రిల్స్ కోసం రిస్క్.. రోడ్డుపై స్టంట్.. చివరకు పోలీసుల పంజా..!

Publish Date:Jul 19, 2026

Advertisement

 

నేటి సోషల్ మీడియా యుగంలో క్షణాల్లోనే ఫేమస్ కావాలనే మోజు యువతను ప్రమాదకర మార్గాల వైపు నెడుతోంది. రీల్స్, షార్ట్ వీడియోల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి స్టంట్‌లు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కొందరు ప్రమాదాలకు గురవుతుండగా.. మరికొందరు చట్టపరమైన ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నా యువతలో మాత్రం మార్పు కనిపించడం లేదు. వ్యూస్, లైక్స్, ఫాలోవర్స్ కోసం ఎంతటి రిస్క్‌కైనా వెనుకాడటం లేదు.

అచ్చం ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. శంషా బాద్ ఎయిర్‌పోర్ట్ రోడ్డుపై ఓ యువతి, యువకుడు వేగంగా వెళ్తున్న కారు పైకప్పుపై కూర్చొని ప్రమాదకరంగా ప్రయాణిస్తూ వీడియో చిత్రీకరించారు. రద్దీ రహదారిపై చేసిన ఈ స్టంట్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. వీడియోపై స్పందించిన ఆర్‌జీఐఏ ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టి, వీడియో ఆధారంగా ఇద్దరినీ గుర్తించారు.

విచారణలో అనుమతులు లేకుండా కారులో మార్పులు చేసినట్లు తేలడంతో పాటు, ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ప్రమాదకరంగా డ్రైవింగ్ చేసినట్లు గుర్తించారు. దీంతో ప్రమాదకర డ్రైవింగ్, అనధికారిక వాహన మార్పులు తదితర నిబంధనల ఉల్లంఘనల కింద ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. ప్రజల భద్రతకు ముప్పు కలిగించే ఇలాంటి స్టంట్‌లు, అనధికారిక వాహన మార్పులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్‌జీఐఏ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టొద్దని పోలీసులు యువతకు సూచిస్తున్నారు.

By
en-us Political News

  
ఏపీలో సంచలనం రేపిన మద్యం రవాణా టెండర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ నందనవనం సూరి దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది.
ఈశాన్య భారత రత్నమైన సిక్కిం రాష్ట్రంలో అనూహ్య రీతిలో సంభవించిన ఘోర దుర్ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇంగ్లండ్‌తో జరిగిన 3వ వన్డేలో 110 బంతుల్లో 138 పరుగులు చేసిన రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ సంచలన విషయాలు వెల్లడించారు. 2011, 2023 వరల్డ్‌కప్ గాయాలు, 2027 వన్డే ప్రపంచ కప్ సాధించే వరకు హిట్‌మ్యాన్ రిటైర్ కాకపోవడానికి గల అసలు కారణాలు తెలుసుకోండి.
అల్పైన్ టెక్స్‌వర్ల్డ్ ఐపీఓ NSE, BSE లలో రూ. 105 వద్ద ఫ్లాట్‌గా లిస్ట్ అయింది. రూ. 126.25 కోట్ల విలువైన ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ వివరాలు, కంపెనీ బిజినెస్ ప్లాన్స్, పూర్తి స్టాక్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
ఆల్ట్రాటెక్ సిమెంట్ క్యూ1 ఫలితాల్లో నికర లాభం 17% పెరిగి రూ. 2,599 కోట్లకు చేరింది. నువామా మరియు ఇతర బ్రోకరేజ్ సంస్థలు టార్గెట్ ధరను రూ. 15,209 వరకు పెంచాయి. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
పేటీఎం క్యూ1 ఫలితాల్లో నికర లాభం 79% పెరిగి రూ. 220 కోట్లకు చేరింది. షేర్లు లాభాల్లో దూసుకుపోతుండగా, గోల్డ్‌మన్ శాక్స్, సిటీ సంస్థలు భారీ టార్గెట్స్ ఇచ్చాయి. పూర్తి వివరాలు ఇక్కడే చదవండి.
2026 జూలై 21 నాటి NYT Strands Game 870 హింట్స్, స్పాంగ్రామ్ మరియు అన్ని సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. Write there థీమ్‌తో ఉన్న ఈ పజిల్‌ను సులభంగా సాల్వ్ చేయడానికి కావలసిన క్లూస్ మరియు పూర్తి సమాచారం మీకోసం!
ఐటీఆర్‌లో వీఆర్‌ఎస్ నిధులను అడ్వాన్స్ శాలరీగా తప్పుగా పేర్కొన్నప్పటికీ, పూణే ఐటీఏటీ రూ.65.21 లక్షల మొత్తానికి పన్ను మినహాయింపు ఇస్తూ కీలక తీర్పు వెలువరించింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి!
జాతీయ రహదారుల వినియోగదారులకు NHAI ఊరట! రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా 20 కిలోమీటర్ల పరిధిలోని వారికి డిజిటల్ లోకల్ పాస్ మరియు 22 భాషల్లో సేవలు అందించే మార్గమిత్ర హెల్ప్ సెంటర్‌ను ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
గతంలో కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం, తీవ్ర భయాందోళనలు ప్రజల మనస్సుల్లో ఇంకా సజీవంగానే ఉండటంతో ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ వ్యాపతి తీవ్ర ఆందోళనకు కరాణమౌతోంది. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కొత్త కరోనా వేరియంట్ పెద్ద ప్రమాదకరమనది కాదని స్పష్టం చేసింది.
ఆమెతో ఏడాది నుంచి రిలేషన్‌లో ఉన్న..సూసైడ్‌ నోట్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి..!
ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సులభంగా యూపీఐ పేమెంట్స్ చేసేలా ఎన్‌పీసీఐ సరికొత్త ఎన్ఎఫ్సీ ఆఫ్‌లైన్ టెక్నాలజీని అందుబాటులోకి తెస్తోంది. ఫోన్ నెట్‌వర్క్ లేని ప్రదేశాల్లోనూ రూ. 2,000 వరకు పిన్ లేకుండా చెల్లించే విధానం మరియు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.