Publish Date:Jun 17, 2026
దేశంలోనే అత్యంత ఆధునికమైన, అలాగే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-2 ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురౌతోంది. ఇది నిజంగా అంతర్జాతీయ విమానాశ్రయమా? లేక రైల్వే స్టేషనా? అంటూ నెటిజనులు దుమ్మెత్తి పోస్తున్నారు. విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్ లోపల ప్రయాణికులు బెంచీలపై, నేలపై నిద్రిస్తున్న షాకింగ్ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎయిర్‌పోర్ట్ లో మౌలిక వసతుల కొరతపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.
అఫ్రీన్ అహెమది అనే ప్రముఖ డిజిటల్ క్రియేటర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో డిపార్చర్ ప్రాంతంలో ప్రయాణికులు అక్కడి సిమెంట్ బెంచీలపై, ఇండోర్ చెట్ల కింద, నేలపై తమ లగేజ్ బ్యాగులను దిండ్లుగా చేసుకుని గాఢనిద్రలో మునిగిపోయిన దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఈ దృశ్యాలు చూసిన నెటిజనులు అది అంతర్జాతీయ విమానాశ్రయమా? లేక రైల్వే స్టేషనా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. విమానాశ్రయంలో కనీస వసతుల కల్పనలో వైఫల్యాలకు ఇది నిలువుటద్దమని అంటున్నారు. విమాన టిక్కెట్లకు వేలాది రూపాయలు, పన్నుల రూపంలో భారీగా వసూలు చేస్తున్నప్పుడు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత లేదా అని నిలదీస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/is-it-airport-36-223184.html
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న ఆహార పదార్థాల్లో పెరుగు తున్న కల్తీ కారణంగా క్యాన్సర్‌తో పాటు అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమ స్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
వీకెండ్ వేళ మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు.
ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు నడిరోడ్డుపై మొరాయిస్తే ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీ (కన్నేపల్లి) పంప్ హౌస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా సామాన్య ప్రజల సమస్యలపై నాయకులు స్పందించే తీరు మారుతోంది.
ఆధునిక రాజకీయాల్లో ఎలక్షన్ స్ట్రాటజిస్ట్‌లు (ఎన్నికల వ్యూహకర్తలు), పొలిటికల్ మేనేజ్‌మెంట్ కంపెనీల హవా నడుస్తోంది.
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.