దూకుడు పెంచిన రేవంత్‌.. 26 నుంచి స‌రికొత్త పాల‌న!

Publish Date:Jan 5, 2025

Advertisement

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి పాల‌న‌లో మ‌రింత దూకుడు పెంచేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో ఈనెల 26వ తేదీ నుంచి స‌రికొత్త పాల‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్త‌యింది. ఈ ఏడాది కాలంలో తాను అనుకున్న విధంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వ‌చ్చిన రేవంత్ అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్‌, బీజేపీల‌పై ఎదురు దాడినీ కొన‌సాగించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టి అమ‌లు చేస్తూ   సాగుతున్నారు. అయితే  ఈ ఏడాది కాలంలో రేవంత్ స‌ర్కార్ పాల‌న‌కు అత్తెస‌రు మార్కులే వ‌చ్చాయి. హామీల‌ను అమ‌లు చేయ‌డంలో రేవంత్ స‌ర్కార్ కొంత‌ మేర విఫ‌ల‌మైంద‌న్న వాద‌న తెలంగాణ సమాజంలో బలంగా  వ్య‌క్త‌మ‌వుతోంది. ముఖ్యంగా రైతుల‌కు మేలుచేసే విష‌యంలో ఏడాది కాలంలో ప్ర‌భుత్వం ఆశించిన స్థాయిలో విజ‌యవంతం కాలేద‌న్న అభిప్రాయం ఉంది. రెండు ల‌క్ష‌ల బ్యాంకు రుణాల‌ను మాఫీ చేసిన‌ప్ప‌టి.. రైతులందరికీ రుణ‌మాపీ అంద‌లేదు. దీంతో రుణ‌మాఫీ కాని రైతులు రేవంత్ స‌ర్కార్ పై గుర్రుగా ఉన్నారు. ప్ర‌భుత్వం మాత్రం అర్హ‌త ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ రుణ‌మాఫీ చేస్తున్నామ‌ని చెబుతోంది.  అయితే, ఏడాది కాలంలో వైఫ‌ల్యాల‌ను స‌రిదిద్దుకుంటూ స‌రికొత్త పాల‌నకు శ్రీ‌కారం చుట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం జ‌న‌వ‌రి 26వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు.  

జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ‌డిచిన ఏడాదిలో పాల‌నాప‌రంగా, రాజ‌కీయంగా జ‌రిగిన లోటుపాట్ల‌ను గ్ర‌హించి వాటిపై ప‌ట్టు సాధించేందుకు  రేవంత్‌ ఫోక‌స్ పెట్టారు. అందు కోసం నేరుగా జిల్లాల్లోని ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు ముఖ్య‌మంత్రి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 24 వ‌ర‌కు రేవంత్ రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్ల‌నున్నారు. హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన త‌రువాత 26వ తేదీన రిప‌బ్లిక్ డే వేడుక‌ల్లో పాల్గొని.. అదే రోజు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు రేవంత్ శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. శ‌నివారం జ‌రిగిన తెలంగాణ కేబినెట్ స‌మావేశంలో రేవంత్ రెడ్డి రైతు భ‌రోసా ప‌థ‌కంపై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ ప‌థ‌కంతో పాటు మ‌రికొన్ని ప‌థ‌కాల‌కు జ‌న‌వ‌రి 26వ తేదీ నుంచే రేవంత్ స‌ర్కార్ శ్రీ‌కారం చుట్ట‌నుంది. అంత‌కు ముందు 16వ తేదీ నుంచే మంత్రులు నియోజ‌క‌వ‌ర్గాల వారిగా ప‌ర్య‌ట‌న‌లు చేయ‌నున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ ప్రారంభించ‌బోయే ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల్లో విస్తృత ప్ర‌చారం క‌ల్పించ‌నున్నారు. 

కేబినెట్ స‌మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కం అమ‌లుకు నిర్ణ‌యించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణ‌యాల‌పై స్వ‌యంగా రేవంత్ రెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. గ‌త ప్ర‌భుత్వంలో రైతు బంధు ప‌థ‌కం కింద రెండు ద‌ఫాలుగా ఎక‌రానికి రూ.10వేలు అందించింది. అయితే, ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తీ ఎక‌రాకు రెండు ద‌ఫాలుగా రూ.12వేలు ఇచ్చేందుకు నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి రైతు భ‌రోసాగా నామ‌క‌రం చేసిన విష‌యం తెలిసిందే. గ‌త బీఆర్ఎస్ హ‌యాంలో రైతుల‌కు ఎన్ని ఎక‌రాలు ఉన్నా ప‌రిమితి లేకుండా రైతు బంధు ప‌థ‌కం అమ‌లైంది. ఆ క్ర‌మంలో వ్య‌వ‌సాయం యోగ్యం కాని భూములు, రాళ్లుర‌ప్ప‌లు, మైనింగ్ కోసం కేటాయించిన భూములు, రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వేసిన భూముల‌కు, ప‌రిశ్ర‌మ‌ల‌కు కేటాయించిన భూముల‌కు సైతం రైతు బంధు నిధులు ప‌డ్డాయి. దీంతో ప్ర‌జాధ‌నం భారీగా వృథా అయ్యిందని గ‌తంలో కేసీఆర్ ప్ర‌భుత్వంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం రేవంత్ స‌ర్కార్ రైతు భ‌రోసా ప‌థ‌కం అమ‌లు విష‌యంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. కేవ‌లం వ్య‌వ‌సాయ యోగ్య‌మైన భూముల‌కు మాత్ర‌మే రైతు భ‌రోసా సాయం అందిస్తామ‌ని రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ప‌ల్లెల్లో ఉంటూ భూమి లేని వ్య‌వ‌సాయ రైతు కుటుంబాల‌కు కూడా ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ ప‌థ‌కానికి ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసాగా పేరును ఖ‌రారు చేశారు. రేవంత్ స‌ర్కార్ నిర్ణ‌యంతో ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌ వుతు న్నాయి. అస‌లైన రైతుల‌కు, భూమిలేని కుటుంబాల‌కు మేలు జ‌రిగేలా కాంగ్రెస్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఉంద‌ని పేర్కొంటున్నారు.

బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో కొత్త రేష‌న్ కార్డుల‌కు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న వారు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా కొత్త‌కార్డులు రాలేదు. ప్ర‌స్తుతం కాంగ్రెస్  హ‌యాంలో అర్హులైన వారంద‌రికీ కొత్త రేష‌న్ కార్డు ఇవ్వాల‌ని తెలంగాణ కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.  రైతు భ‌రోసా, కొత్త రేష‌న్ కార్డులు, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాల‌ను జ‌న‌వ‌రి 26వ తేదీనే శ్రీ‌కారం చుట్టాల‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 26 నుంచి రేవంత్ స‌ర్కార్ స‌రికొత్త పాల‌న ప్రారంభ‌మ‌వుతుంద‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి ఏడాది పాల‌న‌లో లోటుపాట్ల‌ను స‌రిచేసుకుంటూ రాబోయే కాలంలో మ‌రింత మెరుగైన పాల‌న‌ను తెలంగాణ ప్ర‌జానీకానికి అందించేందుకు రేవంత్ స‌ర్కార్ సిద్ధ‌మ‌వుతున్నది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.