కాంగ్రెస్ గెలుపుపై రేవంత్ ధీమా ...సీనియర్ల సందేహం

Publish Date:Jul 12, 2022

Advertisement

నో డౌట్, అనుమానం లేదు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ,గట్టి పట్టున్న నాయకుడు.  అయిపొయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని బతికించారు. జీవం పోశారు. అంతవరకు ఓకే, కానీ, అంత మాత్రం చేతనే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసిందని, వచ్చేస్తోందని అనుకుంటే, పొరపాటే అవుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

విశ్వాసం మంచిదే కానే, అతి విశ్వాసం అనర్ధదాయకం. అది అహంకారానికి డారి తీస్తుంది. ఇప్పటికే, రేవంత్’ రెడ్డిలో అహంకార ధోరణి కొంచెం చాల ఎక్కువగా ఉందని పార్టీ వర్గాల్లో ఒక  అభిప్రాయం బలంగా ఉందని అంటారు. ఇటీవల ‘రెడ్లే ది బెస్ట్’ అన్ని పార్టీలు పార్టీ పగ్గాలు రెడ్లకే అప్పగించాలని  రేవంత్ చసిన ప్రకటన  ఆయన అహంకార ధోరణికి నిదర్శనంగా పార్టీ వర్గాల్లో, ఈరోజుకూ చర్చ జరుగుతోందని అంటున్నారు. ఈ అహంకార ధోరణిని అదుపు చేసుకోవాలని అంటున్నారు. 

ముఖ్యంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతున్న నేపధ్యంలో, అహంకారం ఆవేశం తగ్గుంచుకుని ఆలోచన పెంచుకోవడం అవసరం. 1979 సీనియర్ నాయకులు లేకుండానే,కాంగ్రెస్ అధికారంలోకి వచ్చంది, కాబట్టి ఇప్పుడూ వస్తుందని అనుకోవడం, ప్రతి పదేళ్ళకు ఒక సారి అధికారం మారుతోంది కాబట్టి, ఆ సర్కిల్’ ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆశించడంసరి కాదని అంటున్నారు. అది కుడా ఎవరో అంటున్న మాట కాదు, కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తున్న ఇన్సైడ్’ టాక్.  
రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయింది.

ఈ సంవత్సర కాలంలో, పార్టీలో కొంత ఉపు వచ్చింది. అంతకు ముందుకంటే కొంత జోష్’ పెరిగింది. జనంలోకి వెళ్ళే విధంగా   కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విభిన్న వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా సమస్యల ఆదరంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నారు. వరంగల్ ‘లో రైతు భరోసా యాత్ర పేరిట, భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్  గాంధీ వచ్చారు. వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులకు హంమీలు ఇచ్చారు. 
అయితే,ఇల్లు అలకగానే పండగ కాదు. పండగ రాదు. అలాగే, కార్యక్రమాలకు జనం వచ్చినంత మాత్రాన అలా వచ్చిన జనం అంతా ఓట్లేస్తారని అనుకో లేము. హమీలు బాగున్నాయనీ ఓట్లు వేయరు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్, ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.6000 ల వంతున్న సంవత్సరానికి రూ.72 వేల రూపాయలు లబ్దిదారుల ఖాతాల్లో వేస్తమాని హంమీ ఇచ్చారు. ఇంకా చాలా హమీలిచ్చారు.

అయినా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ సీట్ల లెక్క కనీసం మూడంకెల సఖ్యను  చేరుకోలేదు. అంతకు ముందు (2014) సఖ్యకంటే కేవలం ఐదారు సీట్లు మాత్రమే అదనంగా లభించాయి. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.అలాగే, అస్సాం, ఉత్తరాఖండ్, అంతకు ముందు కేరళ రాష్ట్రాలలో వంతుల వారీ అధికార మార్పిడి ఆనవాయితికి గండి పడింది. కాంగ్రెస్ ఖాయంగా అధికారంలోకి రావలసిన రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రాలేక పోయింది. సూ .. ఉమ్మి ఆంద్ర రాష్ట్రంలో పదేల్లకోమారు అధికారం మారింది కాబట్టి ఇప్పడు కూడా అధికారం చేతులు మారి, కాంగ్రెస్ ఒళ్ళో వలుతుందని అనుకోవడం, కడుపుతో ఉన్నమ్మ కనక మానదు  అన్నట ధీమాను పెంచుకోవడం అంత మంచిది కాదని, పార్టీ సేనియర్ నాయకులే హెచ్చరిస్తున్నారు.   

అలాగే, పార్టీ సభ్యత్వం పార్టీ ఎదుగుదలకు ఒక కొలమానం, ఒక ప్రామాణికమ అవుతుందే కానీ, అదే గెలుపుకు అదే మూలాధారం మాత్రం కాదు. కాలేదు. అయితే రేవంత్ రెడ్డి, ‘విన్నింగ్ ఎలక్షన్స్ మేడ్ ఈజీ’ అన్నట్లుగా, 45 లక్షల సభ్యత్వం చేశాం కాబట్టి, 45 లక్షలు ఇంటూ రెండు .. 90 లక్షల ఓట్లు.. సో .. గెలుపు హస్తం పార్టీదే ... అరా చేతిలో లెక్కలు కడుతున్నారు. ఇలాంటి ఆలోచనలు, నిజమనిపించే కలలు ఆ కాసేపు బాగుందవచ్చును కానీ, కళ్ళు తెరిచి ఆలోచిస్తే మాత్రం, రాహుల్ గాంధీ  ఆలూ ... సోనా (ఇటునుంచి ఆలూ  పెడితే అటు నుంచి  బంగారం వస్తుంది) వంటి కామెడీ కామెంట్’లా కొంచెం చాలా నవ్వు తెప్పించేలా ఉందని గాంధీ భవన్’లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 

ఎన్నికలలో గెలవడం అంత ఈజీ అయితే, కాంగ్రెస్ వరస పెట్టి ఒక్కొక రాష్ట్రంలో ఎందుకు ఓడి పోతోంది. ఇన్నిన్ని  కార్యక్రమాలు, కస్టాలు ఎందుకు, ప్రెస్ మీట్’లు, గొంతు చించుకోవడాలు, గోడలేసి కొట్టటాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా, రేవంత్ రెడ్డి  సర్వేలు చూసి మురిసిపోవడం, మరీ మరీ విడ్డూరంగా  ఉందని, కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. 

నిజానికి, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోగొట్టుకుందో అక్కడ వెతుక్కోవడం మానేసి, ఆకాశానికి నిచ్చెనలు వేయడం వలన ప్రయోజనం ఉండదని, రేవంత్ వెంట ఉన్న నాయకులే అంటున్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య అంతర్గత కుమ్ములాటలు. రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు చేపట్టి సంవత్సరం పూర్తయింది. అయినా, ఈ రోజుకూ మూడొంతుల మంది సీనియర్ నాయకులు, అయన నాయకత్వాన్ని అంగీకరించడం లేదు.అలాగే, విశ్వసనీయత. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, ఎమ్మెల్యేలు  తెరాసకు అమ్ముడు పోతున్నారు, గత ఎన్నికలో 18ని గెలిపిస్తే మిగిలింది ఆరుగుఋ మాత్రమే.. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వసం కోల్పోయిందని అంటున్నారు. అందుకే, రేవంత్ రెడ్డి, అసలు సమస్యలు వదిలేసి, తమ ఇమేజ్’ని పెంచుకునే ప్రయత్నం చేస్తే, ఆయన మరో సిద్దూ అవుతారని  అంటున్నారు.

By
en-us Political News

  
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.