చాలామంది పేదవాళ్లుగానే ఉండిపోవడానికి అసలు కారణాలు ఇవే..!

Publish Date:May 25, 2026

Advertisement

భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే  వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో  ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి.  అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది.  మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే..

టీవి, పోన్..

చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది.  టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి.  టీవిలో ఛానెల్స్ కానీ,  స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు.  పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది.   జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి,  స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు.

అలవాట్లు,  అభిరుచులు..

ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు,  అభిరుచులు ఉండవు.  అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు.

లక్ష్యాలు..

ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి.  లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం,  జ్ఞానాన్ని ఆర్జించడం,  ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది.

కంఫర్ట్ జోన్..

చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం.  ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు. ఉన్న సంతోషం,  ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు.  కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు.

అదృష్టం..

ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ,  గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు.

ఇతరులను నిందించడం..

నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద  ఉద్యగం తెచ్చుకునేవాడిని,  నాకు  బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు.  తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు.

 పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు.

                           *రూపశ్రీ.

By
en-us Political News

  
కరివేపాకు మరియు వేప ఆకులలో ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది? పోషకాలు, బయోయాక్టివ్ సమ్మేళనాలు మరియు ఏ ఆకును ఎలా తినాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కడుపులో అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు, అజీర్తి మరియు కడుపు మంటతో బాధపడుతున్నారా? మజ్జిగ, వెల్లుల్లి, తేనె, పసుపు వంటి వంటింటి చిట్కాలతో ఈ సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి.
వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఆరోగ్యకరమైన, కమ్మనైన బీరకాయ పెరుగు కూరను ఎంతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకోండి.
భారతీయులలో సంపద పెరిగేకొద్దీ గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. కోటీశ్వరులు మరియు నిరంతరం ధనవంతులుగా ఉన్నవారిలో హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ వెబ్ స్టోరీ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి.
పెసలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు, మధుమేహం నియంత్రణ, గుండె ఆరోగ్యం, బరువు తగ్గింపు మరియు పోషక విలువల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
ప్రముఖ నటి అదా శర్మ షేర్ చేసిన బ్లాక్ మిల్క్ (నల్ల పాలు) తయారీ విధానం మరియు వాటి వల్ల చర్మం, జుట్టుకు కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల పూర్తి వివరాలు.
జిమ్ వ్యాయామాలు వెన్నుముకను శాశ్వతంగా పాడుచేస్తాయా? సరైన పద్ధతిలో బరువులు ఎత్తడం ఎలా, ఏ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
మీ ఇంటి ఫ్లోరింగ్ లేదా బాత్రూమ్ టైల్స్ మధ్యలో ఉన్న సిమెంట్ లైన్స్ నల్లగా మారిపోయాయా? ఖరీదైన కెమికల్స్ లేకుండా ఇంట్లోని వస్తువులతోనే టైల్స్ గ్యాప్స్‌ను సులభంగా, సురక్షితంగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
ఎలాంటి ప్రయత్నం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గడం క్యాన్సర్‌కు సంకేతమా? డాక్టర్ల హెచ్చరికలు, గుర్తించాల్సిన ఇతర ముఖ్యమైన లక్షణాలు మరియు ఆరోగ్య జాగ్రత్తల పూర్తి వివరాలు.
కడుపు నిండా తిన్నా పోషకాల లోపం వేధిస్తోందా? హిడెన్ హంగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కలిగే ప్రమాదాలు మరియు ICMR NIN సూచించిన సహజ ఆహార చిట్కాల గురించి ఈ వెబ్ స్టోరీలో తెలుసుకోండి.
మహిళలు తమ కుటుంబ ఆరోగ్యం కోసం తయారుచేసుకునే పొన్నగంటి ఆకు రోటి పచ్చడి తయారీ విధానం మరియు కంటిచూపు మెరుగుదల, కొలెస్ట్రాల్ నియంత్రణ వంటి పూర్తి వివరాలు.
మన జీవితంలో చాలా సమయం ఆఫీసులోనే గడుస్తుంది. అలాంటప్పుడు సహోద్యోగులతో మంచి అనుబంధం ఏర్పడటం చాలా సహజం.
అక్టోబర్ 15వ తేదీ అనగానే భారతదేశానికి, ముఖ్యంగా విద్యార్థి లోకానికి ఒక అపారమైన స్ఫూర్తి గుర్తుకువస్తుంది. భారతరత్న,
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.