ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన ఎంపీ, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికిఏసీబీ కోర్టులో ఉపశమనం లభించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా గతంలో విధించిన కఠినమైన బెయిల్ నిబంధనలను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు సడలించింది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న సంగతి విదితమే. ఈ కేసులో అరెస్టైన మిధున్ రెడ్డికి గతంలో కోర్టు కండీషన్డ్ బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో బెయిలు మంజూరు చేసిన సమయంలో కోర్టు ఆయనకు ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయానికి వెళ్లి అధికారుల ఎదుట హాజరై సంతకం చేయాలనే నిబంధనను విధించింది.ఈ నిబంధనను తొలగించాలంటూ మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు.
మిధున్ రెడ్డి పిటిషన్ ను విచారించిన కోర్టు తాజాగా మిథున్ రెడ్డి ఇకపై ప్రతి వారం సిట్ కార్యాలయానికి హాజరై సంతకం చేయాలన్న షరతును రద్దు చేసింది. అలాగే గతంలో సిట్ అధికారుల వద్ద స్వాధీనం చేసిన ఆయన పాస్‌పోర్టును తిరిగి పొందేందుకు కోర్టు అనుమతించింది. లక్ష రూపాయల డిపాజిట్ చెల్లించి మిథున్ రెడ్డి పాస్‌పోర్టును వెనక్కి తీసుకోవచ్చని కోర్టు పేర్కొంది. ఈ నిబంధనల సడలింపు వల్ల మిథున్ రెడ్డికి భారీ ఊరట కలిగిందని చెప్పవచ్చు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/relief-for-mithun-reddy-in-acb-court-36-216994.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలనా వ్యవస్థను ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుం బిగించారు.
తమిళనాడు రాజకీయాలు మరోసారి హీటెక్కాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మరో కీలక లంచం కేసును బయటపెట్టారు.
ఉప్పల్ స్టేడియంలో లేడీ బౌన్సర్ హంగామా సృష్టించింది.
మెుహాలీలోని ఖరార్ ప్రాంతంలో ఈడీ దాడులు చేస్తుండగా సోదాలు జరుగుతున్న ప్రాంగణంలో నోట్ల కట్టలతో నిండిన బ్యాగులు దొరకడం హాట్ టాపిక్‌గా మారింది.
అదృష్టాన్ని నమ్ముకున్న ఆ అమెరికా దంపతులు దీర్ఘకాలంగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నారు.
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో టీవీకే అధినేత విజయ్‌కు ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ సినీ నటుడు విశాల్ ప్రశ్నించారు.
కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చువరీలో ఉన్న కుంకీ ఏనుగులకు.. ఈ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. మనుషులకు ఉండే ఆధార్ తరహాలోనే ఈ కార్డులను రూపొందించనుంది
మోదీ తన ఎక్స్ ఖాతా డీపీగా ఆపరేషన్ సిందూర్ ఫోటోను పెట్టుకొని సైన్యానికి గౌరవం ప్రకటించారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ మెరుపు దాడిని చేపట్టిన సంగతి తెలిసిందే.
చెన్నూరుకు చెందిన యోగేంద్ర కుమార్ వర్మ, హేమశ్రీ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కాలక్రమేణా ఆ స్నేహం ప్రేమగా మారింది. వారి మధ్య ఉన్న అనుబంధం ఎంతో బలమైనది. అయితే.. గత కొద్దిరోజులుగా వీరిద్దరి మధ్య చిన్నపాటి వివాదాలు తలెత్తినట్లు సమాచారం.