Publish Date:Jun 17, 2026
నీట్- పేపర్ లీక్ పై నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో, జైపూర్‌లో తనపై జరిగిన దాడి వెనుక ఆరెస్సెస్ హస్తం ఉందని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. నీట్ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఆర్ఎస్ఎస్ ఈ దాడికి పాల్పడిందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. దేశంలో విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోందన్న దీప్కే..ఇటువంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంగళవారం (జూన్ 16) మీడియాతో మాట్లాడిన ఆయన తాము గాంధీ, అంబేద్కర్‌ల ఆశయాల బాటలో నడిచే సత్యాగ్రహులమని అన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.
సోమవారం (జూన్ 15) జైపూర్ ర్యాలీలో, కార్యకర్తల భుజాలపై ఉన్న దీప్కేపై కొందరు వ్యక్తులు భౌతిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. ఈ నెల 21న నీట్ పునఃపరీక్ష జరగనుంది. ఈ వివాదంపై పోరాడేందుకు అమెరికా నుంచి తిరిగి వచ్చిన దీప్కే.. ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారు. కాగా, దీప్కే చేసిన ఆరోపణలపై ఆరెస్సెస్ ఇప్పటి వరకూ స్పందించలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rss-behind-the-attack-on-deepke-36-223181.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.