Publish Date:Dec 11, 2024
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈసారి ఆయన కుటుంబ సమేతంగా హస్తినకు వెళ్లారు. రేవంత్ తొలుత ఢిల్లీకి వెళ్లారు. అక్కడ్నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లనున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఎం రేవంత్ రెడ్డి.. జైపూర్ లో ఉండనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి . కాగా.. బుధవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి పయనం అయ్యారు. అక్కడి నుంచి జైపూర్‌కు వెళ్లనున్నారు. జైపూర్‌లో తమ బంధువుల వివాహ వేడుక ఉండగా.. దానికి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. జైపూర్‌లో వివాహ కార్యక్రమానంతరం.. రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి చేరుకోనున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంత వరకు మంత్రి పదవి చోటు దక్కించుకోని వారికి కేబినెట్ లో చోటు లభించనుంది. ఈ మూడు రోజుల పర్యటనలో భాగంగానే.. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నేతలతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉండటంతో.. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్‌మున్షీ కూడా ఢిల్లీలో అందుబాటులో ఉండన్నట్టు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-reddy-left-fordelhi-with-his-family-25-189711.html
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.