గతంలో కంటే నేటి జనరేషన్ లో విడాకులు ఎక్కువయ్యాయి.. కారణాలు ఇవే..!
Publish Date:Jul 15, 2025
.webp)
Advertisement
నేటి జనరేషన్ లో యువ జంటలలో విడాకులు తీసుకోవడం పద్దతి వేగంగా పెరుగుతోంది. గతంలో వివాహం చేసుకుంటే జీవితాంతం కలిసుండేవారు. కానీ ఇప్పుడు చాలా జంటలు వివాహం అయిన కొన్ని సంవత్సరాలు, నెలల తర్వాత విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ విడిపోతున్నట్లు ప్రకటించారు. 7 సంవత్సరాల వివాహ బంధాన్ని ఇంతటితో ముగిస్తున్నట్టు స్పష్టం చేశారు. కేవలం సెలబ్రిటీలే కాదు.. నేటి కాలంలో సాధారణ కుటుంబాలలో కూడా వివాహం తర్వాత విడాకుల తంతు చాలా ఎక్కువగానే జరుగుతోంది. యువ జంటలు విడిపోవడానికి అనేక సామాజిక, మానసిక, ఆచరణాత్మక కారణాలు ఉండవచ్చు. అలాంటి 5 ప్రధాన కారణాలు తెలుసుకుంటే..
సహనం ఓర్పు..
నేటి యువ జంటలలో మునుపటి కాలంతో పోలిస్తే సహనంలో చాలా లోపాలు కలిగి ఉన్నారు. చిన్న సమస్యలకు వాదించుకోవడం, దానిని పరిష్కరించుకోవడానికి బదులుగా సంబంధాన్ని వదిలివేయడం ఒక సాధారణ ధోరణిగా మారింది. గొడవ నుండి పారిపోవాలనే ధోరణి కారణంగా బార్యాభర్తల మధ్య విడాకుల సమస్యకు దారితీస్తోంది.
స్వేచ్ఛ, సెల్ఫ్ స్పేస్..
నేటి యువకులు ఎక్కువ స్వేచ్ఛ, పర్సనల్ స్పేస్ కావాలని కోరుకుంటారు. వివాహం తర్వాత, భాగస్వామి యొక్క అంచనాలు వారి స్వేచ్ఛకు అడ్డంకిని సృష్టిస్తే వారు దానిని తట్టుకోలేక విడాకులు తీసుకోవడం లేదా విడిపోయే మార్గాన్ని ఎంచుకోవడం చేస్తున్నారు.
కెరీర్, ఆర్థిక ఒత్తిడి..
పెరుగుతున్న పోటీ, కెరీర్ గురించి ఆలోచనలు, ఆర్థిక అస్థిరత కారణంగా యువ జంటలు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఈ ఒత్తిడి సంబంధాలను ప్రభావితం చేస్తుంది. కొన్నిసార్లు పరస్పర అవగాహన లేకపోవడం జరుగుతుంది.
సోషల్ మీడియా, బాహ్య ప్రభావాలు..
సోషల్ మీడియాలో కనిపించే ఆదర్శ జీవితం, గ్లామర్ జంటలలో తప్పుడు అంచనాలను ఏర్పరుస్తాయి. వారు తమ సంబంధాన్ని ఇతరులతో పోల్చుకుంటారు. ఇది అసంతృప్తికి, భార్యాభర్తల మధ్య దూరం ఏర్పడటానికి దారితీస్తుంది.
కమ్యూనికేషన్ గ్యాప్, భావోద్వేగ సంబంధం లేకపోవడం..
సంబంధాలకు కమ్యూనికేషన్ అతిపెద్ద పునాది. కానీ భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ తగ్గడం ప్రారంభించినప్పుడు, అపార్థాలు పెరుగుతాయి. ఇది కాకుండా ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సంబంధం లేకపోవడం కూడా సంబంధం విచ్ఛిన్నానికి దారితీస్తుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/reasons-why-couples-get-divorced-35-202021.html












