Publish Date:Nov 27, 2021
తెలంగాణ కాంగ్రెస్ లో అంతా సెట్ రైట్ అయిందా? సీనియర్లంతా ఒక్కటైపోయారా? కలిసికట్టుగా పోరాడుతూ కేసీఆర్ కు చుక్కలు చూపించబోతున్నారా? అంటే కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలకో గాంధీభవన్ లో ఖుషీ వాతావరణం కనిపిస్తుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఎడమొఖం పెడ మొఖంగా ఉన్న నేతలంతా కలిసిపోయారు. ఇందుకు పీసీసీ చేపట్టిన వరి దీక్ష వేదికైంది. కొంత కాలంగా భిన్న దృవాలుగా ఉన్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు కలుసుకోవడం చర్చగా మ మారింది. కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం నింపింది.
వరి దీక్ష వేదికగా కలిసిపోయిన ఆ ఇద్దరు నేతలో ఎవరో కాదు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉన్న వీరు ఇప్పుడు కలిసిపోయారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కార్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ధర్నాచౌక్‌లో రెండు రోజుల‘వరి దీక్ష’ చేపట్టింది. ఈ దీక్షకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా దాదాపు కలిసి వచ్చారు. అయితే. ఈ దీక్షలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇప్పటి వరకూ ఒకరంటే ఒకరికి పడని.. ఒక్కసారీ మాట్లాడుకోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పక్కపక్కనే కూర్చున్నారు. అంతేకాదు.. ఒకరినొకరు పరస్పరం పలకరించుకున్నారు... కలిసి అభివాదం కూడా చేశారు. ఈ ఇద్దరి కలయికతో అటు రేవంత్, కోమటిరెడ్డి అభిమానుల్లో.. కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చినట్లయ్యింది.ఈ సన్నివేశం చూసిన జనాలు, కాంగ్రెస్ అధిష్టానం సైతం ఒకింత ఆశ్చర్యపోయింది.
టీపీసీసీ చీఫ్ కోసం విశ్వప్రయత్నాలు చేసిన కోమటిరెడ్డి.. ఆ బాధ్యతలు రేవంత్ రెడ్డికి అప్పగించాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాదు రేవంత్ రెడ్డి టార్గెట్ గా వరుస ప్రకటనలు చేసి కాక రాజేశారు. పీసీసీ పదవిని అమ్ముకున్నారంటూ పార్టీ ఇంచార్జీనే టార్గెట్ చేశారు. తర్వాత కూడా సమయం వచ్చినప్పుడల్లా రేవంత్ లక్ష్యంగా కామెంట్లు చేశారు కోమటిరెడ్డి. హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీకి డిపాజిట్ రాకపోవడంతో.. అందుకు పీసీసీ చీఫ్ కారణమనే అర్ధం వచ్చేలా మాట్లాడారు. అయితే వాళ్లిద్దరి మధ్య సయోధ్య కోసం సీనియర్ నేత వీ హనుమంతరావు చేసిన ప్రయత్నాలు ఫలించాయని అంటున్నారు.
కొన్ని రోజుల క్రితం సీఎల్పీలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశమయ్యారు వీహెచ్. తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితోనూ చర్చించారు. ఈ ఇద్దరికీ సర్దిచెప్పి.. ఒకే తాటిపైకి తీసుకురావడానికి సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఒకట్రెండు సందర్భాల్లో వీహెచ్ ఫెయిల్ అయినప్పటికీ.. వరి దీక్షతో కోమటిరెడ్డి-రేవంత్ రెడ్డి ఇద్దరూ ఒక్కటయ్యారు. దీంతో వీహెచ్ మంత్రాంగం ఫలించినట్లయ్యింది. అయితే ఇద్దరూ కలిసిపోయినట్టేనా..? లేకుంటే దీక్ష ముగిసే వరకు మాత్రమే ఇలా కలిసుంటారా..? అన్నదానిపై పార్టీ నేతలెవరు క్లారిటీ ఇవ్వడం లేదు. అయితే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి కలిసి దీక్షలో కూర్చున్న విజువల్స్ మాత్రం కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తెగ వైరల్ చేస్తోంది. ఆ ఇద్దరూ కలిసిపోయారు.. ఇక కాస్కో కేసీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ నేతలంతా కలిసి పనిచేస్తే గులాబీ పార్టీకి చెమటలు పట్టడం ఖాయమనే చర్చ గాంధీభవన్ తో పాటు కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-reddy-komati-reddy-venkat-reddy-dharna-at-indira-park-for-paddy-crop-39-127243.html
Publish Date:May 10, 2026
సాధారణంగా శుభకార్యాలకు నవమిని రిక్త తిథిగా పరిగణిస్తారు. రాముడు పుట్టింది నవమి రోజే కదా? అని కొందరు సమర్థించినా, రాజ్యాధికారానికి నవమి అంత మంచి తిథి కాదు. నవమి రోజు ప్రారంభించే పనుల్లో తరచూ ఆటంకాలు లేదా మధ్యలో విరామాలు వచ్చే అవకాశం ఉంటుందంటారు. ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి, భాగస్వామ్య పక్షాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి వెలువడే ప్రమాదం ఉంది.
గత కొద్ది రోజులుగా తమిళ రాజకీయాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఆరు రోజుల పాటు ఎడతెగకుండా సాగిన రాజకీయ ఉత్కంఠకు ముగింపు పలుకుతూ, మెజారిటీ పార్టీల అండతో విజయ్ పీఠాన్ని అధిష్టించబోతున్నారు.
హైదరాబాద్ లోని పెట్రోలియం శాఖకు చెందిన మల్కాపూర్ టెర్మినల్ ప్రాజెక్టును ప్రధాని మోడీ ఆదివారం ( మే 10) జాతికి అంకితం చేయనున్నారు. ఈ టూర్ కు గవర్నర్ శివప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సురేష్ గోపి, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారికి ఆహ్వానం అందింది. అయితే ఈ ఆహ్వాన పత్రికలో బండి సంజయ్ పేరు మాత్రం లేదు.
ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం సాయంత్రం 4:40 గంటల సమయంలో జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్తారు. అక్కడ ఇరువురు నేతలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. అన్నిటికీ మించి ప్రధాని చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ కావడం ఎన్డీయే కూటమి ఐక్యతను చాటడంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.