రేగు పళ్లు అతిగా తింటున్నారా? ఈ నిజాలు తెలుసుకోండి..!

Publish Date:Jan 19, 2026

Advertisement


సీజన్ ను బట్టి లభించే పండ్లు చాలా ఉంటాయి.  అలాంటి వాటిలో రేగు పళ్లు చాలా ముఖ్యమైనవి.  అయితే రేగు పళ్లను  ఎవరు తిన్నా ఏం పర్వాలేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. కొందరు వ్యక్తులు  రేగు పళ్లను తినకూడదట.  అసలు రేగు పళ్లను ఎవరు తినకూడదు? దీనికి గల కారణాలు ఏంటి? రేగు పళ్లను తినడం వల్ల ఎవరికి సమస్యలు ఉంటాయి? వివరంగా తెలుసుకుంటే..

సీజన్ ను బట్టి వివిధ రకాల పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి.  ఆరోగ్యం బాగుండాటంటే సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవడం మంచిదని అంటుంటారు వైద్యులు, పెద్దలు. శీతాకాలంలో లభించేవి రేగు పళ్లు. చాలామంది రేగుపళ్లను చాలా ఉత్సాహంగా తింటారు.  ఇవన్నీ చిన్నతనంతో ముడిపడిన ఆనందాలు.

కొంతమందికి మాత్రం రేగు పళ్లు తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే అవకాశం ఉంది.

ఎవరు తినకూడదంటే..

మధుమేహం ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండాలి. బాగా పండిన రేగు పండ్లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని పెంచుతాయి.

కేవలం చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండటమే కాకుండా వాటిలో కార్బోహేడ్రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయి.  ఈ కారణంగా రేగు పండ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

రేగు పండ్లలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది.  అప్పటికే గ్యాస్,  ఎసిడిటీ,  అజీర్తి మొదలైన సమస్యలు ఉన్నవారు రేగు పండ్లను తింటే సమస్య మరింత పెరుగుతుంది.

గర్బిణీ స్త్రీలు రేగు పండ్లకు దూరంగా ఉండాలి.   రేగు పండ్లు తినడం వల్ల వారికి కడుపులో సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అలాగే మలబద్దకం లాంటి సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి.

కొంతమందికి రేగు పండ్లు తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.  దద్దుర్లు,  దురద వంటి సమస్యలు వస్తాయి.  అలర్జీ సమస్యలు ఉన్నవారు రేగు పండ్లకు దూరంగా ఉండటం మంచిది.

                                  *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...    

By
en-us Political News

  
gut microbiome, dysbiosis, gut brain connection, gut health, gut bacteria, good bacteria, bad bacteria, TeluguOne Health,
Avoid These Pulses During the Rainy Season,Stay Away from These Pulses,Dont Eat These Pulses During the Monsoon
ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.
రక్తంలో క్లాట్స్ ఏర్పడకుండా ఉండేందుకు, రక్త ప్రసరణను మెరుగుపరచేందుకు, బరువు నియంత్రణకు తోడ్పడే వంటింటి సహజ చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు..
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి..
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు...
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు టీ, కార్శీరీ ఖవ్వా టీ, జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి...
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో..
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా..
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు, TIA హెచ్చరికలు, గోల్డెన్ పీరియడ్‌లో చికిత్స, నివారణ మార్గాలను ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ ఈ వీడియోలో వివరించారు...
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.