జెన్ జీ విచ్ఛిన్నానికేనా రిజర్వేషన్ హటావో ఆందోళన?
Publish Date:Aug 24, 2026
Advertisement
ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా రిజర్వేషన్ హటావో’ పేరుతో యువత చేపట్టిన ఆందోళన ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. ఇటీవల నీట్ లీక్ కు వ్యతిరేకంగా జెన్ జీ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన దేశవ్యాప్తంగా విద్యార్థులను, నిరుద్యోగులను,యువతను ఐక్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జంతర్ మంతర్ వేదికగా జరుగుతున్న రిజర్వేషన్ హఠావో ఆందోళనలు ఆ ఐక్యతను దెబ్బతీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఒకవైపు పరీక్షల లీకేజీలు, పారదర్శకత లేకపోవడం, ఉద్యోగావకాశాల కొరతపై దేశవ్యాప్తంగా విద్యార్థి, యువత ఐక్యంగా ఉద్యమిస్తుంటే.. అదే సమయంలో అకస్మాత్తుగా రిజర్వేషన్ల తొలగింపు వివాదం తెరమీదకు వచ్చి ఆ ఐక్యతను విచ్ఛిన్నం చేసే దిశగా సాగడం పలు అనుమానాలకు దారి తీస్తోందంటున్నారు. సోషల్ మీడియాలో రిజర్వేషన్ హటావో ఆందోళన్ మిలియన్ల ఫాలోవర్లతో నెట్టింట జోరుగా ప్రచారం కావడం విశేషం. రిజర్వేషన్ వ్యవస్థపై సమగ్రమైన విశ్లేషణ చేసేందుకు ఒక జాతీయ పునఃసమీక్ష కమిషన్ను ఏర్పాటు చేయాలని, గత ఎనిమిది దశాబ్దాలుగా అమలులో ఉన్న రిజర్వేషన్ల ప్రభావంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆందోళన కారులు కోరుతున్నారు. అలాగే కులం కంటే ఆర్థిక పరిస్థితులకే ప్రాధాన్యతనిచ్చి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మరింత ఊతం ఇవ్వాలని, పోటీ పరీక్షల్లో కనీస అర్హత మార్కులను సమానంగా పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. 1990లో మందల్ కమిషన్ నివేదిక అమల్లోకి వచ్చిన సమయంలో దేశం ఎలాంటి సామాజిక మార్పులకు, ఘర్షణలకు లోనైందో, మళ్లీ అలాంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు రిజర్వేషన్ హటావో ఆందోళన (ఆర్ హెచ్ ఏ) ఆరంభమైందన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇప్పటికీ ఉన్నత విద్యాసంస్థల ఫ్యాకల్టీ పోస్టుల్లో షెడ్యూల్డ్ ఎస్సీఎస్టీ బీసీ వర్గాల ప్రాతినిధ్యం తక్కువగానే ఉందన్నది ప్రభుత్వ రికార్డుల ద్వారా తేటతెల్లం అవుతోంది. రాజ్యాంగంలోని సమానత్వ హక్కు , ఆర్టికల్ 15, ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన ప్రాతినిధ్యం ద్వారా లభించిన హక్కులు కేవలం కేటాయింపులు కావు అని, అవి దశాబ్దాల తరబడి వివక్షకు గురైన వర్గాలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి కల్పించిన రాజ్యాంగ రక్షణలు అని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వంటి నాయకులు స్పష్టం చేస్తున్నారు. రిజర్వేషన్ హటావో ఆందోళన్ నిర్వాహకుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని స్వయంగా కేంద్ర మంత్రి స్థాయి అధికారి ద్వారా చర్చలు జరుపుతామని కేంద్రం హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఉద్యోగాలు, విద్యావ్యవస్థలోని సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ వివాదాన్ని రగిలిస్తున్నారా అన్న అనుమానాలు పరిశీలకులలో బలంగా వ్యక్తమౌతున్న పరిస్థితి. Reservation Hatao Movement at Jantarmantar, Gen Z debate India, Jantar Mantar protest, Reservation reform demand, Indian affirmative action
http://www.teluguone.com/news/content/reservation-hatao-movement-at-jantarmantar-45-229660.html




