Publish Date:Mar 18, 2023
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస పాలనకు మరో యువకుడు బలయ్యాడని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లకు చెందిన నవీన్ అనే యువకుడు గత కొంత కాలంగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కాగా ఇటీవల TSPSC పేపర్ లీక్ కారణంగా పలు పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే.
అలాగే గ్రూప్-1 పరీక్షను రద్దు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన నవీన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని రేవంత్ తన ఇన్స్టా లో పేర్కొన్నారు. కేసీఆర్‌పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/revanth-demand-to-bool-case-on-cm-kcr-25-152657.html
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.