రేవంత్ రెడ్డి రూటు మార్చకుంటే కష్టమేనా?

Publish Date:Feb 4, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.అంశం ఏదైనా మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌లు జరగనున్నాయా అన్నట్లుగా అధికార‌, విప‌క్ష పార్టీల నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ఏం జ‌రుగుతోంద‌న్న చ‌ర్చ ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ట్విట‌ర్ ఖాతాలో పోల్ వ్య‌వ‌హారం, ఎమ్మెల్యేల ర‌హ‌స్య మీటింగ్, సీఎంకు తెలియ‌కుండానే కులగ‌ణ‌న వివ‌రాలను మీడియాకు లీకవ్వడం, మ‌ధ్య మ‌ధ్య‌లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా పార్టీ సీనియ‌ర్ నేత‌ల వ్యాఖ్య‌లు.. ఇలా..  రేవంత్ ప్ర‌భుత్వంలో ఏదో జ‌రుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. 

వాస్త‌వానికి.. రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటినుంచి క్యాబినెట్ లోని సీనియ‌ర్ మంత్రుల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇస్తున్నారు. ఎవ‌రినీ నొప్పించ‌కుండా అంద‌రినీ క‌లుపుకొనిపోతూ ప్ర‌భుత్వాన్ని న‌డుపుతున్నారు. వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా సీనియ‌ర్ మంత్రుల‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయినా.. ప్ర‌భుత్వంలో కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ తీరు ప‌ట్ల కాస్త అసంతృప్తితో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనంత‌టికీ రేవంత్ రెడ్డి అతి మంచిత‌న‌మే కార‌ణ‌మ‌న్న‌ వాద‌న పార్టీ వర్గాల నుంచే వినవస్తోంది.  సీఎం హోదాలో రేవంత్ రెడ్డి.. కొంద‌రు మంత్రుల‌కు అతి మ‌ర్యాద ఇస్తుండ‌టంతో దాన్ని వారు అలుసుగా తీసుకొని ప్ర‌భుత్వంలో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నార‌న్న వాద‌నను కాంగ్రెస్ లోని ఓ వ‌ర్గం నేత‌లు వినిపిస్తున్నారు. 

రేవంత్ రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌జ‌ల‌కు మేలుచేసేలా కృషి చేస్తున్నారు. ప్ర‌భుత్వం లోటు బ‌డ్జెట్‌లో ఉన్నా.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ వ‌స్తున్నారు. అయితే, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో పార్టీ క్యాడ‌ర్   విఫ‌ల‌మ‌వుతోంది. రైతు రుణ‌మాఫీకి స‌రైన ప్ర‌చారం క‌ల్పించ‌క‌పోవ‌టంతో ప్ర‌భుత్వంపై విప‌క్ష పార్టీల నేత‌లకు విమర్శలు చేసే అవకాశం చిక్కిందని అంటున్నారు.  ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నాలుగు కొత్త ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ ప‌థ‌కాల అమ‌లుపైనా.. ఎవ‌రికి ల‌బ్ధిచేకూరుతుంద‌నే విష‌యాల‌పైన స్ప‌ష్టంగా గ్రామ‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌డంలో మంత్రులు, ఎమ్మెల్యేలు విఫ‌ల‌మ‌య్యార‌న్న వాద‌న ఉంది. దీనికి తోడు ప్ర‌భుత్వంలో మంత్రుల మ‌ధ్య స‌ఖ్య‌త‌ లేద‌ని.. కొంద‌రు మంత్రులు రేవంత్ కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు రోజురోజుకు తీవ్ర‌మ‌వుతున్నాయి. 

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ స‌ర్కార్‌కు ఇటీవ‌ల వ‌రుస‌గా దెబ్బ‌ మీద దెబ్బ‌  త‌గులుతోంది.   వారం రోజుల కిందట మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ స‌ర్కార్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల త‌రువాత నుంచి ఫాంహౌస్ కే ప‌రిమితం అయిన కేసీఆర్ ఒక్క‌సారిగా  అదే ఫామ్ హౌస్ నుంచి సమర గ‌ర్జ‌న చేశారు. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం తన అలవాటు అని చెబుతూనే.. రేవంత్ స‌ర్కార్ కు ఇక ద‌బిడిదిబిడే అంటూ వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల త‌రువాత‌ ప‌ది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ర‌హ‌స్యంగా భేటీ కావ‌టం తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పాల‌మూరు జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యే త‌న ఫాంహౌస్ లో ప‌ది మంది ఎమ్మెల్యేల‌కు విందు ఇచ్చారు. ఈ విందు భేటీలో వారి ఇబ్బందుల‌ను ఒక‌రికొక‌రు చెప్పుకున్న‌ట్లు స‌మాచారం. కొంద‌రు మంత్రులు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌టం లేదని,  ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు స‌రియైన స‌హ‌కారం అంద‌డం లేద‌నీ ఈ భేటీలో వారు చర్చించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అయితే  ఈ రహస్య విందు భేటీ వెనుక కేసీఆర్ హ‌స్తం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ట్విట‌ర్ ఖాతాలో పెట్టిన పోల్‌కు ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఫామ్‌హౌస్ పాల‌న కావాలా.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న‌ కావాలా..? అంటూ పోల్ పెట్ట‌గా.. ఫామ్ హౌస్ పాల‌నే కావాలంటూ అధిక శాతం మంది  ఓటు వేశారు. ఈ ప‌రిణామం కాంగ్రెస్ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో అస‌లు పార్టీలో ఏం జ‌రుగుతోంది అనే చ‌ర్చ‌కు దారితీసింది.

కులగ‌ణ‌న వివ‌రాల విష‌యంలో కొంద‌రు మంత్రులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌డంతో కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌రంగా మారింది. కుల గణన నివేదికపై తెలంగాణ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముందుగా క్యాబినెట్ సమావేశం నిర్వహించి అందులో ఈ నివేదికను ఆమోదించాలని భావించారు. అయితే ప్రభుత్వ ఆలోచనకు భిన్నంగా కొందరు అధికారులు, మంత్రులు ఆ నివేదికను ముందుగానే మీడియాకు లీక్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంలో సమన్వయం లేదని ప్రజలు భావించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. మ‌రో వైపు కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ప్ర‌భుత్వ ప‌థ‌కాల విష‌యంలో అన‌వ‌స‌ర‌పు వ్యాఖ్య‌లు చేస్తుండ‌టం కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి త‌ల‌నొప్పిగా మారింది. 

కాంగ్రెస్ నేత‌ జ‌గ్గారెడ్డి ఇటీవల మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పేరు మ‌ర్చిపోవ‌టంపైనా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. జ‌గ్గారెడ్డి కావాల‌నే రేవంత్ పేరు మ‌ర్చిపోయారా అన్న అనుమానాల‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లే వ్య‌క్తం చేస్తున్నారు. చూసేందుకు అది చిన్న‌విష‌య‌మే అయినా, సీఎం రేవంత్ ప‌ట్ల కాంగ్రెస్ నేత‌ల్లోనే తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌న్న భావ‌న ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతుంద‌ని, త‌ద్వారా ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్లుతుంద‌న్న ఆందోళన పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టి ప్ర‌భుత్వాన్ని సీరియ‌స్ గా న‌డిపించాలంటే రేవంత్ రెడ్డి  రూటు మార్చాల‌న్న వాద‌న‌ను కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు గట్టిగా వినిపిస్తున్నారు.   వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌ర‌హార‌లో   లైన్ దాటిని వారిపై కొర‌డాఝుళిపించాల‌న్న డిమాండ్ కాంగ్రెస్ నేతల నుంచి గట్టిగా వినిపిస్తోంది. 

By
en-us Political News

  
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఊరట
రాష్ట్రంలో బీఆర్ఎస్‌ రెండుసార్లు, కాంగ్రెస్‌ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.