వర్షాకాలంలో పెరుగు తినడం మంచిదేనా? ఆరోగ్య నిపుణులు ఏం చెప్తున్నారంటే!

Publish Date:Jul 7, 2026

Advertisement

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు.

వర్షాకాలంలో పెరుగు తినవచ్చా?

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది.

వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు..

వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది.

పెరుగు ఎలా తింటే శ్రేష్టం..

 పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం.

పెరుగు ఎవరు తినకూడదు?

జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు,
రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

                                  *రూపశ్రీ.

By
en-us Political News

  
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.
రోజూ కొన్ని నిమిషాలు ఓం చాంటింగ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అని అందరూ అంటారు, కానీ నేటి వేగవంతమైన జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. చాలామంది ఆరోగ్యం అంటే కేవలం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లేదా కఠినమైన ఆహార నియమాలు పాటించడమే అని అనుకుంటారు.
అంజీర్ పండు (Fig Fruit) ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందించే పండు. తాజా అంజీర్ అయినా, ఎండిన అంజీర్ అయినా సరైన పద్ధతిలో తీసుకుంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం.
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
మారుతున్న వాతావరణంతో, పిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరినీ కడుపునొప్పి, గ్యాస్, దగ్గు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
పంటి నొప్పి, పిప్పిపంటి, పంటి సెన్సిటివిటీ, చిగుళ్ల నుంచి రక్తం రావడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతుంటాయి. నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారిలో ఒత్తిడి, ఆందోళన, అలసట, ఏకాగ్రత తగ్గడం వంటి ఇబ్బందులు కనిపించవచ్చు. ఇలాంటి సమయంలో ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు యోగా, ప్రాణాయామం కూడా కొంతమందికి ఉపయోగకరంగా ఉండొచ్చు.
సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ టు ఈట్ ఆహార పదార్థాలపై Best Before,Use By, Expiry Date వంటి పదాలు కనిపిస్తుంటాయి,చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు.
ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా గుర్తించాలి? అనే విషయాలను ఈ వీడియోలో డాక్టర్ ఆర్. బాలాజీ సులభంగా వివరిస్తున్నారు.
మునగాకు (Moringa Leaves) మనకు ప్రకృతి అందించిన పోషక విలువలు ఉన్న ఆహారాల్లో ఒకటి. మునగాకులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.