Publish Date:Jun 27, 2026
పీకలదాకా మద్యం సేవించారు... నేరుగా జ్యువెలరీ షోరూమ్‌లోకి దూసుకెళ్లారు... కత్తి చూపిస్తూ లక్ష రూపాయలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు... డబ్బులు ఇవ్వక పోతే చంపేస్తామని హెచ్చరించి అక్కడ నానా హంగామా సృష్టించారు. హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఈ ఘటనతో షోరూం సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు.హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నంబర్–10లో ఉన్న శ్రీ సాయి జగదాంబ పెరల్స్ అండ్ జ్యువెలర్స్ షోరూమ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
రౌడీషీటర్ ఆలీమ్ తన అనుచరుడు యూనస్‌తో కలిసి పీకలదాకా మద్యం సేవించి షోరూమ్‌లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లిన వెంటనే మేనేజర్ పంకజ్ బండ్గర్‌ను కత్తితో బెదిరిస్తూ లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం అంత డబ్బు లేదని మేనేజర్ చెప్పడంతో ఇద్దరూ మరింత ఆగ్రహానికి గురైననిందితులు షోరూంలోని సిబ్బందిని, మేనేజర్ ను చంపేస్తామంటూ రచ్చ రచ్చ సృష్టించి చివరకు "మళ్లీ వచ్చిన ప్పుడు డబ్బు రెడీగా ఉంచాలి... లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది" అంటూ బెదిరింపులకు గురి చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు..
ఈ ఘటనతో షోరూంలో ఉన్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అనంతరం మేనేజర్ పంకజ్ బండ్గర్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు, షోరూం సిబ్బందికి ప్రాణ హాని ఉందని, డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకే తిక ఆధారాలు, ఇతర వివరాల ఆధారంగా నిందితులు ఆలీమ్, యూనస్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ వాణిజ్య ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగించింది. వ్యాపారుల భద్రతకు ఎలాంటి భంగం కలిగినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/rowdy-sheeter-rampage-in-jewelry-shop-36-224326.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో నిర్వహించిన కృతజ్ఞత సభలో భావోద్వేగంగా మాట్లాడారు.
చరిత్ర సృష్టించిన వైభవ్.. 15 ఏళ్లకే టీమిండియాలో అరంగేట్రం..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.