ప్రజాప్రతినిధులా వీళ్లు..అపర కీచకులు

Publish Date:May 5, 2016

Advertisement

ప్రజాప్రతినిధులు..కష్టాల్లో ఆదుకుంటారని..సమస్యల్లో చేయూతనిస్తారని నమ్మి ఓట్లేసి గెలిపిస్తారు ప్రజలు. కాని ప్రజల మాన ప్రాణాలను కాపాడవలసిన ప్రజాప్రతినిధులు దారుణాలకు పాల్పుడుతన్నారు. అధికారం చేతిలో ఉందని ఇళ్లను..స్థలాలను కబ్జా చేసే శాసనసభ్యులను చూసుంటాం కాని శాసనసభ్యుల్లో కొందరు కీచకుల్లా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తూ ప్రజాప్రతినిధులే అత్యాచారానికి పాల్పడితే ఇక ఆడదాని మానానికి రక్షణ ఎక్కడుంటుంది. మొన్నామధ్య బీహార్‌లో ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది.

 

నవాడ నియోజకవర్గ ఎంఎల్‌ఏ వల్లభ్ యాదవ్ ఒక మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక ఆలస్యంగానైనా జరిగిన ఘోరాన్ని కుటుంబసభ్యులకు తెలియజేసింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఎంఎల్‌ఏ గారు పరారయ్యారు. విషయం రచ్చకెక్కడంతో పార్టీ ఆధినాయకత్వం ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పటికే పరువు గంగలో కలవడంతో యాదవ్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు.

 

ఇది జరిగి రెండు నెలలు కూడా గడవకముందే..గోవాలో మరో ఎమ్మెల్యేగారు కీచకుడి అవతారం ఎత్తారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కృత ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్ తన షోరూంలో పనిచేసే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఓ మైనర్ బాలిక మార్చి నెలలో కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు బాలిక ఆచూకి కనుక్కుని విచారించడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే అటానాసియో మోన్సిరేట్ తనపై ఆత్యాచారానికి పాల్పడినట్టు బాలిక పోలీసులకు వివరించింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్లడంతో..అందుకు ఆయన తాను విచారణకు హాజరవుతానని..ఎక్కడికి పారిపోనని చెప్పాడు. ఇదంతా తనపై జరిగిన కుట్ర అని ఆరోపించాడు. ఆ బాలిక తన షోరూంలో పనిచేసేదని, డబ్బుల విషయంలో తేడా రావడంతో ఆమెను తొలగించినట్టు చెప్పాడు. ఆ కక్షతోనే తనపై ఆరోపణలు చేస్తున్నట్టు పోలీసులకు వివరించాడు.

 

కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి నిధులు అందకపోయినా తమ సొంత ఖర్చుతో ప్రజలకు సేవ చేస్తూ చట్టసభల విలువను కాపాడుతుంటే...బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ..ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యతను మరచి కాలనాగై కూతుళ్ల వయసుండే బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వారు సమాజానికి చీడ పురుగుల్లాంటి వారు వీరిని ఏరిపారేయకపోతే మొత్తం వ్యవస్థ నాశనమైపోతుంది.
 

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.