500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల..!

Publish Date:Jul 28, 2026

Advertisement

 

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లోని మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) మంగళవారం విడుదల చేసింది. 

డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ పరిధిలోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరతను అధిగమించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు సంబంధించిన 692 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియామక పత్రాలు అందజేయగా, అధికారులు ఇటీవలే వారికి పోస్టింగ్స్ కూడా ఇచ్చారు.

తాజాగా జనరల్ సర్జరీ – 174, జనరల్ మెడిసిన్ – 166, ఆర్థోపెడిక్స్ – 89, రేడియాలజీ – 71 చొప్పున మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను ఎంహెచ్‌ఆర్‌బీ విడుదల చేసింది. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల అనంతరం అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి, తుది ఫలితాలను ప్రకటించింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు. 

ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో నూతనంగా ఎంపికైన స్పెషలిస్ట్ డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత లేకుండా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, 24 విభాగాల్లో 1,616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. నేటితో 1192 పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులను మంత్రి ఆదేశించారు.

Results for 500 specialist doctor posts released, MHSRB, Telangana Medical Policy Council, Minister Damodar Rajanarsimha, CM Revanth reddy

By
en-us Political News

  
తాజాగా బాధితురాలి మెడపై గొంతు నులిమినట్లు గాయాల ఆనవాళ్లు..!
రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం మరింత పెరగాలని....అనుకున్న సమయానికి ప్రతి ప్రాజెక్టు పూర్తి కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
సోమేశ్ కుమార్‌పై 400 కంటెంప్ట్ కేసులప్పుడు బీఆర్‌ఎస్ మౌనం ఎందుకు..!
స్పందించని నాడీ వ్యవస్థ.. ఆరోగ్యం విషమం..!
హైదరాబాద్‌లోని గచ్చి బౌలి ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సజ్జనార్ విజ్ఞప్తి..!
ఖనిజాల నిధిగా పిలిచే మన నేల పొట్టలో అపారమైన ప్రాకృతిక సంపద దాగి ఉంది.
హైడ్రా కమిషనర్ నియామకానికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
దేశంలో కరెన్సీ వ్యవస్థను మరింత ఆధునికీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భార్య ప్రాణాలు పోతుంటే వీడియో కాల్‌లో చూపించిన కసాయి భర్త..!
తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని వినతి..!
జింబాబ్వేపై 3-0తో సాధించిన క్లీన్ స్వీప్ భారత క్రికెట్ అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ లాంటి డెబ్యూటెంట్లలో కాన్ఫిడెన్స్ నింపి, వారి నుంచి అద్భుత ప్రదర్శన రాబట్టిన వెరీ వెరీ స్పెషల్ వీవీవీఎస్ లక్ష్మణ్ ప్రశాంతత, విజన్ క్రికెట్ అభిమానుల మనస్సులను హత్తుకుంది.
ఆధార్ కోసం తిరిగి తిరిగి ఆలసి.. కలెక్టరేట్‌లో ఆత్మహత్యాయత్నం..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.