ఇక నుంచి తెలంగాణలో రహదారి భద్రతా సెస్సు

Publish Date:Jan 2, 2026

Advertisement

తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వం  రహదారి భద్రతా సెస్సు ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు మోటారు వాహనాల చట్ట సవరణ బిల్లును రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. నూతన నిబంధనల ప్రకారం, ఇకపై రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి కొత్త బైక్‌పై రూ. 2 వేలు, కారుపై రూ. 5 వేలు, భారీ వాహనాలపై రూ. 10 వేల చొప్పున రహదారి భద్రతా సెస్సెను వసూలు చేస్తారు. అయితే  ఈ సెస్సు నుంచి ఆటోలు, ట్రాక్టర్ ట్రైలర్లకు  మినహాయింపునిచ్చారు.

ఇక పోతే  సరుకు రవాణా వాహనాలకు ఇప్పటివరకు ఉన్న త్రైమాసిక పన్నును రద్దు చేస్తూ, దాని స్థానంలో 7.5 శాతం    లైఫ్ ట్యాక్స్ అమలు చేయాలని నిర్ణయించారు. అలాగే.. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పాత వాహనాలపైనా  4  నుంచి 6.5 శాతం వరకు పన్ను వసూలు చేయనున్నారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడంలో భాగంగా లైసెన్స్ జారీ ప్రక్రియను కూడా కఠినతరం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కంప్యూటర్ ఆధారిత డ్రైవింగ్ పరీక్షలను ప్రవేశపెడుతున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఏటా సుమారు 9 లక్షల కొత్త వాహనాలు రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో, ఈ కొత్త సెస్సు ద్వారా ప్రభుత్వానికి రూ. 300 కోట్ల వరకు అదనపు ఆదాయం సమకూరనుందని ఆయన చెప్పారు.  

By
en-us Political News

  
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది.
పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన బర్సీ దేవా, చదువు మధ్యలోనే ఆపి మావోయిస్టు ఉద్యమంలో చేరాడు.
డ్రగ్స్ వినియోగం కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు.
కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు.
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది.
ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా వెల్లడించింది.
ఈ నిర్ణయంతో బీసీసీఐ బంగ్లాదేశ్ లో క్రికెట్ సంబంధాలను తెగతెంపులు చేసుకున్నట్లేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదలా ఉంచితే.. ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లను తీసుకోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లా ప్లేయర్లపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఫలితం లేకపోవడంతో గ్రామ పెద్దలు, బంధువుల ముందు పంచాయతీ పెట్టాలని నిర్ణయించుకున్నాడు. దీంతో విషయం తెలిసిన మౌనిక తన బండారం నలుగురికీ తెలిసిపోతుందన్న భయంతో భర్త హత్యకు పథకం పన్నింది.
రాంపల్లి, ఘట్‌కేసర్ ప్రధాన రహదారిపై సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్ షాప్‌కు శుక్రవారం సాయంత్రం సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కస్టమర్లలా వచ్చారు. సాధారణ కొను గోలుదారుల మాదిరిగా షాప్‌లోకి ప్రవేశించిన వారు. కొద్దిసేపటికి ఒక్కసారిగా తమ వద్ద ఉన్న టాయ్ గన్ తో షాప్ యజమాని సందీప్ కుమారుడిని చంపేస్తామని బెదిరించారు.
35.19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంలో నేడు దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి పవన్ కల్యాణ్ శనివారం శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసేందుకు విచ్చేశారు కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ గిరి ప్రదక్షిణ మార్గాన్ని కూడా సమష్టిగా సాకారం చేద్దామని పిలుపు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో 35.19 కోట్ల రూపాయల వ్యవయంతో భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. పవన్ కల్యాణ్ చొరవతో టీటీడీ ఈ నిధులను అందజేసింది. ఈ మౌలిక సదుపాయాలలో ప్రధానంగా దీక్ష విరమణ మండపం, భక్తుల సత్రం నిర్మాణం వంటివి ఉన్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.