కాంగ్రెస్ తెలంగాణ మేనిఫెస్టో  విడుదల 

Publish Date:May 3, 2024

Advertisement

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేసింది. లోక్ సభ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్పెషల్ మేనిఫెస్టోను శుక్రవారం హైదరాబాద్ లో విడుదల చేసింది. ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు అనే పేరుతో దీన్ని టీ కాంగ్రెస్ రూపొందించింది. కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షీ ఈ మేనిఫెస్టో తెలుగు కాపీని పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతోపాటు మరికొందరు నేతలు పాల్గొన్నారు. యువత, రైతులు, మహిళలు, కార్మికులకు న్యాయం చేసేలా మేనిఫెస్టో ఉందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. తెలంగాణకు అన్ని రకాలుగా న్యాయం చేసేలా దీన్ని తయారు చేశామని వివరించారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లు సాధించడం ద్వారా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో హామీలను అమలు చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు.

మేనిఫెస్టోలో హామీలు ఇవే..
– హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు
– హైదరాబాద్ కు ఐటీఐఆర్ ప్రాజెక్టు
– కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
– ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం
– హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు
– ఏపీలో కలిపిన 5 గ్రామాలు మళ్లీ తెలంగాణకు తీసుకొస్తాం
– పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా
– హైదరాబాద్ లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం
– రామగుండం–మణుగూరు మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణం
– నాలుగు కొత్త సైనిక్ స్కూళ్లు
– కేంద్రీయ విద్యాలయాల రెట్టింపు
– నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు
– రాష్ట్రానికి జాతీయ క్రీడా విశ్వవిద్యాలయం
– ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఆధ్వర్యంలో వైద్య పరిశోధన సంస్థ
– నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ
– రాష్ట్రానికి ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్ టీ)
– తెలంగాణకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ ఈఆర్) ఏర్పాటు
– సర్పంచులకు నేరుగా కేంద్రం నిధులు
– ప్రతి ఇంటికీ సొంత విద్యుత్ ఉత్పత్తి సంస్థ
– హైదరాబాద్ – బెంగళూరు మధ్య ఐటీ, పారిశ్రామిక కారిడార్
– హైదరాబాద్ – నాగ్ పూర్ పారిశ్రామిక కారిడార్
– హైదరాబాద్ – వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్
– అంతర్జాతీయ ప్రమాణాలతో సాంస్కృతిక, వినోద కేంద్రం
– సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.