ఇదేం వేలంవెర్రి: సోషల్ మీడియా వేదికగా కడిగి పారేసిన రేణూదేశాయ్.. విషయమేంటంటే.?
Publish Date:Nov 10, 2026
Advertisement
ప్రముఖ నటి రేణూ దేశాయ్ దీపావళి సందర్భంగా పెద్ద శబ్దంతో టపాసులు కాల్చడంపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమంలో షేర్ చేసిన ఓ పోస్టులో, దీపావళి వేడుకలు ముగిసిన తరువాత కూడా అర్ధరాత్రి దాటినా పెద్ద శబ్దం వచ్చే టపాసులను కాల్చడం తగదన్నారు. దీపావళి తరువాత రోజు రాత్రి కూడా ఇదే విధంగా టపాసులు కాలుస్తూ శబ్ద కాలుష్యానికి పాల్పడటం సరికాదన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడేవారు పడుతున్న ఇబ్బందిని ఎందుకు పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా భారీ శబ్దాలు వచ్చేలా టపాసులు కాలుస్తూనే ఉన్నారని పేర్కొన్న రేణూ దేశాయ్ పండుగ రోజుల్లో తాను ఏదైనా మాట్లాడితే అనవసరంగా తనను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేస్తారనే భయంతోనే దీపావళి రోజు తాను మౌనంగా ఉన్నానన్నారు., దీపావళి ముగిసిన తరువాత కూడా శబ్ద కాలుష్యాన్ని పట్టించుకోకుండా టపాసులు కాల్చడాన్ని ఏమనాలని నిలదీశారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది కూడా చదవండి: దీపావళి రోజు ఈ పనులు తప్పక చేయండి.. అంతా శుభమే జరుగుతుంది! ప్రజలు దీపాల పండుగను సంతోషంగా జరుపుకోవడంలో తప్పులేదని, కానీ దానిని శబ్దాల పోటీలా మార్చడం ఏంత మాత్రం సముచితం కాదని పేర్కొన్నరేణూ దేశాయ్. వీలైనంతవరకు రాత్రి పది గంటల లోపే టపాసులు కాల్చడం ముగించాలనీ, ఆ తరువాతైనా జనాలను ప్రశాంతంగా ఉండనివ్వాలని కోరారు. తోటి మనుషుల పట్ల దయ,కరుణా ఉండాలన్న రేణూదేశాయ్, దిపావళి సరే, ఆ మరుసటి రోజు కూడా రాత్రంతా పెద్ద శబ్దం వచ్చే టపాసులు కాల్చడం ఎందుకని ప్రశ్నించారు. సొంత ఆనందం కోసం ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని రేణూదేశాయ్ తన పోస్టులో పేర్కొన్నారు. రేణూ దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో నెటిజన్ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మీకు నచ్చవచ్చు: బస్తర్లో సైనికులతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకోవాలి [Renu Desai Angry On Dewali Celevrations, Post Midnight, Instagram post, Diwali crackers, Trouble, People, Telugu One]
కేవలం తమ ఆనందమే ముఖ్యమనుకుని ఎదుటివారి కష్టాలను పట్టించుకోకపోవడం మూర్ఖత్వం కాక మరేమిటని నిలదీశారు. , తోటి మనుషుల పట్ల కనీస సానుభూతి కూడా లేకుండా ప్రవర్తించడం సరికాదని హితవు పలికారు.
http://www.teluguone.com/news/content/renu-desai-angry-on-dewali-celevrations-36-236701.html




