22ఏ సెక్షన్ రద్దు చేయకుంటే ప్రజా యుద్ధం.. ఏబీ వెంకటేశ్వరరావు.!

Publish Date:Jul 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన 22ఏ  సెక్షన్ కింద రైతుల భూములను ఆంక్షల జాబితాలో పెట్టడంపై ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సమర శంఖారావం పూరించారు.  ప్రభుత్వాలు రాత్రికి రాత్రే లక్షలాది ఎకరాల రైతుల సొంత భూములను ప్రభుత్వ భూములుగా మార్చేస్తూ 22ఏలో బందీ చేశాయని మండిపడ్డారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తక్షణమే 22 ఏ సెక్షన్‌ను  పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో  రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి  తిరుగుబాటుతప్పదని హెచ్చరించారు. ఆ ప్రజా తిరుగుబాటు.. మరో రామ-రావణ యుద్ధాన్నితలపింప చేయడం ఖాయమన్నారు. రావణుడు సీతను అపహరించి లంకలో దాచిన విధంగా ప్రభుత్వాలు 22ఏ లంకలో పేదల భూములను బందీ చేశాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. 

చరిత్ర కాలం నుంచి ఇప్పటివరకు ఏ ముస్లిం రాజులు కానీ, బ్రిటిష్ పాలకులు కానీ తాకని రైతుల భూ హక్కులను నేటి పాలకులు కాలరాస్తున్నారని ఏబీ వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి రైతులు సాగుచేసుకుంటున్న వంశపారంపర్య భూములను, కంప్యూటరీకరణ పేరుతో ఒకే ఒక్క రోజులో నిషేధిత జాబితాలోకి చేర్చారని విమర్శించారు. నోటీసులు ఇవ్వకుండా, కనీస సమాచారం లేకుండా రైతుల భూములను లాక్కోవడం దారుణమన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల బాపట్ల జిల్లాను 22ఏ విముక్త జిల్లాగా మారుస్తామని చేసిన ప్రకటనలపై ఆయన ఘాటుగా స్పందించారు.  పని చేయాల్సింది కలెక్టర్ అయితే.. క్రెడిట్ తీసుకుని పట్టాలు పంచేది మీరా?  అంటూ మండిపడ్డారు. వచ్చే 5 వారాల్లోగా బాపట్ల జిల్లాను 22ఏ సెక్షన్ నుంచి పూర్తిగా విముక్తం చేయకుంటే అక్కడి కలెక్టర్‌ను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్, బ్రోకర్ల వరకు ఉన్న భూ విషవలయం ప్రభుత్వానికి తెలియంది కాదని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. 

రైతులు తమ భూమిని తమదిగా నిరూపించుకోవడానికి కోర్టుల చుట్టూ తిరుగుతూ లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సి రావడం దుర్మార్గమన్నారు. నోటీసు ఇవ్వకుండా 22ఏ జాబితాలో పెట్టిన ప్రతి సెంట్ భూమిని తక్షణమే వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, బాపట్ల కలెక్టరేట్ వేదికగా ఈ ప్రజా ఉద్యమం  మొదలైందని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. 

ABV, 22A Land Issue AP, Chandrababu Naidu, Bapatla Collector Challenge, Farmers Protest AP, Revenue Department Corruption

By
en-us Political News

  
సోషల్ మీడియాలో ఓ మహిళా ప్రజాప్రతినిధిని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ కానిస్టేబుల్‌పై సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేష్ సస్పెన్షన్ వేటు వేశారు.
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.