అమెరికాలో రిల‌య‌న్స్ ఆయిల్ రిఫైన‌రీ.. ఇండియా దౌత్య,వ్యాపార విజయం!

Publish Date:Mar 16, 2026

Advertisement

అమెరికాలో గ‌త యాభై ఏళ్లుగా ఎలాంటి గ్రీన్ ఫీల్డ్ రిఫైన‌రీ ఎందుకు నిర్మించ‌లేదు? ఆ దిశ‌గా ఎలాంటి ప్ర‌య‌త్న‌మూ జ‌ర‌గ‌లేదు.. ఎందుక‌ని? ఇందుకుగ‌ల కార‌ణాలేంటి? అస‌లు అమెరికా ఆయిల్ నుంచి ఇత‌ర మిన‌ర‌ల్స్ వ‌ర‌కూ బ‌య‌ట దేశాల‌పైనే  ఎక్కువ‌గా ఆధార‌ప‌డుతుంది కార‌ణాలు ఏమై ఉంటాయ్?  అంటే.. 
అమెరియా గ‌త అర్ధ శ‌తాబ్దంగా గ్రీన్ ఫీల్డ్ ఆయిల్ రిఫైన‌రీ నిర్మించ‌లేదు. ఇందుకు గ‌ల కార‌ణాలేంట‌ని  ప‌రిశీలిస్తే.. ఇక్క‌డ క‌ఠిన‌త‌ర‌మైన ప‌ర్యావ‌ర‌ణ నిబంధ‌న‌లుంటాయి. వీటినే ఈపీఏ రూల్స్ అంటారు. దానికి తోడు క్లీన్ ఎన‌ర్జీ అయిన ఈవీ, సోలార్ వైపు మొగ్గు చూప‌డం వ‌ల్ల కూడా ఇక్క‌డి కంపెనీల కొత్త రిఫైన‌రీల నిర్మాణానికి వెన‌కాడుతుంటాయి.  ప్ర‌స్తుతం ఒక ప‌క్క ర‌ష్యా- ఉక్రెయిన్ వార్ జ‌రుగుతుండ‌గా.. మ‌రో ప‌క్క  ఇరాన్- ఇజ్రాయెల్ వార్ లో అమెరికా ఇన్వాల్వ్ అయి ఉంది. ఈ యుద్ధాల కార‌ణంగా అమెరికా  ప‌దే ప‌దే ఆయిల్ సంక్షోభాన్ని  ఎదుర్కుంటోంది.  

కాగా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని  రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ ప్ర‌పంచంలోనే అతి పెద్ద రిఫైన‌రీని జామ్ న‌గ‌ర్ లో నిర్వ‌హిస్తోంది. తాజాగా ఇప్పుడు అమెరికాలో మ‌రో రిఫైన‌రీని స్థాపిస్తోంది. అమెరికాలో రిలయెన్స్ అంబానీ రిఫైనరీ  వెన‌క ప‌లు కార‌ణాలున్నాయి. ఈ రిఫైనరీని టెక్సాస్ లేదా లూసియానాలో ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.  రిల‌య‌న్స్ అమెరికాలోని టెక్సాస్ తీరంలో ఒక అత్యాధునిక చ‌మురు శుద్ధి క‌ర్మాగారాన్ని నిర్మించడమో లేదా,  మూత ప‌డిన క‌ర్మాగారాన్ని రీమోడ‌లింగ్ చేయ‌డానికో సిద్ధ‌ప‌డుతోంది. అమెరికాలో షెల్ ఆయిల్ పుష్క‌లంగా  ఉంది. అక్క‌డ రిఫైన్ చేసి నేరుగా యూరప్ లేదా అమెరికా మార్కెట్ల‌లో అమ్మ‌డం వ‌ల్ల ర‌వాణా ఖ‌ర్చులు భారీగా  త‌గ్గుతాయి. దీంతో భారీ లాభాలు కూడా వ‌స్తాయి. ఇక అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా  ఆయిల్ డిపెండెంట్ గా ఎన్నాళ్ళుంటాం,  అమెరికాలో కూడా చ‌మురు నిక్షేపాల‌ను వెలికి తీయండంటూ  పిలుపునిచ్చారు. దానికి తోడు మోడీతో ఉన్న ఫ్రెండ్ షిప్ తోడు కావడంతో అమెరికా ఇంధ‌న భ‌ద్ర‌త కోసం రిల‌య‌న్స్ వంటి  స‌మ‌ర్ధ‌వంత‌మైన సంస్థ‌ను ఆహ్వానించారు డోనాల్డ్ ట్రంప్.

ప్ర‌స్తుతం రిల‌య‌న్స్ అధ్వ‌ర్యంలో ఏర్పాటు చేయ‌నున్న రిఫైనరీ ప్ర‌త్యేక‌త ఏంటంటే.. ఇది కేవ‌లం పెట్రోలు మాత్ర‌మే కాకుండా.. పెట్రో కెమిక‌ల్స్, క్లీన్ హైడ్రోజ‌న్ ఉత్ప‌త్తికి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకు అనుగుణంగా దీనిని డిజైన్ చేస్తున్నారు.  ఒక ఇండియన్  కంపెనీ అమెరికా గ‌డ్డ‌పై చ‌మురును నియంత్రించ‌డం వ‌ల్ల.. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు పెరిగిన‌పుడు ఇదెంతో మేలు చేస్తుంది.  భార‌త్ కి ఎన‌ర్జీ సెక్యూరిటీ సైతం ల‌భిస్తుందని నిపుణులు అంచనావేస్తున్నారు.  అలాగే అమెరికా కంపెనీలు భ‌య‌ప‌డుతున్న చోట రిల‌య‌న్స్ రిస్క్ చేయ‌డం  కూడా  ఒక రకంగా ఇండియా  దౌత్య వ్యాపార విజ‌యగా అభివర్ణిస్తున్నారు. అమెరికా టెక్నాల‌జీ, ఇండియన్ మేనేజ్ మెంట్ అన్నది చాలా చాలా గ్రేట్ క్రేజీ కాంబో అంటున్నారు.  ఈ  రెండూ ఆయిల్ ఇండ‌స్ట్రీలో క‌ల‌వ‌డం వ‌ల్ల‌.. మార్కెట్ ని మ‌రింత శాసించ‌వ‌చ్చ‌ని విశ్లేషిస్తున్నారు.

అమెరికా గ‌త యాభై ఏళ్ల‌లో చేయ‌లేని ప‌నిని.. ఒక ఇండియన్ కంపెనీ చేసి చూపించడానికి ముందుకు రావడం ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా ఇది  ఆర్ధికంగా భార‌త్ ఎంత బ‌ల‌ప‌డుతోందో కూడా చాటుతోంది.  ఒక వేళ యుద్ధం కార‌ణంగా చ‌మురు సంక్షోభం త‌లెత్తితే.. రిల‌య‌న్స్ యూఎస్ లో స్థాపించ‌బోయే ఈ రిఫైన‌రీ వ‌ల్ల ఆ దేశం సేఫ్ జోన్ లోకి వెళ్తుంది.

By
en-us Political News

  
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
గుజరాత్ రాజధాని కోసం లక్షల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో 12 ఏళ్లు ఎందుకు తాత్సారం చేసిందంటూ కేంద్రాన్ని నిలదీశారు. అమరావతి బిల్లు ఆమోదం పొందడం అనేది.. ప్రభుత్వ విజయం కాదు, ఐదేళ్ల పాటు రోడ్లపై పోరాడిన అమరావతి రైతులు, మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు రేణుకా చౌదరి. సభలో అడ్డంకులు కలిగించిన ఇతర ఎంపీలపై తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసురుతూ, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టకండి అని గర్జించారు.
జగన్ రెడ్డి హేతురహిత రాజధాని ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమరావతికి పార్లమెంట్ చట్టబద్ధత కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న వేళ.. జగన్ రాష్ట్ర అసెంబ్లీలో ఆ చట్టాన్ని సవరించవచ్చంటూ కొత్త రాగం అందుకోవడాన్ని ఆయన అవగాహనా రాహిత్యానికి నిలువెత్తు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
అమరావతి విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు చాలా తప్పులు చేశారనీ, అవినీతికి పాల్పడుతున్నాననీ గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు జగన్ ఈ ప్రెస్ మీట్ లో వంత పాడారు. ఓ పక్క అమరావతికి వ్యతిరేకం కాదంటూనే వైసీపీ నేతలతో శ్రీకాకుళంలో సభ ఏర్పాటు చేయించారు.
2026 బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం, కొత్త పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఎలాంటి పన్ను ఉండదు. సెక్షన్ 87A కింద రిబేట్ కలిపి.. వీరికి వెస‌లుబాటు ఉంటుంది. స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ విష‌యానికి వ‌స్తే.. జీత‌భ‌త్యాలు పొందేవారికి ఇచ్చే స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప్ర‌యోజ‌నాలు ఈ కొత్త విధానంలో కూడా కొన‌సాగుతాయి.
సుమారు వెయ్యి కోట్ల సామ్రాజ్యాన్ని ఆయ‌న త‌న కుమారుడు గౌత‌మ్ సింఘానియాకు రాసిచ్చాక‌.. ప‌డ్డ పాట్లు వ‌ర్ణ‌నాతీతంగా వ‌ర్ణించారు ముఖ్య‌మంత్రి.
నారా లోకేశ్ రేపోమాపో పూర్తిస్థాయిలో చంద్రబాబునాయుడి రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా, యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేశ్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతిత్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.