Publish Date:Mar 17, 2023
భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామంటూ మురిసి పోతున్న ఏపీ సీఎం జగన్ మునిసిపల్ ఉద్యోగాల వేతనాల పెంపు గురించి ఎందుకు పట్టించుకోరని కార్మికులు నిలదీస్తున్నారు. విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో మునిసిపల్ కర్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ నేతలు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ పై ముఖ్యమంత్రి మాట తప్పి మడమ తిప్పారని ఆరోపించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంక్షేమ పథకాలు తొలగించారని విమర్శించారు. భారీ అంకెలతో బడ్జెట్ ప్రవేశ పెట్టి మునిసిపల్ కార్మికుల వేతనాల పెంపునకు సొమ్ము లేదనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
సమానపనికి సమాన వేతనం అంటూ కోర్టు తీర్పులు ఇచ్చినా కాంట్రాక్ట్ కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ నామమాత్రపు వేతనాలిస్తున్నారని ఆరోపించారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కార్మికుల రెగ్యులరైజేషన్ పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/municipal-workers-dharna-in-vijayawada-25-152651.html
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు
మియాపూర్ మెడికో సృజన హత్య కేసులో పోలీసుల దర్యాప్తు కొద్దికొద్దిగా కొలిక్కి వస్తోంది.
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్, హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
దేశ రక్షణ రంగంలో అత్యంత కలకలం రేపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
సినిమా తరహాలో పక్కా ప్లాన్ వేశాడు.. పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకవని భావించాడు.. కానీ చివరకు చేసిన చిన్న పొరపాటే అతడిని పోలీసులకు పట్టించింది.