ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్  చాలా కాలం విరామం తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. ఇంత కాలం బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమై అడపాదడపా చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో ప్రెస్ మీట్లతో సరిపెట్టేశారు. మధ్యలో వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన సంఖ్యలో పరామర్శల పేరుతో బయటకు వచ్చినా గత రెండేళ్లుగా పెద్దగా పొలిటికల్ యాక్టివిటీ లేదనే చెప్పాలి. ఇప్పుడు ఇక ఆయన   నెమ్మదిగా   బయటకు వస్తున్నారు. తాజాగా బుధవారం (ఆగస్టు 4) పొగాకు రైతులకు మద్దతుగా ఆయన  దేవరపల్లి  వచ్చారు. వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్   రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది. ఒక విధంగా చెప్పాలంటే.. తెలుగుదేశం కూటమిపై విమర్శలు,  వెన్నుపోటు, అక్రమ అరెస్టుల వ్యాఖ్యలతో ఆవు కథే మళ్లీ మళ్లీ  చెప్పారనిపించేలా ఆయన ప్రసంగం ఉంది.   చంద్రబాబును,  తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పార్టీగా అభివర్ణించారు. చాలా చాలా ఏళ్లుగా జగన్ విమర్శలు ఇవే. ఇక అక్రమ అరెస్టుల గురించి ఆయన చేసిన విమర్శలు ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైసీపీ మద్దతుదారులను, నాయకులను అక్రమంగా అరెస్టులు చేస్తున్నదనీ, అక్రమకేసులు బనాయిస్తోందని జగన్ విమర్శించారు. అయితే జగన్ విమర్శలలో పస లేదని పరిశీలకులు అంటున్నారు. సీదిరి అప్పలరాజు అరెస్టు, తమ్మినేని సీతారాంపై కేసులను ప్రస్తావిస్తూ పరిశీలకులు వాటిలో రాజకీయం ఎక్కడుందనీ, నేరాలకు పాల్పడినా వైసీపీయులు అని చట్టం వదిలేయాలా అని ప్రశ్నిస్తున్నారు.  అదలా ఉంచితే గత రెండేళ్లుగా జగన్  వారానికో రెండు వారాలకో ఓసారి బెంగళూరు ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇవే మాటలు చెబుతున్న సంగతిని ప్రస్తావిస్తూ.. దేవరపల్లిలో జగన్ ప్రసంగం రొటీన్ గా ఉందని విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రసంగాలు, విమర్శల పట్ల జగన్ మద్దతు దారులు కూడా పెదవి విరుస్తున్నారు.   YS Jagan Devarapalli Tour, TDP Governmen, t Tobacco Farmers Issue,   Jagan Political Comments, APnews, TeluguOne 
 వైసీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్  తమ్మినేని సీతారాం రాజకీయ భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందా? ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  వైసీపీలో  కీలక నేతగా గుర్తింపు పొందిన తమ్మినేని  ఇటీవలి కాలంలో వరుస వివాదాలు, న్యాయపరమైన చిక్కులతో సతమతమౌతున్నారు. అలాగే వైసీపీలో కూడా ఆయనకు పెద్దగా ప్రాముఖ్యత లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసే ఉద్దేశంలో ఉన్నారన్న ప్రచారం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.   ఇటీవల వెలుగుచూసిన   ఆస్తి వివాదం,  నకిలీ  డెత్ సర్టిఫికెట్ తో  భూ కబ్జా కుట్ర ఆరోపణలు తమ్మినేని ప్రతిష్ఠను బాగా దెబ్బతీశాయి. ఇందుకు సంబంధించి నమోదైన కేసులో తమ్మినేనితో పాటు ఆయన సతీమణి వాణిశ్రీ, కుమారుడు వెంకట శ్రీరామ్ లు నిందితులుగా ఉన్నారు. అరెస్టును తప్పించుకోవడానికి తమ్మినేని కుటుంబంతో సహా పరారయ్యారు కూడా.  పరారీలో ఉండగానే కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు పొందిన తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ముందస్తు బెయిలు లభించని ఆయన కుమారుడు  శ్రీకాకుళం కోర్టులో లొంగిపోయి బెయిలు పొందారు.   హైకోర్టు ధర్మాసనం కూడా తమ్మినేని సీతారాం,  ఆయన భార్యపై తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో తాత్కాలిక ఉపశమనం లభించింది.  ఇదంతా ఒకెత్తయితే.. ఈ కేసు విషయంలో తమ్మినేనికి వైసీపీ నుంచి ఎటువంటి మద్దతూ లభించకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురై పార్టీని వీడే ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.   2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు.   వైసీపీ అధినేత జగన్ కూడా  తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అన్నిటినీ ఓర్చుకుంటూ పార్టీలో కొనసాగుతున్న తనకు క్లిష్ట సమయంలో పార్టీ నుంచి కనీస మద్దతు లభించకపోవడంతో తమ్మినేని మనసు విరిగి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి నిర్ణయించుకున్నారంటున్నారు.  ఏ క్షణంలోనైనా తమ్మినేని సీతారాం వైసీపీకి రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. Thammineni Seetharam,   Resignation, AP Former Speaker,  Srikakulam Property Dispute  
వైసీపీలో అంతర్గత విభేదాలు, అసంతృప్తులు మరోసారి బహిర్గతమయ్యాయి. గతంలో  వైసీపీ అధినేత  జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ  కోసం ప్రత్యర్థులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆంధ్రప్రదేశ్) అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్..  తాజాగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తన భార్యతో కలిసి రోడ్డుపై బైఠాయించి  నిరసన వ్యక్తంచేశారు. వైసీపీ అగ్రనాయకత్వం తనను వాడుకుని వదిలేసిందని ఆవేదన వ్యక్తం చేస్తూ చేపట్టిన ఈ ధర్నా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. గతంలో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలో ఉన్న సమయంలో   నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపై బోరుగడ్డ అనిల్  తీవ్ర  వ్యాఖ్యలు చేశారు. జగన్ టైమిస్తే.. గంట, అరగంటలో  చంద్రబాబు, లోకేష్ లను లేపేస్తానంటూ బోరుగడ్డ  నోటికొచ్చినట్లుగా దూషణలు చేశారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. అయితే..  ఇప్పుడు   వైసీపీ నాయకత్వం తనను పూర్తిగా పక్కన పెట్టిందని బోరుగడ్డ అనిల్ ఆరోపిస్తున్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసుకు వెళ్తే కనీసం లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని..  ముఖ్యంగా వైసీపీ ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణ రెడ్డి తనను తీవ్రంగా అవమానిస్తున్నారని  ధ్వజమెత్తారు. తాడేపల్లి ప్యాలెస్ వద్ద గంటల తరబడి వేచి చూసేలా చేసి,  నువ్వు ఎవరు?  అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  పార్టీ తరఫున తాను కేసులు ఎదుర్కొని జీవితాన్ని నాశనం చేసుకుంటే, ఇప్పుడు తనను రౌడీషీటర్‌గా ముద్రవేసి దూరం పెట్టడం దారుణమంటూ బేల మాటలు మాట్లాడారు.   వైఎస్ జగన్ ఇంటి ముందే ప్రాణాలు వదులుతానని, తనకు న్యాయం జరగకపోతే వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. కారుమూరి వెంకట్ రెడ్డి వంటి నేతలు సైతం తనను కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని ఆడియో సాక్ష్యాలను బయటపెట్టారు. అయితే ఈ వ్యవహారంపై తెలుగువన్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్  వైసీపీలో ఇది సహజ పరిణామమేనని విశ్లేషించారు.  శ్రీరెడ్డి, వర్రా రవీంద్రరెడ్డి, బోరుగడ్డ అనిల్ వంటి వారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుని, ఆ తర్వాత చేతులెత్తేయడం వైసీపీ అగ్రనాయకత్వానికి అలవాటేనని   శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. గతంలో విజయసాయి రెడ్డి, డొక్కా మాణిక్య వరప్రసాద్ వంటి సీనియర్లు సైతం పార్టీలోని కోటరీ వల్ల తీవ్ర అవమానాలకు గురయ్యారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నేతలు పెంచి పోషించిన నాయకులే ఇప్పుడు వారిపైనే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తుండటం కర్మ ఫలమని విశ్లేషించారు.   పార్టీ కోసం సర్వస్వం కోల్పోయిన కార్యకర్తలకు, మద్దతుదారులకు ఈ పరిణామాలు ఒక హెచ్చరిక లాంటివని పేర్కొంటున్నారు. అయితే బోరుగడ్డ ఇలా రోడ్డున పడటానికి కారణం స్వయంగా జగనేనని డీవీ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన జగనన్న వదిలిన బాణాన్ని అంటూ జగన్ కోసం పాదయాత్ర చేసిన షర్మిల ఉదంతాన్ని గుర్తు చేశారు.   తాడేపల్లిలో బోరుగడ్డ అనిల్ దంపతుల ధర్నా వైసీపీ కోటరీ రాజకీయాలను మరోసారి ఎండగట్టిందన్న ఆయన రాబోయే రోజుల్లో ఇలాంటి అసంతృప్తులు మరిన్ని బయటపడే అవకాశం ఉందని చెప్పారు.    Borragadda Anil Dharna, Tadepalli YCP Office Protest, Borragadda Anil Vs Sajjala, YS Jagan Mohan Reddy,AP Political Updates, Telugu One
ALSO ON TELUGUONE N E W S
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ హీరోయిన్ గా చిత్రసీమలోకి అడుగుపెడుతున్న తొలి చిత్రం 'తుడక్కమ్' (Thudakkam). ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత ఆశీష్ జో ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి '2018' వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌తో ఇండియా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రతిభావంతుడైన దర్శకుడు జ్యూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ నెట్టింట విపరీతమైన వ్యూస్‌తో దూసుకుపోతూ విశేష ఆదరణ పొందుతోంది. 'తుడక్కమ్' ట్రైలర్ విషయానికి వస్తే, కేవలం 1 నిమిషం 35 సెకన్ల వ్యవధిలోనే తీవ్రమైన ఉత్కంఠను పెంచేలా కట్ చేశారు. విస్మయ మోహన్‌లాల్ తొలి చిత్రంలోనే ఒక డిఫరెంట్ అండ్ ఇంటెన్స్ రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ఒక సాధారణ కుటుంబ నేపథ్యం, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న సంభాషణలు, చదువు, ఉద్యోగం, అద్దె ఇల్లు చుట్టూ తిరిగే సన్నివేశాలతో మొదలయ్యే ట్రైలర్, క్రమంగా తీవ్రమైన సస్పెన్స్, డ్రామా వైపు మళ్లుతుంది. ట్రైలర్‌లో విస్మయ నటన, ఆమె బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. "ఒకప్పుడు జరిగిన ఆ ఘటనను నాన్న ఇక గుర్తుచేసుకోవద్దు, అప్పుడు ఒక తప్పు జరిగింది.. ఇకపై అది జరగదు" అని విస్మయ చెప్పే ఇంటెన్స్ సంభాషణలు కథలో ఉన్న సస్పెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను తెలియజేస్తున్నాయి. అలాగే "నా చేతులతోనే చంపేయాలి" అనే డైలాగ్స్, ఇల్లు ఖాళీ చేయడం, బెదిరింపులు, ప్రమాదకరమైన మలుపుల చుట్టూ సాగే దృశ్యాలు ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ ఫ్యామిలీ సస్పెన్స్ డ్రామాగా రూపొందిందని సంకేతాలు ఇస్తున్నాయి. స్టార్ కిడ్ అయినప్పటికీ విస్మయ ఎంచుకున్న కథ, ఆమె పండించిన సహజమైన హావభావాలు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాయి. జ్యూడ్ ఆంథనీ జోసెఫ్ తన మార్కు టేకింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎంతో ఉత్కంఠభరితంగా మలిచారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా ట్రైలర్ మూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. మోహన్‌లాల్ అభిమానులతో పాటు మలయాళ సినీ ప్రియులు విస్మయ ఎంట్రీపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.     
తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్'. ప్రతి ఏటా సరికొత్త హంగులు, ఆసక్తికరమైన కంటెస్టెంట్లతో అలరించే ఈ షో ఇప్పుడు పదో సీజన్‌కు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ కొత్త సీజన్‌పై హోస్ట్, కింగ్ అక్కినేని నాగార్జున చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బిగ్ బాస్ సీజన్ 10 ఊహించని ట్విస్టులతో, వినోదంతో కూడి ఉండబోతోందని నాగార్జున స్పష్టం చేశారు. అయితే ఈసారి హౌస్‌లోకి వచ్చే కంటెస్టెంట్లకు ఆయన ఒక స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. షోలో నిబంధనలు ఉల్లంఘించినా, గత సీజన్లలోలాగా ప్రేక్షకులు అసహ్యించుకునే ప్రవర్తన కనబరిచినా సహించేది లేదని తేల్చి చెప్పారు. విజేతగా నిలవడానికి కేవలం గేమ్‌ ఆడడమే కాకుండా, పద్ధతిగా నడుచుకోవడం చాలా ముఖ్యమని నాగ్ పేర్కొన్నారు. "ఈసారి హౌస్‌లో అనుచిత ప్రవర్తనకు చోటు లేదు. హద్దులు దాటితే కఠిన చర్యలు ఉంటాయి" అని ఆయన స్పష్టం చేయడంతో కంటెస్టెంట్లలో ఇప్పటినుండే టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. అక్కినేని నాగార్జున గత కొన్ని సీజన్లుగా బిగ్ బాస్‌ను ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నారు. తనదైన స్టైల్, టైమింగ్, వీకెండ్ ఎపిసోడ్లలో కంటెస్టెంట్లను సరైన రీతిలో గైడ్ చేసే తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బిగ్ బాస్ కోసం ఆయన ప్రత్యేక సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నాగార్జున ఇచ్చిన వార్నింగ్‌పై బిగ్ బాస్ ప్రియులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈసారి సీజన్ చాలా సీరియస్‌గా, కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ ఉండబోతోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈ గ్రాండ్ రియాలిటీ షో లాంచ్ డేట్ మరియు కంటెస్టెంట్ల వివర అధికారికంగా వెల్లడి కానున్నాయి. కొత్త సీజన్ సరికొత్త థీమ్‌తో ఎలా ముందుకు రాబోతుందో చూడాలని బుల్లితెర అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమాల్లో కనిపించే పాత్రలలో నటులు ఎంతగా ఒదిగిపోతారో, కొన్నిసార్లు ప్రేక్షకులు కూడా అంతే తీవ్రంగా భావోద్వేగాలకు లోనవుతుంటారు. ప్రతినాయకుడిగా నటిస్తే బయట కూడా నిజమైన శత్రువులా భావించే విచిత్ర పరిస్థితులు సినీ ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. తాజాగా అలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నట్లు నటుడు తారక్ పొన్నప్ప వెల్లడించారు. తాను నటించిన 'అనకాపల్లి' చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న తారక్ పొన్నప్ప, ఓ ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల నుంచి ఎదురవుతున్న ట్రోలింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ చరణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'లో తాను ఓ ముఖ్యమైన సీన్ చేసినప్పటి నుండి సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ఎదుర్కొంటున్నానని చెప్పారు. ఈ ఇంటర్వ్యూలో "మా రామ్ చరణ్ కాలు ఎందుకు విరగ్గొట్టారు?" అని యాంకర్ అడిగిన ప్రశ్నకు తారక్ స్పందించారు. సినిమాలో దర్శకుడు చెప్పిన కథనం ప్రకారం మాత్రమే తాను ఆ సన్నివేశంలో నటించానని, అది కేవలం నటన మాత్రమేనని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొందరు ఫ్యాన్స్ అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా బయట కనిపిస్తే దాడి చేస్తామని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ మెసేజ్‌లు పంపుతున్నారని ఆయన తెలిపారు. అలాంటి కొన్ని అనుచిత కామెంట్లను డిలీట్ చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కేవలం ఒక నటుడిగా తన బాధ్యతను మాత్రమే నెరవేర్చానని ఆయన వివరణ ఇచ్చారు. ఈ ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సినీ అభిమానులు పాత్రలను, నటుల వ్యక్తిగత జీవితాలను వేర్వేరుగా చూడాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. కథకు అనుగుణంగా నటించే నటులపై ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద 99వ ప్రాజెక్ట్‌గా విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న చిత్రం ‘మకుటం’. స్వర్గీయ ఆర్.బి చౌదరి నిర్మాణంలో రాబోతోన్న ఈ మూవీలో అంజలి, దుషార విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.  ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన టీజర్, పాటలు అన్నీ కూడా అందరిలోనూ అంచనాలు పెంచేశాయి. మ్యూజికల్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న ఈ తరుణంలో మేకర్లు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాని ఆగస్ట్ 14న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించడమే కాకుండా.. ఆగస్ట్ 7న ట్రైలర్‌ను విడుదల చేస్తామని అప్డేట్ ఇచ్చారు. ఇప్పటికే విశాల్ ‘మకుటం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తుండటం.. పైగా దర్శకుడిగా మొదటి సినిమా అవ్వడం, జీవీ ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్ అందరినీ ఆకట్టుకోవడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ఇక ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్‌ని కూడా ప్రకటించడంతో ప్రమోషన్స్‌లో మరింత స్పీడ్ పెంచేలా కనిపిస్తున్నారు.     Vishal, Makutam Movie, Anjali, Dushara Vijayan  
మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలకు టాలీవుడ్‌లో ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవలోనే పూర్తిస్థాయి వినోదం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ 'హ్యాపీ జర్నీ'. ఏడుగురు మహిళల విదేశీ ప్రయాణం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నుంచి తాజాగా 'సీతాకోకలా...' అంటూ సాగే మధురమైన గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సరికొత్త లవ్లీ మెలోడీకి సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర అద్భుతమైన స్వరాలను సమకూర్చగా, ప్రముఖ గేయ రచయిత సురేష్ బానిసెట్టి ఎంతో అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద తన అమృతతుల్యమైన గాత్రంతో ఈ పాటను పాడి శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తున్నారు. ఆడవారి స్వేచ్ఛకు, వారి కలలకు ఎలాంటి హద్దులూ లేవనే సందేశాన్ని ఇస్తూ ఈ సాంగ్ సాగుతుంది. ఈ సినిమాలో పారిస్, మాంట్‌పెలియర్ వంటి యూరప్‌లోని అత్యంత సౌందర్యాత్మక ప్రాంతాలలో చిత్రీకరించిన విజువల్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణం నేపధ్యంలో సాగే కథ అయినప్పటికీ, ఇందులో చూపించే మనుషుల అనుబంధాలు, స్నేహం ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీలతో పాటు పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్ మరియు సునైనా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో అలరించనున్నారు. అంతేకాకుండా పృథ్వీ దండమూడి, వంశీ, రవి శివ తేజ పైల ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. ఈ చిత్రంతో అభిరామ్ నాయుడు దర్శకుడిగా పరిశ్రమకు పరిచయం అవుతుండగా, బాలాజీ గుత్తా, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్, టీజర్లకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన రెస్పాన్స్ లభించగా, ఇప్పుడు విడుదలైన 'సీతాకోకలా' సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సంగీతప్రియులు ఈ పాటలోని లిరిక్స్ మరియు యూరప్ విజువల్స్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం అన్ని రకాల పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
Makutam is the 99th film produced under the Super Good Films banner. The movie stars Vishal as the lead actor and also marks his debut as a director. It is produced under the banner founded by the late RB Choudary. Anjali and Dushara Vijayan play the female leads. The teaser and songs released so far have received a good response and increased excitement for the film. As the music promotions continue, the makers have shared a big update. They announced that Makutam will release in theatres on August 14, and the official trailer will be launched on August 7. The film has already created high expectations since Vishal appears in different looks, it is his first film as a director, and GV Prakash Kumar's music has impressed audiences. With the release date now confirmed, the promotions are expected to become even bigger. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
'బేబి' జోడి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. '90s' వెబ్ సిరీస్‌తో అందరి మనసులను గెలుచుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటుండగా, తాజాగా మేకర్స్ ఒక మైండ్ బ్లోయింగ్ పోస్టర్‌తో మూవీ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. 2026 సెప్టెంబర్ 11న ఈ సినిమా థియేటర్లలో అడుగు పెట్టబోతోంది. పోస్టర్‌లో బీచ్ ఒడ్డున ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఒకేలాంటి డెనిమ్ డ్రెస్‌లు ధరించి, తమ పెంపుడు కుక్కతో సముద్రపు అలల మధ్య నడుస్తూ ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది. 'బేబి' సినిమాలో ఆనంద్, వైష్ణవి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకులను ఏ స్థాయిలో కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో 'ఎపిక్'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. సెప్టెంబర్ 11న విడుదలవుతున్న ఈ మూవీ, బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.   Epic First Semester, Release Date, Anand Deverakonda, Vaishnavi Chaitanya, Aditya Hasan  
The blockbuster Baby pair - Anand Deverakonda and Vaishnavi Chaitanya - is set to reunite with EPIC – First Semester. The makers have officially announced that the romantic drama will hit theatres worldwide on September 11. The release date poster features the lead pair enjoying a peaceful walk on a beach with a pet dog, reflecting the film's youthful and feel-good vibe. The visuals continue the pleasant tone established by the teaser and songs. Written and directed by Aditya Haasan, EPIC is a unique extension of the blockbuster ETV Win series 90's – A Middle Class Biopic. Instead of revisiting the original family, the film follows the next chapter of fan-favourite character Rohan. Anand Deverakonda plays the grown-up Rohan, now pursuing his Master's degree in the US, while Vaishnavi Chaitanya stars opposite him in a fresh love story. Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, the film features music by Hesham Abdul Wahab. With a successful lead pair, an interesting continuation of a beloved character, and a September 11 release date locked, EPIC – First Semester has positioned itself as one of the notable youthful entertainers to watch out for this year. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Keerthy Suresh appears to be entering a crucial phase in her career. After enjoying immense success with films like Mahanati, the National Award-winning actress has struggled to maintain consistent box office momentum over the past few years. While her performances have continued to earn appreciation, several of her recent releases failed to make the desired impact, including her much-hyped Bollywood debut opposite Varun Dhawan, Baby John, which ended up as a major disappointment. Now, the actress seems to be putting together an interesting slate of projects that could redefine her career. Keerthy has already signed Anil Ravipudi's upcoming entertainer starring Venkatesh and Kalyan Ram, a commercial project that is expected to offer her a wider reach among Telugu audiences. Adding to the buzz, industry circles suggest she may be making a special appearance in a song from Nani and Srikanth Odela's The Paradise. While there's no official confirmation yet, the speculation has excited fans, especially since Keerthy previously shared screen space with Nani in Dasara, directed by Srikanth Odela. If the rumours turn out to be true, it would mark a reunion of the successful Dasara team. Meanwhile, filmmaker Karthik Subbaraj surprised everyone by announcing Keerthy as the leading lady of his upcoming film Dorothy, which is scheduled for release on 25th September. The project has generated curiosity as Karthik is collaborating with legendary composer Ilaiyaraaja, a combination that has already created excitement among cinephiles. The movie has been already selected officially for TIFF film festival, too.  Interestingly, most of these promising opportunities have come after Keerthy's marriage, giving rise to discussions that she could be on the verge of a fresh innings. With a commercial entertainer, a possible high-profile cameo and an author-backed role in Dorothy, the actress has assembled a line-up that looks far more promising than what she had in recent years. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు రాబోతుండటంతో ఆయన అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. గుంటూరు కారం చిత్రం తర్వాత ప్రిన్స్ వెండితెరపై కనిపించి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుండటంతో, తదుపరి భారీ ప్రాజెక్ట్ నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా ఆనందించేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అంతర్జాతీయ అడ్వెంచర్ డ్రామా 'వారణాసి'పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈసారి మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుని సినిమా నుంచి టీజర్ లేదా గ్లింప్స్ వీడియో విడుదలవుతుందని ఆశించిన అభిమానులకు కాస్త నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. ప్రాజెక్ట్ విషయంలో పర్‌ఫెక్షన్ కోరుకునే జక్కన్న, క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడరు. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ పోస్ట్ ప్రొడక్షన్ మరియు ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో చిత్రయూనిట్ అత్యంత బిజీగా ఉంది. ప్రత్యేకంగా ఒక వీడియో టీజర్‌ను కట్ చేయడానికి సమయం లేకపోవడంతో, చిత్రబృందం వీడియో కంటెంట్‌కు బదులుగా రెండు సరికొత్త పోస్టర్లతోనే బర్త్‌డే విషెస్ చెప్పాలని భావిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. గతంలో రాజమౌళి 'ఆర్‌ఆర్ఆర్' సినిమా సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ బర్త్‌డేలకు ప్రత్యేక టీజర్లు వదిలిన విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కానీ అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేస్తున్న 'వారణాసి' కోసం హడావిడిగా వీడియోలు విడుదల చేయడం రాజమౌళికి ఇష్టం లేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు థియేటర్లలో మహేష్ బర్త్‌డే సంబరాలు జరిపేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. గతంలో రీ-రిలీజ్ అయిన చిత్రాలతో పాటు ఈసారి సూపర్ హిట్ మూవీ 'దూకుడు' స్పెషల్ షోలతో సందడి చేయడానికి ఆల్ ఇండియా ఫ్యాన్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. 2027 ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ పాన్ వరల్డ్ విజువల్ వండర్ కోసం అభిమానులు ఎంతో ఓపికగా ఎదురుచూస్తున్నారు. వీడియో టీజర్ లేకపోయినా, రాజమౌళి అందించే ఆ రెండు స్పెషల్ పోస్టర్లు సోషల్ మీడియాను షేక్ చేయడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సహాయం.. మనిషికి ఉండాల్సిన మంచి గుణాలలో సహాయం చేయడం కూడా ఒకటి. ఆపదలో ఉన్నవారికి,  అవసరం లో ఉన్నవారికి,  ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయడం చాలామంచి లక్షణం.కానీ కొన్నిసార్లు, ఆలోచించకుండా చేసే సహాయం పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారని, అంతే కాకుండా కొందరు వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారని, తీవ్ర సమస్యలో చిక్కుకుంటారని చెబుతారు. అలాంటి మూడు రకాల వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దుర్మార్గులు, చెడ్డ గుణం కలిగిన స్త్రీ, పురుషులు.. చెడ్డ మనసు లేదా చెడు గుణం కలిగిన , కోపిష్టి స్వభావం ఉన్నవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేయడం అంటే మన కాళ్ళను  మనమే కాల్చుకోవడం లాంటిది. చెడ్డ   స్వభావం ఉన్నవారు ఎవరికీ స్నేహితులు కారు.  వారికి ఎంత దయ చూపినా,  అవకాశం దొరకగానే తిరిగి హాని చేయడానికి  వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం  వల్ల సామాజిక హోదా , ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ విషయాలకు అయినా దూరంగా ఉండాలి. ఎప్పుడూ విచారంగా ఉండేవారు.. ఈ ప్రపంచంలో కొందరు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ, వారు తమ విధిని, పరిస్థితులను ఎప్పుడూ  నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటి నెది నెగిటివ్  మనస్తత్వం ఉన్నవారికి సహాయం చేయడం మానుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరు.  అలాంటి  వారికి సహాయం చేస్తే, వారి ప్రతికూల శక్తి  జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారికి సహాయం చేసేవారు కూడా మానసిక ఒత్తిడికి గురై  సంతోషాన్ని కోల్పోతారు. మూర్ఖుడు.. మూర్ఖుడికి , బుద్ధిహీనుడికి ఏదైనా చెప్పడం,  మూర్ఖుడికి సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం అత్యంత మూర్ఖపు పనిగా చెబుతారు. తమ మంచి చెడులను తాము తెలుసుకోలేని వ్యక్తికి ఏదైనా వివరించడం పూర్తిగా సమయం వృధా చేసినట్టే. అలాంటి   సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా  చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సహాయం అందించే వ్యక్తిని తమ శత్రువుగా భావిస్తారు. వారితో వాదించడం లేదా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల  మనశ్శాంతిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. సహాయం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. ఇతరులకు సహాయం చేయడం అంటే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం కాదు. సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ, ,తెలివిని  ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సహాయం చేసే ముందు, వారి ఉద్దేశాలను, ప్రవర్తనను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి మీ సహాయం చేసే గుణాన్ని  దుర్వినియోగం చేయవచ్చని మీకు అనుమానం వస్తే, వెంటనే వెనక్కి తగ్గడం మంచిది. మీ దయా గుణాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేలా మీ హద్దులను మీరే ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. సరైన వ్యక్తికి సహాయం చేయడం సరైన వ్యక్తి సహాయం చేయడం చాలా మంచిది. మీరు అవసరంలో ఉన్న, నిజాయితీపరుడైన, నిష్కపటమైన వ్యక్తికి సహాయం చేసినప్పుడు,  తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. సరైన వ్యక్తికి సహాయం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది , సమాజంలో  గౌరవాన్ని పెంచుతుంది. మన సహాయ గుణాన్ని సరైన చోట ఉపయోగించాలని చాణక్య నీతి  బోధిస్తుంది. మీరు మీ శక్తిని, ధనాన్ని సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువల్ల, ఎల్లప్పుడూ  మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి.                                    *రూపశ్రీ.  
 తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి..!++ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు, తల్లిదండ్రులకు తెలియకుండానే వారి కొన్ని అలవాట్లు, వారి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కోరుకోరు.. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది,  వారు తమ పరిసరాల నుండి త్వరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఏమైనా మాట్లాడితే అది వారి భవిష్యత్తును చాలా గందరగోళంగా మారుస్తుంది.  చిన్నతనంలో పిల్లలకు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తేనే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. తాము కూడా తెలియకుండానే తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. పిల్లల తప్పుకు పోల్చి తిట్టడం.. చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లల తప్పుకు కోపం తెచ్చుకుని, వారిని ఇతర పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు.  ఇలా పోల్చడం ఎప్పుడైతై  మొదలవుతుందో అప్పుడు పిల్లలు ఇతరులను చూపించి, వారితో పోల్చి తిడతారు కూడా.  మార్కుల విషయంలో కావచ్చు,  తెలివి తేటల విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు,  చురుగ్గా ఉండే విషయంలో కావచ్చు..  ఇలా  ప్రతిదానికి తల్లిదండ్రులు పిల్లలను పోల్చి మాట్లాడితే..  పిల్లలు చాలా బాధపడతారు, తమను తాము పనికిరానివారిగా భావిస్తారు. ఇక్కడే వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. తిట్టడం.. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను తప్పులు చేసినందుకు కఠినంగా తిడతారు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినది.. వారు పిల్లలని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని, అలాంటప్పుడు  తరచుగా తప్పులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి.   పిల్లలను తప్పులకు పదేపదే తిడితే, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి భయపడతారు. తప్పు చేయడం చెడ్డ విషయమని, మళ్ళీ తిట్లు పడతాయని భావించి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, లేదా ప్రయత్నించడానికి కూడా భయపడి ప్రయత్నాలు మానేస్తారు. ఎమోషన్స్ ను లైట్ తీసుకోవడం.. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.  వారు భయపడినప్పుడు, బాధపడినప్పుడు లేదా కలత చెందినప్పుడు,  "ఇంత చిన్న విషయానికి ఏడవకు"  అనడం లేదా "ఇది పెద్ద విషయమేమీ కాదు" అని తోసిపుచ్చేయడం.. వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు.  దీనివల్ల  తమ భావాలకు విలువ లేదని  పిల్లలు భావిస్తారు. దీనివల్ల, తమను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో వారు తమ భావాలను, ఆలోచనలను దాచుకుంటారు. ఇది వారి నమ్మకాన్ని బలహీనపరుస్తుంది, దాని ప్రభావం వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా పడుతుంది ఓవర్ ప్రొటెక్షన్,  హెల్పింగ్.. చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు సహాయం చేసే నెపంతో, వారి స్కూల్ బ్యాగులు సర్దడం, పిల్లల ఇష్టాలతో పని లేకుండా  తామే బట్టలు షాపింగ్ చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రతి పనిని తామే చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ పనులు తాము చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. పిల్లలు ఏదైనా పనిని  తామే చేసినప్పుడు వారికి తమ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ తల్లిదండ్రులే చేస్తుంటే పిల్లలకు వారి సామర్థ్యం గురించి తెలియదు.  క్రమంగా, వారు చిన్న చిన్న విషయాలకు కూడా తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు తక్కువ చేసి మాట్లాడటం.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిడతారు లేదా బంధువులు, స్నేహితులు లేదా అతిథుల ముందు వారి బలహీనతలను  బయటపెడతారు. దీనివల్ల పిల్లలు చాలా షేమ్ గా ఫీలవుతారు. తమను తాము తక్కువగా భావించుకుంటారు. పదేపదే అందరి ముందు  అవమానపడటం వల్ల,  అందరి ముందు ఓపెన్ మాట్లాడటానికి , ఏదైనా చెప్పడానికి భయపడతారు. అది వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అభిరుచులు రుద్దడం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు విషయంలో గానీ, అభిరుచుల విషయంలో గానీ తమకు నచ్చినది చేయాలని కోరుకుంటారు. పిల్లల సొంత ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను  పట్టించుకోరు. పిల్లలకు తమకు నచ్చింది ఎంచుకోవడం,  నచ్చిన పని చేయడం వంటి అవకాశాలు లేనప్పుడు తమ నిర్ణయాలకు విలువ లేదని పిల్లలు భావిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయడానికి  దారితీస్తుంది.                                *రూపశ్రీ  
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
మన శరీరం అనేది ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుతమైన జీవ వ్యవస్థ. మనకు కనిపించని స్థాయిలో శరీరంలో సుమారు 36 లక్షల కోట్ల కణాలు (36 Trillion Cells) ప్రతి క్షణం పనిచేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఈ కణాలన్నీ సమన్వయంతో పనిచేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. కానీ ఒక్క కణం పనితీరులో లోపం వచ్చినా, అది క్రమంగా ఇతర కణాలపై ప్రభావం చూపి వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే నిజంగానే "ఉన్నది ఒకటే జబ్బు... అది సెల్ అనారోగ్యం" అనే భావన వెనుక శాస్త్రీయ కారణం ఏమిటి? ప్రతి వ్యాధి కణాల స్థాయిలోనే మొదలవుతుందా? కణాలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏమి చేయాలి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానాలు లభిస్తాయి. ఈ వీడియోలో Cell Health Clinics Founder డా. రవి కుమార్ చింత సెల్ హెల్త్ (Cell Health) యొక్క ప్రాముఖ్యతను సులభమైన ఉదాహరణలతో వివరిస్తున్నారు. మన ఆహారం, నిద్ర, వ్యాయామం, మానసిక ఒత్తిడి, కాలుష్యం, జీవనశైలి వంటి అంశాలు కణాల పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో ఆయన వివరించారు. అంతేకాదు, చాలా మంది ఎదుర్కొనే మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, హార్మోన్ల అసమతుల్యత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యల వెనుక కణాల ఆరోగ్యం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో కూడా ఈ చర్చలో తెలుసుకోవచ్చు. ఆరోగ్యంగా జీవించాలంటే కేవలం వ్యాధి వచ్చిన తర్వాత మందులు వాడటం సరిపోదని, కణాల స్థాయిలో శరీరాన్ని బలపరిచే జీవనశైలిని అలవర్చుకోవడం అవసరమని డా. రవి కుమార్ చింత సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. మీ శరీరాన్ని లోపల నుంచి ఆరోగ్యంగా ఉంచే సెల్ హెల్త్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు బలపడటమే కాకుండా, గుండె పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయి. రోజూ అలసట, ఒత్తిడి, ఆందోళన, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి భస్త్రిక ప్రాణాయామం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లోతుగా, వేగంగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపడి శక్తి పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సహజంగా బయటకు పంపే శరీర ప్రక్రియలకు కూడా ఇది తోడ్పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్ స్రవంతి రఘు భస్త్రిక ప్రాణాయామాన్ని సరైన విధంగా ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనే అంశాలను సులభంగా వివరించారు. మీ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసి, నిపుణుల సూచనల ప్రకారం భస్త్రిక ప్రాణాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా కొత్త యోగా సాధన ప్రారంభించే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం.  ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డా. పూర్ణిమ నాగరాజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లల్లో నమ్మకాన్ని ఎలా పెంచాలి, వారు ఏ పరిస్థితిలోనైనా తమ మనసులోని మాటను చెప్పేలా ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, విమర్శించకుండా స్పందించడం, భయపెట్టకుండా మార్గనిర్దేశం చేయడం, కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడం వంటి ముఖ్యమైన పేరెంటింగ్ సూచనలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)