుచేసుకుంది. తోటి పనివాడు ప్రమోద్ జరిపిన కత్తిపోట్లకు కుక్ శశిధర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఢిల్లీ ఎర్రకోట బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ సంచలన చార్జ్‌షీట్ దాఖలు చేసింది. 11 మంది ప్రాణాలు తీసిన ఈ ఘటన వెనుక లాల్ మందిర్ దాడి కుట్ర, మూత్రం నుంచి బాంబు తయారీ, 12 సార్లు రెక్కీ నిర్వహించిన విస్తుపోయే వివరాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలోని పెన్సిల్వేనియా ల్యాంకాస్టర్ కౌంటీలో ఎఫ్రాతా పోలీసులు చేపట్టిన కీలక అరెస్ట్ వివరాలు. క్రైమ్‌వాచ్ నిఘా మరియు తాజా క్రైమ్ అప్‌డేట్స్ కోసం చదవండి.
ఒడిశా కోరాపుట్ పరిధిలోని బాలిపేట సేవాశ్రమం హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి సీయారా తాడింగిపై సహవిద్యార్థి తీవ్రంగా దాడి చేశాడు. మత్తు పదార్థాల ప్రభావంతోనే ఈ దాడి జరిగిందని, ర్యాగింగ్ అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఆయుధాలు చోరీ అయ్యాయి అంటూ సీన్ క్రియేట్ చేసిన ఇంటి దొంగలు..!
లండన్ వీసాలు, ఉద్యోగాల పేరిట మోసాల ఆరోపణలతో యూట్యూబర్ నందూస్ వరల్డ్ నందనను విజయవాడ పోలీసులు 4 గంటల పాటు విచారించారు. బిగ్ బాస్ తెలుగు 10 ఎంట్రీ ప్రచారం, రూ. 15 లక్షల ఫిర్యాదు మరియు పోలీసులకు ఆమె ఇచ్చిన షాకింగ్ స్టేట్‌మెంట్ పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
సంగారెడ్డి జిల్లా కంది మండలంలో అక్రమ ఇసుక దందాపై మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. ఎర్ధనూర్ సర్వే నెంబర్ 134లోని నక్క వాగు పరివాహక ప్రాంతంలో ఉన్న 6 ఇసుక ఫిల్టర్లను ధ్వంసం చేశారు. వాల్టా చట్టం ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరించారు.
లండన్ ఉద్యోగాలు, వీసా రెన్యువల్స్ పేరిట రూ.15 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలపై నందూస్ వరల్డ్ యూట్యూబర్ నందనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఇబ్రహీంపట్నం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు మరియు సీఐ సుబ్రహ్మణ్యం అందించిన పూర్తి సమాచారం ఇక్కడ చదవండి!
ఉత్తరప్రదేశ్ ఝాన్సీలోని పహుజ్ డ్యామ్ వద్ద సోషల్ మీడియా రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకిన యువకుడి రెండు కాళ్లు విరిగిపోయాయి. వైరల్ స్టంట్ వికటించిన పూర్తి వివరాలు మరియు వీడియో కథనం ఇక్కడ చదవండి.
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.