పిల్లలలో మొబైల్ వ్యసనం.. ఇలా మాన్పించేయవచ్చు..!

Publish Date:Aug 13, 2025

Advertisement

 


నేటి డిజిటల్ యుగంలో పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచడం ప్రతి తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఆటలు, యూట్యూబ్, సోషల్ మీడియా, ఇవన్నీ పిల్లలను ఎంతగా ఆకర్షిస్తాయంటే వారు బయటి ప్రపంచం నుండి దూరమైపోతారు. ఇది వారి చదువులను ప్రభావితం చేయడమే కాకుండా  కళ్ళకు కూడా చాలా ప్రమాదం. మరీ ముఖ్యంగా ఇలా ఫోన్ కు బానిస అయిపోవడం అనేది పిల్లల సామాజిక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల జరుగుతున్న నష్టాలేంటి? ఫోన్ నుండి పిల్లలను దూరం ఉంచడం ఎలా? తెలుసుకుంటే..

నష్టాలు..

ఫోన్ చేతిలో ఉంటే చాలు.. పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడానికి ఇష్టపడరు. బదులుగా వారు ఎక్కువ సమయం మొబైల్‌లోనే గడుపుతారు. ఈ రోజుల్లో ఒక సంవత్సరం పిల్లవాడు కూడా మొబైల్‌లో వీడియోలు చూపిస్తేనే  ఆహారం తింటాడు, లేకుంటే ఏడుస్తూనే ఉంటాడు. మరోవైపు, 14 ఏళ్ల టీనేజర్ బాలుడు కూడా పాఠశాల నుండి వచ్చిన తర్వాత మొబైల్‌తో బిజీగా ఉంటాడు. ఫోన్ లో గేమ్స్.. ఆటలు,  యూట్యూబ్‌లో గంటల తరబడి గడుపుతాడు.  మొబైల్ ఫోన్ వాడటం వల్ల వారి సామాజిక, శారీరక,  మానసిక అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే అయినా..  కొన్ని చిన్న మార్పులు,  స్మార్ట్ ట్రిక్స్‌తో పిల్లలు మొబైల్‌కు బానిసల్లా మారడాన్ని  చాలా వరకు తగ్గించవచ్చు. ఇందుకోసం కింది టిప్స్ పాటించవచ్చు.

స్క్రీన్ టైమ్ ఫిక్స్ చేయాలి..

మొబైల్ వ్యసనాన్ని తగ్గించడానికి, పిల్లల స్క్రీన్ టైమ్ కోసం ఒక నియమాన్ని రూపొందించాలి.  ప్రతిరోజూ మొబైల్ వాడకానికి ఒక సమయాన్ని ఫిక్స్ చేయాలి. తద్వారా పిల్లవాడు రోజంతా మొబైల్ వాడకుండా ఆ సమయానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తాడు. ఇది క్రమంగా  మొబైల్ వ్యసనం నుండి బయటపడేలా చేస్తుంది.

యాక్టివిటీస్..

పెయింటింగ్, కథలు, బయటకు వెళ్లి ఆడుకోవడం, ఆర్ట్స్,క్రాప్ట్స్ ద్వారా పిల్లల దృష్టిని మొబైల్ ఫోన్ల నుండి మళ్లించవచ్చు. వారి మొబైల్ వినియోగాన్ని తగ్గించడానికి వారిని ఇంటరాక్టివ్ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి.

కుటుంబం..

పిల్లలలో ఉన్న మొబైల్ వ్యసనాన్ని మాన్పించడానికి పిల్లలతో ఆడుకోవాలి. వారితో మాట్లాడాలి, మొబైల్ కంటే కుటుంబంతో ఎక్కువ ఆనందం ఉందని వారికి అనిపించేలా చేయాలి. ఒక పిల్లవాడు బోర్ కొట్టినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు, అతను మొబైల్ వాడటం ఒక వ్యసనంగా మారుతుంది. కానీ అతను తన పరిసరాలతో లేదా కుటుంబంతో ఆనందించడం ప్రారంభించినప్పుడు మొబైల్‌ను మరచిపోయి కుటుంబంతో సమయం గడుపుతాడు.

 ఎంపిక..

పిల్లలు వినోదం కోసం లేదా సమయం గడపడానికి మొబైల్‌ను ఉపయోగిస్తారు. ఈ కారణాన్ని అర్థం చేసుకుని వారికి మొబైల్‌కు ఇతర ప్రత్యామ్నాయాలను అందించాలి. ఉదాహరణకు.. పజిల్స్, బోర్డ్ గేమ్‌లు, పుస్తకాలు,  పిల్లల కోసం సంగీతం వంటి ఎంపికలను ఉండేలా చూడాలి. ఇది పిల్లలలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది,  మొబైల్ వ్యసనాన్ని తగ్గిస్తుంది.

రోల్ మోడల్స్..

పిల్లలు తాము చూసేది నేర్చుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు  రోజంతా మొబైల్‌లో గడుపుతూ ఉంటే  పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి  మొబైల్ వాడకాన్ని  పరిమితం చేసుకోవాలి. తల్లిదండ్రుల దినచర్య, తల్లిదండ్రులు చేసే పనుల దృష్ట్యా పిల్లలు కూడా చక్కని దినచర్య అలవర్చుకుంటారు.  పిల్లలకు తల్లిదండ్రులే మంచి రోల్ మోడల్స్ కావాలి.

                                      *రూపశ్రీ.

By
en-us Political News

  
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా..
వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా...
వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు, రెండు కుటుంబాలు , రెండు విభిన్న మనస్తత్వాల కలయిక కూడా.  పెళ్లి తర్వాత ప్రతి జంట తమ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది..
నేటి కాలంలో ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా జిమ్ వెళ్లేవారు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు...
మీ జుట్టు మీ అందానికి ఒక కిరీటం వంటిది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలి, కాలుష్యం మరియు రసాయనాల వాడకం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతింటోంది. మీ జుట్టును ఒత్తుగా, పొడవుగా మరియు ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం...
ప్రేమించిన వారిని వదిలి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్నారా? మీ జీవితం మరియు మీ భాగస్వామి భవిష్యత్తు కోసం ఈ విషయాలు తప్పక తెలుసుకోండి...
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు...
పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది...
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి...
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ...
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే..
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది....
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.